Shukra Gochar 2023: మేషరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి కష్టాలు మెుదలు..

Shukra Gochar 2023: మార్చి 12న శుక్రుడు మేషరాశిలోకి వెళ్లబోతున్నాడు. శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు కొందరికి సమస్యలను సృష్టించనుంది. ఆ అన్ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2023, 01:54 PM IST
Shukra Gochar 2023: మేషరాశిలోకి ప్రవేశించబోతున్న శుక్రుడు.. ఈ 3 రాశుల వారికి కష్టాలు మెుదలు..

Shukra Gochar 2023: ఐశ్వర్యం, ఆనందాన్ని ఇచ్చే శుక్రుడు మరో రెండు రోజుల్లో అంటే మార్చి 12, ఆదివారం ఉదయం 8.37 గంటలకు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఏప్రిల్ 6 ఉదయం 11.10 గంటల వరకు అక్కడే ఉండనున్నాడు. అనంతరం వృషభరాశిలోకి ప్రవేశిస్తుంది. శుక్రుడి రాశి మార్పు కొందరికి శుభప్రదంగా ఉండనుంది. ఆస్ట్రాలజీలో శుక్రుడి సంచారాన్ని శుభప్రదంగా భావిస్తారు. అయితే ఈసారి జరగబోయే  శుక్రుడి సంచారం వల్ల కొన్ని రాశులవారు ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. శుక్రుడి రవాణా సమయంలో ఏ రాశులవారు జాగ్రత్తగా ఉండాలో తెలుసుకుందాం. 

శుక్ర సంచారం ఈరాశులకు కష్టకాలం
వృషభం
ఈ రాశి యెుక్క పన్నెండవ ఇంట్లో శుక్రుడు సంచరించబోతున్నాడు. పైగా వృషభరాశి యెుక్క ఆరవ మరియు లగ్నానికి అధిపతి. శుక్రుడి సంచారం వల్ల మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోండి. దాంపత్య జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. 
తులారాశి
తుల రాశి యెుక్క ఏడవ ఇంట్లో శుక్రుడు సంచరిస్తాడు. శుక్రుడు లగ్నానికి మరియు ఎనిమిదవ ఇంటికి అధిపతి. మీరు వ్యాపారంలో అనేక సమస్యలను ఎదుర్కోంటారు. ఆఫీసులో కూడా సమయం అంతగా కలిసిరాదు. బంధుత్వాలు కొంత మేరకు బాగానే ఉంటాయి. 
వృశ్చిక రాశి
శుక్రుడు ఈ రాశి యెుక్క ఆరవ ఇంట్లో సంచరిస్తున్నాడు. శుక్రుడి సంచారం ఈ రాశివారికి మంచిది కాదనే చెప్పాలి. మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మీరు ప్రతి విషయానికి ఎక్కువ కష్టం చేయాల్సి ఉంటుంది. అనుకున్న ఫలితాలు రావు. మెుత్తానికి ఈ సమయం మీకు చాలా నష్టాలను ఇస్తుంది. 

Also read: Mangal Gochar 2023: మరో 3 రోజుల్లో ఊహించని ఘటన.. ప్రపంచంపై పెను ప్రభావం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News