Ashadh Amavasya 2022: హిందూ శాస్త్రాల్లో ప్రతీ నెల వచ్చే అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అమావాస్య తిథి ప్రతి నెలలో కృష్ణ పక్షం చివరి రోజు వస్తుంది. ఈసారి అమావాస్య బుధవారం (జూన్ 29) నాడు వస్తోంది. పితృ దోషం నుంచి బయటపడేందుకు ఆషాఢ అమావాస్య రోజున కొన్ని పరిహారాలు సూచించబడ్డాయి.
అమావాస్య తిథి సమయం :
అమావాస్య తిథి జూన్ 28వ తేదీ ఉదయం 5:52 గంటలకు ప్రారంభమై జూన్ 29వ తేదీ ఉదయం 8.21 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం జూన్ 29వ తేదీని అమావాస్యగా పరిగణిస్తారు. ఈ రోజున పవిత్ర నదిస్నానం, దాన ధర్మాలు చేస్తారు.
పితృ దోష పరిహారాలు :
ఆషాఢ అమావాస్య రోజున పవిత్ర నదిస్నానం తర్వాత పూర్వీకులకు నీటి తర్పణం చేస్తారు. నల్ల నువ్వులను నీటిలో సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల పూర్వీకుల ఆత్మ సంతృప్తి చెంది వారి అనుగ్రహం లభిస్తుంది.
ఈ రోజున శ్రాద్ధం కూడా చేయాల్సి ఉంటుంది. అమావాస్య రోజున శ్రాద్ధం చేయడం వల్ల పూర్వీకుల వల్ల కలిగే దుఃఖాల నుంచి విముక్తి లభిస్తుంది.
పితృ దోషం తొలగిపోవాలంటే ఆషాఢ అమావాస్య రోజున పూర్వీకులకు పిండదానం చేయాలి. ఇలా చేయడం వల్ల పూర్వీకులు సంతృప్తి చెంది.. వారి సంతానాన్ని ఆశీర్వదిస్తారు.
పూర్వీకులను సంతృప్తి పరచడానికి బ్రాహ్మణులకు అన్నదానం చేస్తారు. దానంతో పాటు దక్షిణ ఇస్తారు. ఈ చర్యలు పూర్వీకులను సంతృప్తి చెందిస్తాయి.
అమావాస్య నాడు ఇంట్లో గరుడ పురాణం చదవడం అన్నివిధాలా శుభం కలగజేస్తుందని నమ్ముతారు.
ఆషాఢ అమావాస్య నాడు పూర్వీకులను శాంతింపజేసేందుకు పశుపక్షాదులకు తిండి గింజలు పెట్టాలి. కాకి, కుక్క, ఆవు వంటి జంతువులకు ఆహారం అందించాలి.
మనసు నిండా పూర్వీకులను తలుచుకుని.. భక్తి, శ్రద్ధలతో వారికి నమస్కరించి.. మీ కోర్కెలను, బాధలను వారికి చెప్పుకున్నట్లయితే తగిన ఫలితం పొందుతారు.
(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook