Pitra Dosha: పితృ దోషం వెంటాడితే అంతా అశుభమే.. ఈ నియమాలు పాటిస్తే అశుభాలన్నీ తొలగిపోతాయి..

Pitra Dosh Remedies : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి యొక్క జాతక దోషాలు జీవితంలో అనేక సమస్యలకు ప్రధాన కారణం. ఈ లోపాలలో, పిత్ర దోషం అనేది వ్యక్తి ఆర్థిక స్థితి, కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 16, 2022, 12:26 PM IST
  • పితృ దోషం వెంటాడితే అన్నీ అశుభాలే
  • కెరీర్‌లో ఆశించిన పురోగతి ఉండదు
  • ఆర్థికపరంగా ఇబ్బందులు చుట్టుముడుతాయి
  • పితృ దోష నివారణకు ఈ నియమాలు పాటిస్తే మంచి ఫలితం ఉంటుంది
 Pitra Dosha: పితృ దోషం వెంటాడితే అంతా అశుభమే.. ఈ నియమాలు పాటిస్తే అశుభాలన్నీ తొలగిపోతాయి..

Pitra Dosh Remedies : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జాతకంలో గ్రహాల స్థానం వ్యక్తుల జీవితాలపై ప్రభావం చూపుతుంది. గ్రహ సంచారం మాత్రమే కాదు, కొన్ని దోషాలు కూడా వ్యక్తులపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా పితృ దోషం లాంటివి వెంటాడితే ఆ వ్యక్తి కోలుకోలేడు. అంటే.. ఎంత కష్టపడినా, ఎంత కృషి చేసినా ఫలితం శూన్యమే. ఆర్థిక కష్టాలు చుట్టుముడుతాయి. జీవితాంతం అశుభాలు వెంటాడుతాయి. మరి ఈ పితృ దోషం నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం... 

పితృ దోషం అశుభం :

జ్యోతిష్య శాస్త్రంలో పితృ దోషాన్ని అశుభకరమైన, దురదృష్టకరమైన అంశంగా అభివర్ణించారు. ఎందుకంటే జాతకంలో పితృ దోషం ఉన్న వ్యక్తులు కెరీర్‌లో పురోగతి సాధించలేరు. వృత్తి, వ్యాపారాలలో ఆర్థిక పురోగతి ఉండదు. పైగా ఇంట్లో అసమ్మతి, అశాంతి నెలకొంటుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగదు. 

పితృ దోషాన్ని ఎలా వదిలించుకోవాలి :

అమావాస్య రోజున పూజలు, తర్పణం-శ్రాద్ధం, దానం చేస్తే పూర్వీకులను ప్రసన్నం చేసుకుంటారు.

వీలైతే రోజూ ఉదయాన్నే తలస్నానం చేసి ఆ నీళ్లలో నల్ల నువ్వులు, అక్షత వేసి పితృ దేవతలకు సమర్పించాలి.

మధ్యాహ్నం పూట రావి చెట్టుకు నీరు, పూలు, అక్షతం, పాలు, గంగాజలం, నల్ల నువ్వులు సమర్పించి పూర్వీకుల ఆశీస్సులు పొందండి. ఏ వ్యక్తి ఏ చెట్టును నరికివేయకూడదు. అలాగే, రావి చెట్టు కొమ్మలు నరకడం, చెట్టు వద్ద చెత్త వేయడం చేయకూడదు. దీని వల్ల పితృ దోషం కలుగుతుంది.

పితృ దోష నివారణకు అమావాస్య, పూర్ణిమ లేదా పితృ పక్షంలో శ్రాద్ధం చేయాలి. ఈ చర్యతో అతని పూర్వీకుల నుంచి ఆశీర్వచనాలు పొందుతారు. 

శ్రాద్ధలో, పూర్వీకులు ఇష్టపడే ఆహారాన్ని తయారు చేసి, బ్రాహ్మణుడికి గౌరవంగా తినిపించాలి. వీలైతే పేదలకు కూడా అన్నదానం చేయాలి.

వృత్తి-వ్యాపారంలో అడ్డంకులు తొలగిపోవడానికి, పేదలకు అవసరమైన వస్తువులను దానం చేయండి. ఈ నియమాలు పాటించడం ద్వారా పితృ దోషాలు తొలగిపోయి కెరీర్‌లో పురోగతి సాధ్యపడుతుంది. అలాగే కుటుంబ జీవితం వికసిస్తుంది.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Also Read: Virata Parvam: సాయి పల్లవి వ్యాఖ్యలతో చిక్కుల్లో విరాటపర్వం.. సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ నెటిజన్ల ఆగ్రహం..  

Also Read Lemon And Curd For Hair: జుట్టు సమస్యల నుంచి ఇలా సులభంగా విముక్తి పొందండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News