Pitru Paksham 2023: సెప్టెంబర్ 29 నుంచి 15 రోజులు పొరపాటున కూడా ఆ తప్పులు చేయవద్దు, లేకపోతే దివాళా ఖాయం

Pitru Paksham 2023: సనాతన హిందూధర్మంలో కొన్ని ప్రత్యేక సందర్బాలు, రోజులకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. ఈ సందర్భాల్లో ఏం చేయాలి, ఏం చేయకూడదనే వివరాలు జ్యోతిష్య శాస్త్రంలో వివరంగా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదంటారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 4, 2023, 06:58 AM IST
Pitru Paksham 2023: సెప్టెంబర్ 29 నుంచి 15 రోజులు పొరపాటున కూడా ఆ తప్పులు చేయవద్దు, లేకపోతే దివాళా ఖాయం

Pitru Paksham 2023: హిందూమత విశ్వాసాల ప్రకారం పితృపక్షానికి అమితమైన విశిష్టత ఉంది. ప్రతి యేటా 15 రోజులుంటే పితృపక్షం ఈసారి సెప్టెంబర్ 29 నుంచి ప్రారంభం కానుంది. అందుకే జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని నియమ నిబంధనలు ప్రస్తావించి ఉన్నాయి. ఏం చేయాలి, ఏం చేయకూడదనే వివరాలున్నాయి.

 హిందూమతం ప్రకారం పితృపక్షం రోజుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలి. కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదు. లేకపోతే కుటుంబం మొత్తానికి ఇబ్బందులు తప్పవని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు. హిందూమత విశ్వాసాల ప్రకారం పితృపక్షంలోని ఈ 15 రోజుల్లో మరణించిన కుటుంబీకుల ఆత్మ శాంతికై శ్రార్ధం, పిండ ప్రదానం చేస్తారు. పూర్వీకులకు తర్పణ ఇవ్వడం వల్ల వారి ఆశీర్వాదం కుటుంబంపై ఉంటుందట. ఈ సమయంలో చాలా రకాల పనులకు నిషిద్ధముంది. పితృపక్షం ఎప్పట్నించి ప్రారంభం కానుంది, ఏం చేయాలి, ఏం చేయకూడదో వివరంగా తెలుసుకుందాం.

పితృపక్షంలో రోజూ ఉదయాన్నే లేచి నియమ నిష్టలతో పూజలు చేయాలి. ఆ తరువాత పూర్వీకుల్ని గుర్తు చేసుకుని భోగమివ్వాలి. ఇంటిపైకెక్కి కాకులు, ఇతర జంతుజీవాలకు ఆహారం, నీరు పెట్టాలి. మధ్యలో కూడా ఓసారి పాయసం చేసి జంతువులకు, పశుపక్ష్యాదులకు, కాకులకు పెట్టాలి. పితృపక్షం రోజుల్లో పూర్వీకులు పావురం లేదా పక్షుల రూపంలో ఇంటికొస్తారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందుకే భోజనం, నీరు వంటి ఏర్పాట్లు సదా చేసి ఉంచాలి. 

జ్యోతిష్య శాస్త్రంలో పితృపక్షం రోజుల్లో  ఏం చేయకూడదో వివరంగా ఉంది. ముఖ్యంగా వెల్లులి, ఉల్లిని ఈ 15 రోజులు వాడకూడదంటారు. ఎందుకంటే వెల్లుల్లి, ఉల్లి రెండూ ప్రతీకార స్వభావం కలిగినవిగా భావిస్తారు. అందుకే శ్రార్ధం సమయంలో ఈ రెండు పదార్ధాలు లేకుండా చూసుకోవాలి. ఈ సమయంలో పొరపాటున కూడా మద్యం, మాంసం ముట్టకూడదు

పితృపక్షం ఎప్పుడు ప్రారంభమౌతుంది

జ్యోతిష్య పండితుల ప్రకారం పితృపక్షం అనేది ప్రతి యేటా భాద్రపద మాసంలోని శుక్లపక్షం పౌర్ణిమ నాడు ప్రారంభమౌతుంది. ఇది ఈ ఏడాది సెప్టెంబర్ 29న ఉంది. అశ్విని మాసంలోని కృష్ణపక్షంలో అమావాస్య నాడు పితృపక్షం పూర్తవుతుంది. ఈ 15 రోజుల సమయంలో అత్యంత భక్తి శ్రద్ధలతో, నియమ నిష్ఠలతో తర్పణ, పిండదానం, శ్రార్ధం పెట్టాల్సి ఉంటుంది. 

Also read: Janmashtami 2023: కృష్ణ జన్మాష్టమి సెప్టెంబర్ 7వ తేదీన ఇలా చేస్తే మీ ఇంట్లో అంతులేని ధనం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News