Astro Tips for Money: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. మీకు డబ్బుకు లోటు ఉండదు!

Astro Tips for Money: సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి తగినంత డబ్బు కలిగి ఉండటం చాలా ముఖ్యం. కానీ చాలాసార్లు మనం ఎంత కష్టపడినా ఆదాయం పెరగదు. ఒక వేళ పెరిగినా అది ఇంట్లో ఉండదు.     

Edited by - ZH Telugu Desk | Last Updated : May 16, 2022, 12:31 PM IST
Astro Tips for Money: ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే.. మీకు డబ్బుకు లోటు ఉండదు!

Astro Tips for Money: డబ్బు కష్టాలు, ధన నష్టం, దుబారా సమస్య ఉండటం సర్వసాధారణం. చాలా మంది ప్రజలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. డబ్బును సక్రమంగా నిర్వహించలేకపోవడం, గృహ దోషాలు, జాతక దోషాలు, చెడు అలవాట్లు... డబ్బు (Money) లేకపోవడానికి ప్రధాన కారణాలు. డబ్బు సంబంధిత సమస్యలను దూరం చేయడంలో చాలా ప్రభావవంతంగా ఉండే కొన్ని పరిహారాలు జ్యోతిష్యంలో (Astrology) చెప్పబడ్డాయి. మీరు తీసుకునే ఈ చర్యలు డబ్బు కొరత నుండి మిమ్మల్ని కాపాడతాయి. డబ్బు నష్టాన్ని నివారించటంతోపాటు మీ ఇంట్లో డబ్బు ప్రవాహాన్ని పెంచుతుంది. 

డబ్బు సంపాదించడానికి మార్గాలు
**ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు కష్టాలు తీరకపోతే... ఇంటి పెద్దలు రోజూ తెల్లచందనం తిలకం రాసి ఇంట్లో వంట గదిలో భోజనం చేయాలి. ఇది డబ్బు రావడానికి కొత్త మార్గాలను సృష్టిస్తుంది. 
**ఐశ్వర్యాన్ని పొందాలంటే డబ్బుకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహం అవసరం. ఇందుకోసం అమావాస్య రాత్రి ఇంటి ఈశాన్యంలో ఆవు నెయ్యి దీపం వెలిగించాలి. అలాగే, కాటన్ విక్‌కు బదులుగా, అందులో ఎర్రటి కాటన్ దారం లేదా కలవా ఉపయోగించండి. అలాగే కుంకుమపువ్వును నెయ్యిలో వేయండి. అలాంటి దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది.
**సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవికి దక్షిణవర్తి శంఖం చాలా ప్రీతికరమైనది. ఇది లక్ష్మీదేవి రూపంగా పరిగణించబడుతుంది. ఇంట్లో ఖర్చులు అనవసరంగా పెరిగిపోతూ, అదుపు చేయలేకపోతే గురువారం నాడు దక్షిణావర్తి శంఖంలో పాలు పోసి విష్ణుమూర్తికి అభిషేకం చేయండి. దీంతో అనవసర ఖర్చుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే డబ్బు వచ్చే మార్గాలు కూడా ఉంటాయి.

Also Read: Lunar Eclipse 2022: నేడే చంద్రగ్రహణం... ఈ 3 రాశులవారికి కష్టకాలం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News