Dreams Interpretation: కలల రహస్యమేంటి, ఆ కలలు వస్తే పదోన్నతి, గౌరవ మర్యాదలు ఖాయం

Dreams Interpretation: కలలు చాలా రకాలుగా ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం ప్రతి కలకు ఏదో ఒక అర్ధం లేదా సంబంధం ఉంటుంది. మీకు అలాంటి కలలు వస్తుంటే..ఇక పదోన్నతులు, కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయని అర్ధం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 6, 2022, 08:35 PM IST
Dreams Interpretation: కలల రహస్యమేంటి, ఆ కలలు వస్తే పదోన్నతి, గౌరవ మర్యాదలు ఖాయం

Dreams Interpretation: కలలు చాలా రకాలుగా ఉంటాయి. జ్యోతిష్యం ప్రకారం ప్రతి కలకు ఏదో ఒక అర్ధం లేదా సంబంధం ఉంటుంది. మీకు అలాంటి కలలు వస్తుంటే..ఇక పదోన్నతులు, కీర్తి ప్రతిష్ఠలు కలుగుతాయని అర్ధం..

జ్యోతిష్యంలోని స్వప్నశాస్త్రం ప్రకారం..నిద్రలో వచ్చే కలలకు అర్ధాలు, పరమార్ధాలుంటాయి. ప్రతి కలకు శుభ అశుభ పరిణామాలుంటాయి. కలలనేవి భగవంతుడు పంపించే సందేశాలా లేదా రోజంతా జరిగే ఘటనలకు రూపమా అనేది ఓ ప్రశ్న. జ్యోతిష్యశాస్త్రంలో కలలకు విశేష మహత్యముంది. ప్రత్యేకించి గ్రహాల కదలికతో సంబంధముంటుంది. ఈ సంసారమనేది ఓ కలలాంటిదని..నిద్ర నుంచి మేల్కొనగానే కల ఏ విధంగా అబద్ధమైపోతుందో..అదే విధంగా ఆత్మజ్ఞానం కలిగినప్పుడు సంసారం కూడా అబద్ధమౌతుందని రుషులు చెబుతారు.

ప్రతి కలకు ఏదో ఒక అర్ధం

రోజూ చాలా రకాల కలలు వస్తుంటాయి. ప్రతి కలకు ఏదో ఒక అర్ధం లేదా ఏదైనా సంకేతం ఉంటుంది. ఫలితంగా శుభ, అశుభ పరిణామాలుంటాయి. 

కలలో ఒకవేళ మీరు భూమి నుంచి లేచినట్టు లేదా ఎగురుతున్నట్టు కన్పిస్తే..గౌరవ మర్యాదలు లభిస్తాయి. కలలో ఎంత ఎత్తులో ఎగిరినట్టు కన్పిస్తే..అంతగా కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయి. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. 

కలలో దివ్యమైన పీఠం లేదా పూజా ప్రదేశం కన్పిస్తే జీవితమంతా దుఖం, ఆర్ధిక సమస్యలు తగ్గిపోతాయి. జీవితమంతా సుఖమయంగా ఉంటుంది. 

ఎవరైనా అవివాహిత అమ్మాయి ముఖాన్ని కప్పుకుని కన్పిస్తే..వెంటనే మంచి సంబంధంతో వివాహం జరుగుతుందని అర్ధం.

ఎవరైనా వ్యక్తి కలలో..మెరిసే చెప్పులు ధరించినట్టు కన్పిస్తే..ఆ వ్యక్తికి గౌరవ మర్యాదలు ప్రాప్తిస్తాయి. సమాజంలో స్థాయి పెరుగుతుంది. 

కలలో మిఠాయిల తయారీ కన్పిస్తే ఆ వ్యక్తికి సుఖం, ధనం, పెండింగులో ఉన్న డబ్బులు, అప్పిచ్చిన డబ్బులు తిరిగి వస్తాయని అర్ధం.

కలలో మరణించిన వ్యక్తి లేదా వ్యక్తులతో మాట్లాడటం శుభ పరిణామంగా భావిస్తారు. కలలో వేడి నీళ్లు తాగినట్టుగా కన్పిస్తే..అశుభంగా భావిస్తారు. 

ఒకవేళ కలలో నాణ్యమైన మద్యం తాగుతూ కన్పిస్తే..ఆ వ్యక్తికి శుభంగా, ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. 

కలలో గుడ్లు కన్పిస్తే..ధనలాభం కలుగుతుంది. అదే యాపిల్స్ కన్పిస్తే..వ్యక్తికి సాఫల్యం లభిస్తుంది. 

కలలో ఎవరికైనా..నవ్వుతున్న ముఖం కన్పిస్తే ఆ వ్యక్తికి అంతా ఆనందమే కలుగుతుంది. పసుపు ముఖం కన్పిస్తే మాత్రం రోగాలకు సంకేతం.

Also read; Kanya Sankranti 2022: కన్యా సంక్రాంతి ఎప్పుడు? పుణ్య కాల ముహూర్తం, ప్రాముఖ్యత తెలుసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News