Devotees must follow Lord Shiva puja and remedies on monday: సోమవారం శివుడికి ఎంతో ముఖ్యమైనదని జ్యోతిష్యులు చెబుతుంటారు. అందుకే శివుడిని ప్రసన్నం చేసుకొవడానికి సోమవారం రోజున చాలా మంది ప్రత్యేకంగా పూజలు, వ్రతాలు చేస్తుంటారు. శివుడు అభిషేక ప్రియుడు. అందుకే సోమవారంనాడు పాలు, పెరుగు. పంచదార, చక్కెర,నెయ్యిలతో అభిషేకం చేస్తే ఆయన ఎంతో ఆనందపడిపోతాడంటారు. అదే విధంగా వివిధ ఫలాలతో కూడా శివుడిని పూజిస్తే మన మనస్సులోని కోరికలు అన్ని నెరవేరుతాయి.
శివపూజా విధానం:
పరమ శివుడిని సోమవారం నాడు తెలుపు వస్త్రాలు కట్టుకుని, తెల్లని పూలు,పంచాభిషేక ద్రవ్యాలతో పూజలుచేయాలి. ముఖ్యంగా రుద్రం, నమకం, శివ అష్టోత్తర నామాలతో శివుడిని పూజించాలి. శివుడికి చక్కెరతో అభిషేకం చేస్తే గొప్ప రాజయోగం కల్గుతుంది. అన్నంతో అభిషేకం చేస్తే జీవితంలో అన్నపాదాలకు ఎప్పుడు కూడా తక్కువ ఉండదు. అంతేకాకుండా.. నాగ సహిత యాగం నిర్వర్తించడం వల్ల కూడా శివుడి అనుగ్రహాం మనకు కల్గుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అందుకే శివుడిని పై విధంగా పూజలు చేయాలి. శివ పూజలో భస్మం, బిల్వపత్రిలు ఎంతో ప్రధానమైందని చెప్తుంటారు. ఇది పూజలో ఉపయోగించవచ్చు.
Read more: Moodami 2024: మూఢాలున్నాయని టెన్షన్ పడుతున్నారా..?..డోంట్ వర్రీ.. ఈ శుభకార్యాలు చేసుకోవచ్చు..
శివుడికి నీళ్లతో అభిషేకం చేసేటప్పుడు మన చేతి వేళ్లు శుభ్రంగా ఉంచుకునేలా చూసుకొవాలి. మంచి నీళ్లతోనే శివుడికి అభిషేకం చేయాలి. చితాభస్మం సమర్పించాలి. అది కుదరనప్పుడు మాములుగా గంధం పొడిని ఆ శివుడికి పెట్టవచ్చు. అంతేకాకుండా శివుడికి తెల్లపూలు, బిల్వపత్రం సమర్పించాలి. శివుడికి పారిజాత పూలు సమర్పిస్తుండాలి.
శివకుటుంబం ఫోటోను పూజలో ఉండేలా చూసుకొవాలి. అలా ఉంటే మన ఇల్లుకూడా సిరిసంపదలతో ఉంటుందని చెబుతుంటారు. అంతేకుండా.. గణేషుడి పూజ వల్ల మన విఘ్నాలు దూరం చేస్తాడు.అంతేకాకుండా ..అమ్మవారి అనుగ్రహం వల్ల మనకు సంభవించే అనేక రకాల దోషాలు, చెడు ప్రయోగాల ప్రభావాలు దూరమైతాయని చెబుతుంటారు. శివుడికి వీరభద్రుడిని పరమ భక్తుడి చెప్తుంటారు. ఆయన మనల్ని చెడుచేసే వారిపైన తగిన విధంగా పనిష్మెంట్ చేస్తుంటారు. అందుకు ప్రతిరోజు పూజలో శివకుంటుంబంతో పాటు. వీరభద్రుడికి విధిగా పూజించాలి. ఇలా పూజిస్తేమనకు చనిపోయిన వారి వల్ల ఏదైన దోషాలు సంభవిస్తే, లేదా పెళ్లి తొందరగా కుదరకుంటే, జీవితంలో కాలసర్పదోషాలున్న కూడా శివపూజ వల్ల అవన్ని పరిహారమైపోతాయి. అందుకే సోమవారం శివుడిని భక్తితో పూజించే మనకు ఈ జన్మలోలేదా గత జన్మల వల్ల కలిగే చెడు ప్రభావాలు అన్ని కూడా దూరమైపోతాయి.
Read More: Malavya Raja Yoga 2024: మాళవ్య రాజయోగం.. మే తొలివారంలో ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..
శివుడు భోళా శంకరుడు. ఇతర దేవుళ్లు తొందరగా మన కష్టాలను దూరం చేయరు. కానీ శివుడు మాత్రం తొందరగా మనం అనుకోగానే మన బాధలను దూరం చేస్తాడంటారు.అందుకే దానవులు ఎల్లప్పుడు కూడా శివారాధన మాత్రమే చేస్తుండేవారు. దానవులు గురువులు శుక్రాచార్యుడు కూడా శివుడి గురించి ఎక్కువగా పూజలు, హోమాలు, తపస్సులు చేసి వరాలు కొరుకొమ్మనేవారు. శివుడుభోళా శంకరుడు కాబట్టే.. దానవులు అడిగిన వరాలను కాదనకుండా ఇచ్చి తన లైఫ్ ను చాలా సార్లు రిస్క్ లో వేసుకున్నాడు. కానీ అమ్మవారు, ఇతర దేవతలు, శివయ్యను తర్వాత కాపాడటం మనం హిందు పురాణాలలో కథలుగా చదువుకున్నాం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter