Shani Bhagwan: శనివారం రోజు ఈ తప్పులు అస్సలు చేయోద్దు.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

Avoid these things on Saturday: శనిదేవుడిని కర్మ ప్రభువుగా చెప్తుంటారు. ఆయన మనం చేసిన మంచి, చెడులకు అదే విధంగా ఫలితాలు కూడా ఇస్తుంటారు. ద్వాదశ రాశులపై శనిప్రభావం ఎంతో కీలకంగా ఉంటుందని కూడా జ్యోతిష్యులు చెప్తుంటారు.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 5, 2024, 10:20 PM IST
  • శనివారం రోజున నియమాలు..
  • హనుమంతుడు, వెంకటేశ్వరుడిని ఆరాధించాలంట..
Shani Bhagwan: శనివారం రోజు ఈ తప్పులు అస్సలు చేయోద్దు.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

Avoid these things on saturday sadesati effect: మనలో చాలా మంది ఏలినాటి శని, అర్దష్టమ శని, సాడేసాతి శని ప్రభావంతో బాధపడుతుంటారు. శని ప్రభావం వల్ల సదరు జాతకుడిలో కొన్ని అనూహ్యమైన మార్పులు సంభవిస్తాయి.  శని ప్రభావం వల్ల ఓవర్ నైట్ లో రాజు పేదవాడు కావచ్చు.. అదే విధంగా పేదవాడు సైతం రాజుగామారుతాడని చెప్తుంటారు. శనిభగవానుడు సూర్యుడి కుమారుడు, ఆయన సోదరుడు యముడు. శనిదేవుడిని ప్రసన్నం చేసుకుంటే మన జీవితంలో అనేక సమస్యలను నుంచి బైటపడోచ్చు. ఇదిలా ఉండాగా శనివారం రోజున కొన్ని తప్పులు చేయోద్దని జ్యోతిష్య పండితులు చెప్తుంటారు. వీటిని తప్పకుండా పాటిస్తే శనిదోశం వంటివి అస్సలు కల్గవు. లేకుంటే శని చెడు ప్రభావానికి గురికావాల్సి ఉంటుంది. 

Read more: Pawan kalyan: సూర్యుడి ఆరాధన ఎందుకు చేస్తారు..?.. పవన్ కళ్యాణ్ ఆదిత్యారాధన వెనుక కారణం అదేనా..?

శనివారం చేయాకూడనివి..

శనివారం రోజున ఇంట్లో ఉదయం నిద్రలేవాలి. అదే విధంగా పూజాది కార్యక్రమాలు చేసుకొవాలి. కానీ  శనివారం రోజున షాపుల్లోకి వెళ్లి నూనె, నల్లటి బట్ట వంటివి అస్సలు తెచ్చుకోవద్దు. అదే విధంగా నల్ల నువ్వులు సైతం ఇంటికి తీసుకొని రావోద్దని పండితులు చెప్తుంటారు. అంతేకాకుండా.. లోహపు వస్తువులు, కొత్త బట్టల కొనడం వంటివి అస్సలు చేయకూడదు.  ముఖ్యంగా ఈరోజు శనిప్రభావంతో బాధపడే వారు ఎలాంటి పనులు కూడా చేయోద్దు. చెప్పులు, నల్లగొడుగు, ఇనుము ఇంటికి తెచ్చుకొవద్దు.

శనిదేవుడికి ఇష్టమైన దేవుళ్లు..

శనిదేవుడికి వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి అంటే ఎంతో ఇష్టమైన దేవుళ్లని చెప్తుంటారు. అందుకే ఈరోజున వెంకటేశ్వర స్వామిని, ఆంజనేయ స్వామిని భక్తితో పూజించాలి. అంతేకాకుండా.. స్వామి వారికి వడపప్పు సమర్పించాలి. హనుమంతుడికి తమలపాకుల మాలను సమర్పించాలి. శనిదేవుడికి తైలాభిషేకం, నల్లటి బట్టలను సమర్పించాలి. నల్లనువ్వులు వేసిన కూడా ఆయన సంతోషిస్తాడని చెప్తుంటారు.

Read more: Snakes dance: పాముల సయ్యాట.. పచ్చని పొలంలో అరుదైన ఘటన.. వైరల్ వీడియో..

శనికి ఇష్టమైన జీవులు..

శనిదేవుడికి కాకి వాహనంగా ఉంటుందని చెప్తుంటారు. అందుకు కాకికి ఏదైన తినేపదార్థం వేయాలి. అంతేకాకుండా.. నల్లటి కుక్కకు సైతం చపాతీలు, అన్నంలాంటివి వేస్తే మంచి జరుగుతుందని పండితులు చెప్తుంటారు. నపుంసకులకు ఏదైన దానం చేయాలి. పేదలకు అన్నదానం, వస్త్రదానంలాంటివి చేస్తే శనిదేవుడి అనుగ్రహం కల్గుతుందని పండితులు చెప్తుంటారు. నవధాన్యాలు, తైలాభిషేకాల వంటివి చేస్తే శనిదోష ప్రభావం నుంచి ఏలినాటి , అర్దాష్టమ , సాడేసాతి బాధితులు బైటపడతారని జ్యోతిష్యులు చెప్తుంటారు.  (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News