Bhadrapad Pradosh 2022 Vratam: ప్రతి నెలా రెండు ప్రదోష వ్రతాలు ఉంటాయి. ఈసారి ప్రదోష వ్రతం భాద్రపద మాసంలో వస్తుంది. ఈ మాసం మెుదటి ప్రదోష వ్రతం 24 ఆగస్టు 2022, బుధవారం నాడు వస్తుంది. దీనినే బుధ ప్రదోష వ్రతం (Bhadrapad Pradosh 2022 Vratam) అని కూడా అంటారు. ఈరోజున శివుడిని పూజిస్తారు. ఈ వ్రత శుభ సమయం, పూజ విధానం గురించి తెలుసుకుందాం.
శుభ ముహూర్తం
కృష్ణ పక్ష త్రయోదశి తిథి ప్రారంభం - 24 ఆగస్టు 2022, ఉదయం 08:30
కృష్ణ పక్ష త్రయోదశి తేదీ ముగింపు- 25 ఆగస్టు 2022, ఉదయం 10:37
ప్రదోష వ్రత పూజ సమయం- సాయంత్రం 06:52 నుండి రాత్రి 09:04 వరకు.
పూజ వ్యవధి - 02 గంటల 18 నిమిషాలు
ప్రదోష వ్రతం 2022 పూజ విధానం
>> సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం ప్రదోష వ్రతాన్ని పాటిస్తారు. ఈ రోజున తెల్లవారుజామునే నిద్రలేచి స్నాన చేసి ఉపవాస దీక్షను స్వీకరిస్తారు.
>> శివపార్వతులను, వినాయకుడిని షోడపాచారాలతో పూజిస్తారు.
>> సాయం సంధ్య కాలాన్ని ప్రదోష కాలం అంటారు. ఈ సమయంలో శివుడిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు.
>> ప్రదోష కాలంలో భార్యాభర్తలు కలిసి శివుడికి జలాభిషేకం చేయండి. అనంతరం బిల్వపత్రాలు, దాతురా, పువ్వులు, ధూపం, దీపాలు, స్వీట్లు మొదలైన వాటిని సమర్పించండి.
>> శివ చాలీసాను పఠించడం ద్వారా పార్వతీపరమేశ్వరులు సంతోషంగా ఉంటారు. దీంతో భార్యభర్తల మధ్య బంధం బలపడుతుంది.
>> వ్రత కథ చదివి, చివరిగా హారతి ఇచ్చి ఉపవాసంను విరమించండి. ప్రదోష వ్రతం వల్ల మనిషి రోగాల, దోషాలు, బాధల నుండి విముక్తి లభిస్తుంది. మీ ఇంట్లో డబ్బుకు ఎప్పుడూ లోటు ఉండదు.
Also Read: Budh Gochar 2022: కన్యా రాశిలో బుధుడి సంచారం... ఏ రాశివారికి లాభం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook