Budh Gochar 2022: తులరాశిలో బుధుడి సంచారం.. ఏ రాశివారికి లాభం, ఏ రాశివారికి నష్టం..

Baudh Gochar 2022: గ్రహాల రాకుమారుడైన బుధుడు ప్రస్తుతం తులరాశిలో సంచరిస్తున్నాడు. దీంతో కొన్ని రాశులవారు లాభపడనుండగా.. మరికొందరు సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 4, 2022, 05:11 PM IST
Budh Gochar 2022: తులరాశిలో బుధుడి సంచారం.. ఏ రాశివారికి లాభం, ఏ రాశివారికి నష్టం..

Budh Gochar 2022: బుధుడు ప్రస్తుతం తులారాశిలో సంచరిస్తున్నాడు. నవంబర్ 13న బుధుడు తన స్థానాన్ని వృశ్చికరాశిలోకి మారుస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధుడు అక్టోబర్ 26 నుండి తులారాశిలోనే (Budh Gochar 2022) సంచరిస్తున్నాడు. ఈ సమయంలో ఏ రాశులవారికి నష్టం జరుగుతుంది, ఏ రాశులవారికి లాభం చేకూరుతుందో తెలుసుకుందాం. 

బుధ సంచారం ఈరాశులకు లాభం
వృషభం (Taurus): బుధ గ్రహ సంచారం ఈ రాశి వారికి లాభిస్తుంది. డబ్బు సంపాదించడానికి చాలా అవకాశాలు ఉండవచ్చు. అయితే, ఈ సమయంలో మీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. ఆఫీసులో మీకు సమయం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. 
మిధునరాశి (Gemini): ఈ రాశి వారికి బుధ గ్రహం సపోర్టు లభిస్తుంది. పాత సమస్యలు పరిష్కారమవుతాయి. మీ ఆదాయం కూడా పెరగవచ్చు. ఇంట్లో మీ గౌరవం పెరుగుతుంది.
కర్కాటకం (Cancer): ఈరాశి వారు అపారమైన ధనాన్ని పొందుతారు. ఉద్యోగస్తుల ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇంట్లో శాంతి నెలకొంటుంది. విద్యార్థులు చదువులో ఎదురయ్యే సమస్యలను అధిగమిస్తారు. 
కన్య (Virgo): ఈ రాశి వారు సుఖ సంతోషాలను పొందగలరు. ఆదాయం పెరగడంతో మీరు మీ పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. పెట్టుబడి నుండి మంచి రాబడిని పొందే అవకాశం కూడా ఉంది.

బుధ సంచారం ఈరాశులకు నష్టం
మేషరాశి (Aries): ఈ రాశి వారికి బుధుడు తృతీయ, ఆరవ గృహాలకు అధిపతి. దీంతో ఈరాశులవారి ఖర్చులు పెరుగుతాయి. మీరు ఆకస్మిక యాత్రకు కూడా వెళ్ళవలసి రావచ్చు. దీని వల్ల మీరు ఆర్థిక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆరోగ్యం కూడా క్షీణించవచ్చు.
తులారాశి (Libra): ఈ రాశి వారికి ఖర్చులు పెరగవచ్చు మరియు ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. ఈ కాలంలో ఎలాంటి పెట్టుబడులు పెట్టవద్దు, లేకుంటే నష్టాలు రావచ్చు. మీరు డబ్బు ఆదా చేయడంలో కూడా విఫలం కావచ్చు.

Also Read: Mangal Vakri 2022: మార్స్ తిరోగమనం.. ఈ 4 రాశుల వారికి కష్టకాలం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News