Mercury Margi 2023: రాబోయే నెల రోజులపాటు ఈ రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

Mercury Margi 2023: రీసెంట్ గా మేషరాశిలో బుధుడి యెుక్క ప్రత్యక్ష కదలిక మెుదలైంది. మెర్క్యూరీ యెుక్క ఈ మార్పు కొందరి జీవితాల్లో వెలుగులు నింపనుంది. బుధుడి సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 16, 2023, 07:04 PM IST
Mercury Margi 2023: రాబోయే నెల రోజులపాటు ఈ రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..

Budh Margi 2023 Effect: ఆస్ట్రాలజీలో బుధుడిని గ్రహాల రాకుమారుడిగా పిలుస్తారు. నిన్ననే మెర్క్యూరీ మేషరాశిలో నేరుగా నడవడం మెుదలపెట్టాడు. బుధుడి యెుక్క ప్రత్యక్ష కదలిక కొన్ని రాశులవారిపై సానుకూల ప్రభావం చూపనుంది. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.

మిధునరాశి
మేషరాశిలో మెర్క్యురీ సంచారం మిథునరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం డబల్ అవుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీ కోరికలన్నీ నెరవరుతాయి. పెండింగ్ లో  ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ లవ్ సక్సెస్ అవుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 

కర్కాటక రాశి
బుధుడి ప్రత్యక్ష కదలిక కర్కాటక రాశి వారికి శుభప్రదంగా ఉండబోతోంది. మీ కెరీర్ దూసుకుపోతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. ఆఫీసులో సహచరుల సపోర్టు లభిస్తుంది. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. 

కన్య  రాశి
గ్రహాల యువరాజు ట్రాన్సిట్ కన్యా రాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీకు పూర్వీకుల ఆస్తి దక్కుతుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిన డబ్బు  లాభాలను ఇస్తుంది. మీ పనితీరుకు ప్రశంసలతోపాటు ప్రమోషన్ కూడా వస్తుంది. విద్యార్థులకు ఈ సమయం బాగుంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. 

ధనుస్సు రాశి
మేషరాశిలో బుధుని సంచారం ధనుస్సు రాశి వారికి కలిసి వస్తుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. వ్యాపారం విస్తరిస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు జాబ్ చేంజ్ అవ్వడానికి ఇదే మంచి సమయం. మీలో సృజనాత్మకత పెరుగుతుంది. 

Also Read: Venus transit 2023: జూన్ లో ఈ 4 రాశులవారు భారీగా డబ్బు పొందబోతున్నారు.. మీరున్నారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News