Palmistry: మీ అరచేతి వేళ్ల మధ్య గ్యాప్ అంత ఉంటే... దురదృష్టం మీ వెంటే..!

Palmistry: అరచేతి వేళ్ల మధ్య గ్యాప్ ద్వారా మన భవిష్యత్తును తెలుసుకోవచ్చు. వేళ్ల మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండటం వల్ల లాభమా? నష్టమా? ఇప్పుడు తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 3, 2022, 11:51 AM IST
Palmistry: మీ అరచేతి వేళ్ల మధ్య గ్యాప్ అంత ఉంటే... దురదృష్టం మీ వెంటే..!

Space Between Fingers Meaning: సాధారణంగా మన ఊళ్లల్లో చూసే ఉంటాం. చేతిలోని రేఖలను చూసి జ్యోతిష్యుడు మీ ఫ్యూచర్ ఇలా ఉండబోతుందని చెప్పేస్తాడు. వారు అలా చెప్పడానికి హస్త సాముద్రిక శాస్త్రమే (Palmistry) ప్రామాణికం. ఈ హస్త సాముద్రిక శాస్త్రం ద్వారా వ్యక్తి యెుక్క అరచేతిని చూసి భవిష్యత్తును, వ్యక్తిత్వాన్ని తెలుసుకోవచ్చు. చేతి వేళ్ల మధ్య ఉండే గ్యాప్ ద్వారా కూడా వ్యక్తి యెుక్క లైఫ్ ఎలా ఉండబోతుందో చెప్పవచ్చు. వేళ్ల మధ్య గ్యాప్ మామూలుగా ఉంటే పెద్దగా పట్టింపు లేదు, కానీ గ్యాప్ ఎక్కువగా ఉంటే ప్రమాదమనే చెప్పాలి. 

వేళ్ల మధ్య వ్యత్యాసం ద్వారా భవిష్యత్తును తెలుసుకోండి
>> చేతిలోని చిటికెన వేలు, ఉంగరపు వేలు మధ్య గ్యాప్ ఎక్కువ ఉన్నవారు వృద్ధాప్యంలో ఇబ్బందులు పడతారు. ఈ వ్యక్తులు తమ జీవితపు చివరి అంకంలో చాలా బాధలు పడే అవకాశం ఉంది.
>>  మధ్య వేలికి, చూపుడు వేలికి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటే అలాంటి వారు బాల్యంలో కష్టాలు ఎదుర్కొంటారు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వీరి జీవితం గాడిన పడుతుంది.  
>>  మధ్య వేలు, చూపుడు వేలు మధ్య గ్యాప్ సాధారణంగా ఉంటే.. అటువంటి వ్యక్తులు కఠినమైన పోరాటం తర్వాత మాత్రమే విజయం సాధిస్తారు.
>>  ఉంగరపు వేలు నిటారుగా మరియు పొడవుగా ఉంటే, ఆ వ్యక్తి డబ్బు పరంగా అదృష్టవంతుడు అనే చెప్పాలి. 
>>  హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం, వేళ్ల మధ్య ఎక్కువ గ్యాప్ ఉండకపోవడమే మంచిది. వారి జీవితం ఏ ఇబ్బందులు లేకుండా గడిచిపోతుంది. 

Also Read: Vastu Tips for Tortoise: తాబేలు మీ ఇంట్లో ఉంటే.. ధనలక్ష్మీ మీ వెంటే..! 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News