Chaitra Purnima 2023: చైత్రమాసంలో వచ్చే పౌర్ణమిని చైత్ర పూర్ణిమ అంటారు. హిందూ మతంలో ఈ పూర్ణిమకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజున శ్రీహరిని పూజించడం వల్ల మీకు పుణ్యఫలం లభిస్తుంది. ఉత్తర భారతదేశం అంతటా చైత్ర పూర్ణిమ రోజున హనుమాన్ జయంతిని కూడా జరుపుకుంటారు. ఈరోజున స్నాన దానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చైత్ర పూర్ణిమ ఎప్పుడు, పూజా విధానం మరియు ప్రాముఖ్యత గురించి తెలుసుకోండి.
చైత్ర పౌర్ణమి ఎప్పుడు?
హిందూ పంచాంగం ప్రారం, చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 05 ఉదయం 09:19 నుండి మరుసటి రోజు ఏప్రిల్ 06 ఉదయం 10:04 వరకు ఉంటుంది. ఉపవాసం ఏప్రిల్ 05న, స్నానం ఏప్రిల్ 06న ఉంటుంది.
పూజా విధానం
ఈ రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి పవిత్ర నదిలో స్నానం చేసి మంత్రాలు చదివి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఈ రోజున శ్రీ మహావిష్ణువుతోపాటు రాత్రిపూట చంద్రుడిని కూడా పూజించాలి. అనంతరం ధాన్యం అవసరం ఉన్నవారికి దానం చేయండి.
చైత్ర పూర్ణిమ ప్రాముఖ్యత
ఈ రోజునే శ్రీ కృష్ణుడు మహారాసలీలను ఆడాడు. ఈ రోజున శ్రీకృష్ణుడు రాత్రంతా ప్రతి గోపికతో నృత్యం చేశాడు. ఈ రోజున రామాయణం పఠించడం కూడా ఒక ముఖ్యమైన ఆచారంగా భావిస్తారు. దానానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు దానం చేయడం ద్వారా.. మీరు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి.
Also Read: Mercury transit 2023: వచ్చే 2 నెలలపాటు ఈ 5 రాశులకు అదృష్టం, వద్దన్నా డబ్బు.. ఇందులో మీ రాశి ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి