Guru Gochar 2023: భారతీయ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాలు నిర్దిష్ట సమయం తర్వాత తమ రాశిని మార్చుకుంటాయి. కొన్ని ప్లానెట్స్ వెంటనే రాశిని ఛేంజ్ చేస్తే.. మరికొన్ని దీర్ఘకాలంలో మారుస్తాయి. ఈ క్రమంలో 12 ఏళ్ల తర్వాత అంటే ఏప్రిల్ నెలలో బృహస్పతి తన రాశిని మార్చనున్నాడు. మీనరాశిని వదిలిపెట్టి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. జ్యూపిటర్ యెుక్క ఈ సంచారం కొన్ని రాశులవారి అదృష్టాన్ని ప్రకాశింపజేయనుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం.
మిథునరాశి
బృహస్పతి మీ రాశిచక్రం యొక్క 11వ ఇంటిలో సంచరిస్తాడు. దీంతో మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. మీరు మానసికంగా మరియు శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. పాతపెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. వ్యాపారులు పెద్ద పెద్ద ఒప్పందాలను కుదుర్చుకుంటారు.
మకర రాశి
బృహస్పతి మీ రాశి నుండి నాల్గవ ఇంటిలో సంచరిస్తాడు. దీంతో మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెద్ద మెుత్తంలో డబ్బును పొందుతారు. అంతేకాకుండా భారీగా లాభాలను గడిస్తారు. ఈ సమయంలో ఏదైనా వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో మంచి సంబంధాలు ఉంటాయి.
తులా రాశి
బృహస్పతి మీ రాశిచక్రంలోని ఏడవ ఇంటిలో సంచరిస్తాడు. పార్టనర్‌షిప్‌తో పనిచేయడం వల్ల ప్రయోజనం పొందుతారు. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. ఆర్థికంగా మీరు బలపడతారు. మెుత్తానికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook