Vemulawada Temple: వన దేవతల జాతరతో రాజన్న ఆలయానికి భక్తుల కిటకిట..ఫోటోస్‌..

Vemulawada Temple: వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయానికి భక్తుల తాకిడి పెరిగింది. మేడారం వనదేవతలు సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా భక్తులు రాజన్న ఆలయాని భారీగా చేరుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 5, 2024, 11:57 AM IST
Vemulawada Temple: వన దేవతల జాతరతో రాజన్న ఆలయానికి భక్తుల కిటకిట..ఫోటోస్‌..

Vemulawada Temple: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి భక్తులు సోమవారం పెద్ద ఎత్తున పోటెత్తారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ జాతర దగ్గర పడుతుండడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. భక్తులంతా తెల్లవారి జామునే భక్తులు స్నానాలు చేసి, రాజన్నకు ఎంతో ఇష్టమైన కోడెమొక్కును భారీ ఎత్తున చెల్లించారు. ఆదివారం రాజన్న ఆలయానికి చేసుకున్న భక్తులు స్వామివారి సన్నిధిలో బస చేసి, సోమవారం రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఆలయ ప్రాంగణాలు భక్తుల శివ స్మరణలతో మారుమోగింది.

రాజన్న ఆలయంలో భారీగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. రాజన్న స్వామి దర్శనం కోసం భక్తులంతా పెద్ద ఎత్తున ఉదయం నుంచే క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. ఈ రోజు ఆలయానికి మహారాష్ట్ర, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్, ములుగు, మంచిర్యాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల నుంచి భారీగా తరలొచ్చారు. 

ఇప్పటికే చాలా మంది భక్తులు రాజన్నను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని ఆలయ అధికారులు వెల్లడించారు. కొంత మంది భక్తులు కోడెలు కట్టేసి మొక్కు చెల్లించుకున్నారు. అయితే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సమీపిస్తున్న నేపథ్యంలో దక్షిణకాశీగా ప్రసిద్ధి గాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

ప్రతి సంవత్సరం మేడారం జాతరకు వెళ్లే భక్తులు అమ్మవార్ల దర్శనానికి ముందే రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలో సోమవారం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి భక్తులు రాజన్న దర్శనానికి తరలివచ్చారు. దీంతో ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. ముఖ్యంగా వేలాది సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ధర్మగుండం, కల్యాణ కట్ట, క్యూలైన్లు, లడ్డు ప్రసాదాల కౌంటర్ల వద్ద భక్తుల తాకిడి పెరిగింది. అధికారులు వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పలు చర్యలు చేపడుతున్నారు. 

Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News