Dhanteras 2022: అదృష్టం వరించాలంటే..అక్టోబర్ 23 దంతేరస్ నాడు ఈ 5 వస్తువుల దానం తప్పనిసరి

Dhanteras 2022: దంతేరస్ అనేది దీపావళి పర్వదినంలో మొదటిరోజు. హిందూ పంచాంగం, జ్యోతిష్యశాస్త్రాల ప్రకారం ఆ రోజు చాలామంచిది. అదే సమయంలో ఆ రోజున ఐదు వస్తువులు తప్పకుండా దానం చేయాలంటున్నారు. అవేంటో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 20, 2022, 06:20 PM IST
Dhanteras 2022: అదృష్టం వరించాలంటే..అక్టోబర్ 23 దంతేరస్ నాడు ఈ 5 వస్తువుల దానం తప్పనిసరి

ఐదు రోజుల దీపావళి పండుగ ప్రారంభమయ్యేది దంతేరస్‌తో. ఈ ఏడాది అక్టోబర్ 23న దంతేరస్ పండుగ ఉంది. దంతేరస్ నాడు కొన్ని వస్తువులు దానం చేస్తే మంచదని అంటారు. ముఖ్యంగా ఐదు రకాల వస్తువుల గురించి జ్యోతిష్యశాస్త్రంలో ప్రస్తావన ఉంది. 

దంతేరస్ నాడు ఈ ఐదు రకాల వస్తువులు దానం చేయడం వల్ల మరింత డబ్బు సంపాదిస్తారని నమ్మకం. దంతేరస్ రోజును మహాదాన్ రోజుగా పరిగణిస్తారు. ఆరోజు ఏం దానం చేస్తే అది రెట్టింపు అవుతుందని విశ్వాసం. ముఖ్యంగా ఐదు పవిత్రమైన వస్తువుల దానం చాలా ముఖ్యమే కాకుండా అదృష్టం కూడా.

పసుపు బట్టలు

దంతేరస్ నాడు పసుపు బట్టలు దానం చేస్తే..మీ జీవితంలో అదృష్టం కలగడమే కాకుండా సంపద లభిస్తుంది. బట్టలు ఎవరికి అవసరమో గుర్తించి పసుపు బట్టలు దానం చేయాలి. పసుపు అనేది అదృష్టానికి చిహ్నం. 

ఆహారం

పేదలకు అన్నదానం అనేది ఎప్పుడైనా చాలా మంచిది. అదే అన్నదానం దంతేరస్ నాడు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం మీకు వెంటనే లభిస్తుంది. ఓ పేదవాడిని ఇంటికి పిలిచి..ఆ రోజున భోజనం పెట్టాలి. పాయసం వంటి స్వీట్ కూడా పెడితే మరీ మంచిది. లేదా బియ్యం, గోధములు, బార్లీ, జొన్నలు దానం చేసినా మంచిదే.

చీపురు

ఎవరైనా ఆర్ధిక ఇబ్బందులతో ఉంటే వారికి చీపురు దానం చేయాలి. దంతేరస్ నాడు చీపురు దానం చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమై కోర్కెలు నెరవేరుస్తుందని అంటారు. అయితే చీపురు మీకు బాగా తెలిసిన బంధువుకే దానం చేయాలి. తెలియని వ్యక్తికి కాదు. 

స్వీట్స్ అండ్ కోకోనట్స్

మీ కుటుంబంలో భవిష్యత్తులో ఏ విధమైన ఆర్ధిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు స్వీట్స్, కొబ్బరికాయలు దానం చేయాలి. ఇలా చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అవసరమైనవారికి ఈ దానం చేయాలి.

ఐరన్

దంతేరస్ నాడు ఇనుము లేదా ఇనుము వస్తువులు దానం చేయడం వల్ల మీ దురదృష్ణం తొలగిపోతుందని అంటారు. ఇనుము అనేది శనిదేవుడికి చెందింది. ఇది దానం చేయడం వల్ల శనిదేవుడి ఆశీర్వాదం ఉంటుంది. అటు లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉంటుంది. సంపద లభిస్తుంది. 

Also read: Dhanteras 2022: దంతేరస్ సాయంత్రం ఆ పనులు చేస్తే ఇక అంతే సంగతులు, అక్టోబర్ 23న జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News