/telugu/photo-gallery/actress-sri-reddy-apology-and-emotional-letter-to-former-cm-ys-jagan-family-pa-180817 Sri Reddy Letters: జగనన్న సారీ..  ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. Sri Reddy Letters: జగనన్న సారీ.. ఇలా అవుతుందను కోలేదు.. సంచలన లేఖ రాసిన నటి శ్రీరెడ్డి.. 180817

ఉత్తరాదిన దీపావళి అంటే ఐదురోజుల పండుగ. ఈ ఐదురోజుల పండుగ ప్రారంభమయ్యేది దంతేరస్‌తో. లక్ష్మీదేవి కటాక్షం కోసం ఈ ఐదురోజులు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు. కానీ దంతేరస్ సాయంత్రం పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం దంతేరస్ సాయంత్రం కొన్ని పనులపై నిషేధముంది. కొన్ని నిషేధిత పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుంచి వెళ్లిపోతుందని జ్యోతిష్య పండితులు చెబుతుంటారు. దంతేరస్ నాడు లక్ష్మీదేవితో పాటు ఆమెకు ఇష్టమైన వస్తువుల్ని కూడా పూజించాలి. అలా చేస్తే లక్ష్మీదేవి ప్రసన్నమౌతుంది. కుబేరుడు, ధన్వంతరిల పూజలు కూడా చేయాలి.

దంతేరస్ నుంచి లక్ష్మీదేవి పూజలు ప్రారంభమౌతాయి. అందుకే ఆ ఐదురోజులు పొరపాటున కూడా ఇంటిని ఖాళీగా ఉంచకూడదు. చాలామంది ఇంటిని లాక్ చేసి వెళ్లిపోతుంటారు. ఇలా చేయకూడదు. దంతేరస్ సాయంత్రం ఎవరో ఒకరు ఇంట్లో తప్పకుండా ఉండాలి.

దంతేరస్ సాయంత్రం అత్యంత ప్రాముఖ్యమైంది. ఆ రోజు ఏ విధమైన లావాదేవీలు జరపకూడదు. దంతేరస్ అనేది లక్ష్మీదేవికి సమర్పితం. ఆ రోజు సాయంత్రం ఎవరితోనూ లావాదేవీలు చేయకూడదు. దీనివల్ల ఆ వ్యక్తి ఆర్ధిక పరిస్థితి బలహీనమౌతుంది. 

లక్ష్మీదేవికి తెలుపు రంగు చాలా ఇష్టం. అందుకే లక్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు తెలుపురంగు వస్తువులు వినియోగిస్తే మంచిది. కానీ దంతేరస్ సాయంత్రం తెలుపురుంగ వస్తువు ఎవరికీ దానం చేయకూడదు. ఇలా చేస్తే..లక్ష్మీదేవి ఆగ్రహించి ఇంట్లోంచి వెళ్లిపోతుంది. 

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సాయంత్రం వేళల్లోనే లక్ష్మీదేవి ఇంట్లో ప్రవేశిస్తుంది. ఆమెను స్వాగతించేందుకు కొన్ని వస్తువులపై దృష్టి పెట్టాలి. ఆ రోజు సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి ఉండాలి. సాయంత్రం వేళ యముడి పేరుతో దీపం వెలిగించాలి. ఆ రోజున దక్షిణ దిశలో యముడిని, పూర్వీకుల్ని తల్చుకుని దీపం వెలిగించాలి. ఫలితంగా పూర్వీకుల ఆశీర్వాదంతో పాటు అకాల మరణభయం తొలగిపోతుంది. 

Also read: Solar Eclipse 2022: సూర్యగ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చేయకూడని పనులివే, లేకపోతే ఏమౌతుంది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Dhanteras 2022 precautions and tips, never do these things on october 23rd dhanteras evening else lakshmidevi got angry
News Source: 
Home Title: 

Dhanteras 2022: దంతేరస్ సాయంత్రం ఆ పనులు చేస్తే ఇక అంతే సంగతులు, అక్టోబర్ 23న జాగ్రత

Dhanteras 2022: దంతేరస్ సాయంత్రం ఆ పనులు చేస్తే ఇక అంతే సంగతులు, అక్టోబర్ 23న జాగ్రత్త
Caption: 
Dhanteras ( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Dhanteras 2022: దంతేరస్ సాయంత్రం ఆ పనులు చేస్తే ఇక అంతే సంగతులు, అక్టోబర్ 23న జాగ్రత
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Thursday, October 20, 2022 - 16:59
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
24
Is Breaking News: 
No