Diwali 2024 Locky Zodiac Sign: దీపావళి తర్వాత ఈ రాశులవారు ధనవంతులు కాబోతున్నారు!

Diwali 2024 Locky Zodiac Sign: అక్టోబర్ 31న దీపావళి పండగ వచ్చింది. అయితే ఈ పండగ తర్వాత శని గ్రహంతో పాటు శుక్ర గ్రహం కుంభరాశిలో కలయిక జరపబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Oct 15, 2024, 11:43 AM IST
Diwali 2024 Locky Zodiac Sign: దీపావళి తర్వాత ఈ రాశులవారు ధనవంతులు కాబోతున్నారు!

Diwali 2024 Locky Zodiac Sign: ఈ సంవత్సరం దీపావళి పండగ అక్టోబర్ 31వ తేదీన వచ్చింది. ఈ పండగకి హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ పండగ రోజున లక్ష్మీ అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ దీపావళి పండగ తర్వాతే శుక్ర శని గ్రహాలు కలయిక జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో ప్రత్యేకంగా మారబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే శని గ్రహం దాదాపు 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో సంచార దశలో ఉంది. అయితే ఇదే రాశిలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా రెండు గ్రహాల సంయోగం జరుగుతుంది. ఈ సంయోగంతో కొన్ని రాశుల వారు అద్భుతమైన ఫలితాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే ఈ సంయోగం కారణంగా ఏయే రాశుల వారికి శని శుక్ర గ్రహాల అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి. 

శని శుక్ర గ్రహాల కలయిక కారణంగా లాభాలు పొందబోయే రాశులు: 
కుంభరాశి:

కుంభరాశి వారికి శుక్ర శని గ్రహాల కలయిక ఎంతో బాగుంటుంది. వీరికి ఈ రెండు గ్రహాల కలయికల కారణంగా ప్రత్యేకమైన యోగం ఏర్పడుతుంది. దీంతో వీరు రాత్రికి రాత్రే ధనవంతులవుతారు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితం గడిపే వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారు ఈ సమయంలో ఆర్థికంగా చాలా వరకు లాభాలు పొందుతారు. ఇక ఉద్యోగాలు చేసే వారు కూడా కొన్ని ప్రత్యేకమైన బాధ్యతలు పొందడం వల్ల వీరికి కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. అంతేకాకుండా చేస్తున్న పనుల్లో ఆటంకాలు కూడా తగ్గిపోతాయి దీనికి కారణంగా ఎలాంటి పనులైనా సాఫీగా చేయగలుగుతారు. అలాగే కుంభ రాశి వారు ఈ సమయంలో మతపరమైన కార్యక్రమాలకు కూడా హాజరవుతారు. 

మిధున రాశి:
శుక్ర శని గ్రహాల కలయిక కారణంగా మిధున రాశి వారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా కొన్ని ప్రత్యేకమైన యోగాలు ఈ సమయంలో 9వ స్థానంలో ఏర్పడబోతున్నాయి. ఈ సమయంలో పూర్తిగా అదృష్టం పెరుగుతుంది. అలాగే గతంలో నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయంలో సులభంగా నెరవేరుతాయి. ఈ సమయంలో ఏదైనా పవిత్రమైన ప్రదేశాలను సందర్శించే ఛాన్స్ కూడా ఉంది. ముఖ్యంగా వ్యాపారాలు చేసే వారికి ఆర్థిక లాభాలతో పాటు సమాజంలో కీర్తి ప్రతిష్టలు కూడా రెట్టింపు అవుతాయి. అలాగే వీరు నిలిచిపోయిన ప్రాజెక్టు కూడా తిరిగి సొంతం చేసుకుంటారు. విదేశీ పర్యటనలు చేయాలనుకునే వారికి ఇది సరైన అవకాశంగా భావించవచ్చు. 

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

మేషరాశి :
మేష రాశి వారికి కూడా ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి  ఆదాయం ఒక్కసారిగా పెరగడమే కాకుండా వ్యక్తిగత జీవితంలో అద్భుతమైన మార్పులు వస్తాయి. వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ సమయంలో స్నేహితుల సపోర్టు లభించి అద్భుతమైన ప్రాజెక్టులు పొందగలుగుతారు. కెరీర్ కు సంబంధించిన జీవితంలో కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయంలో అనేక మార్పులు వస్తాయి. అంతేకాకుండా దాంపత్య జీవితం కూడా చాలా బాగుంటుంది. అలాగే ఎప్పటినుంచో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి విహారయాత్రలకు కూడా వెళ్తారు..

ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News