Significance Of Offering Panakam And Vadappu: జగదభి రాముడు పుట్టిన రోజే శ్రీరామనవమి.. ఈ పవిత్రమైన రోజున రామ భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో సీతారాముల కళ్యాణాన్ని తిలకించి, శ్రీరామచంద్రమూర్తిని ఆరాధిస్తారు. ఈ సందర్భంగా శ్రీరామునికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించి పూజిస్తారు.
అయితే నైవేద్యంగా ఈ పండుగ రోజున పానకం, వడపప్పును శ్రీరామునికి ప్రత్యేకంగా తయారు చేస్తారు. అసలు వీటిని నైవేద్యంగా ఎందుకు పెడుతారు అనేది మనం తెలుసుకుందాం.
ఆధ్యాత్మికం ప్రకారం:
శ్రీరామచంద్రుడికి బెల్లం అంటే ఎంతో ఇష్టమని పిండితులు చెబుతారు. ఆధ్యాత్మిక ప్రకారం రామాయణంలో రాముడు వనవాసం చేస్తున్న సమయంలో, శ్రీరాముడు, సీత, లక్ష్మణులు తమ ఆహారంగా కొన్ని పండ్లు, గింజలు, మూలికలతో పానకం తయారు చేసుకునేవారని చెబుతారు. అలాగే ఋషులు ఆయనకు వడపప్పు నైవేద్యంగా సమర్పించేవారని కథలు ఉన్నాయి.
సంస్కృతి ప్రాముఖ్యత:
శ్రీరామనవమి రోజు, భక్తులు పానకం, వడపప్పును తయారు చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టి తరువాత ప్రసాదంగా స్వీకరించడం ఒక సంప్రదాయం.
ఇంటిల్లు పానకం, వడపప్పు పంచుకోవడం ద్వారా సామాజిక సమరసత, సహకారాన్ని పెంపొందించుకోవడం ఈ పండుగ ముఖ్య ఉద్దేశ్యాలలో ఒకటి.
శాస్త్రీయ ప్రకారం:
పానకం: వేసవిలో వచ్చే శ్రీరామనవమి రోజున పానకం సేవించడం వల్ల శరీరానికి చలువు లభిస్తుంది. యాలకుల్లో ఉండే ఔషధ గుణాలు జీర్ణక్రియ మెరుగుపరుస్తాయి.
వడపప్పు: ఇందులో పాల్గొనే పప్పుధాన్యాలు మంచి ప్రోటీన్, పీచు పదార్థాలకు మూలం. వడపప్పు తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.
సులభంగా తయారు:
పానకం, వడపప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు సులభంగా లభిస్తాయి. వీటిని తయారుచేయడానికి ఎక్కువ సమయం కూడా పట్టదు.
కావాల్సిన పదార్థాలు:
బెల్లం - 150 గ్రాములు
నీళ్ళు - 1 లీటరు
యాలకుల పొడి - 1 టీస్పూన్
మిరియాల పొడి - 1 టీస్పూన్
శొంఠి పొడి - 1/2 టీస్పూన్
సోంపు పొడి - 1/2 టీస్పూన్
నిమ్మరసం - 1 నిమ్మకాయ
తయారీ విధానం:
ఒక గిన్నెలో తురిమిన బెల్లం తీసుకోవాలి. ఇందులోకి నీళ్ళు పోసి బెల్లం కరిగేవరకు కలపండి. బెల్లం కరిగిన తరువాత, యాలకుల పొడి, మిరియాల పొడి, శొంఠి పొడి, సోంపు పొడి, నిమ్మరసం వేసి బాగా కలపండి. పానకం చల్లగా కావాలనుకుంటే, ఐస్ క్యూబ్స్ వేసి కలపండి.
అంతే, పానకం రెడీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి