Vastu And Astrology Tips In Telugu: ప్రస్తుతం చాలామంది ఏ పనులు చేయాలన్నా జ్యోతిష్య, వాస్తు శాస్త్రాన్ని నిపుణులను సంప్రదిస్తున్నారు. ఎందుకంటే ఈ శాస్త్రాలు ఎంతో బలమైన నమ్మకాన్ని మనుషులకు అందిస్తాయి. అయితే చాలామంది వాస్తు శాస్త్రంలో సూచించిన నియమాలను పాటించలేకపోవడం వల్ల దోషాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వాస్తు చెప్పిన కొన్ని చేయకూడని పనులను కూడా చేస్తున్నారు. ఈ కారణంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.
ప్రస్తుతం చాలామంది సాయంత్రం పూట నిద్రపోతున్నారు. ఇది వాస్తు శాస్త్రంలో పెద్ద తప్పని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా సూర్యాస్తమయం తర్వాత కొన్ని చేయకూడని పనులు చేస్తున్నారు. వీటి వల్ల కూడా జీవితంలో సమస్యలు రావచ్చని జ్యోతిష్య వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. సూర్యాస్తమయం తర్వాత ఏయే పనులు చేయకూడదో.. ఏయే పనులను చేయడం వాస్తు దోషాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read: Odisha Train Accident: గూడ్స్ రైలు కింద పడుకున్న వారిపై నుంచి వెళ్లిన బోగీలు.. ఆరుగురు మృతి
సూర్యాస్తమయం తర్వాత ఏయే పనులు చేయకూడదో తెలుసా?:
సూర్యాస్తమం తర్వాత చాలామంది చిరిగిపోయిన పేపర్లను బయట నుంచి ఇంట్లోకి తీసుకువస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలామంది విరిగిపోయిన పాత వస్తువులు, చినిగిపోయిన బూట్లను గుమ్మం బయట నుంచి ఇంటి లోపలికి తీసుకువస్తూ ఉంటారు. ఇలా చేయడం చాలా పెద్ద తప్పు అని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
అంతేకాకుండా మరికొందరు పగిలిపోయిన గడియారాలను పాటు తెలిసి తెలియక విరిగిపోయిన దేవత విగ్రహాలను కూడా బయటి నుంచి ఇంట్లోకి తీసుకువస్తున్నారు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలతో పాటు తీవ్ర ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తరచుగా మరిచిపోయి ఈ వస్తువులను ఇంట్లోకి తీసుకువచ్చేవారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Also Read: Odisha Train Accident: గూడ్స్ రైలు కింద పడుకున్న వారిపై నుంచి వెళ్లిన బోగీలు.. ఆరుగురు మృతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook