Goddess Durga Devi In Dream: నవరాత్రుల్లో అమ్మారు కలలో కనిపిస్తే...ఇలా జరగక తప్పదు!!

Durga Devi Appears In Dream: హిందువులకు ఎంతో పవిత్రమైన పండుగ దేవీ నవరాత్రులు. ఈ సమయంలో దుర్గాదేవిని భక్తులు ఎంతో నిష్టగా పూజలు, వ్రతాలు చేస్తారు.  అయితే ఈ నవరాత్రల్లో మీ కలలో అమ్మవారి ఉగ్రరూపం కనిపిస్తే దీని అర్థం ఏంటో.. జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Oct 4, 2024, 08:40 AM IST
Goddess Durga Devi In Dream: నవరాత్రుల్లో అమ్మారు కలలో కనిపిస్తే...ఇలా జరగక తప్పదు!!

Durga Devi Appears In Dreams: హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉన్న పండుగలో నవరాత్రులు ఒకటి. నవరాత్రులు అంటే  తొమ్మిది రాత్రులు అని అర్థం. ఈ పండుగలో శక్తి స్వరూపిణి అయిన దుర్గామాతను తొమ్మిది రోజులు పాటు ఆరాధిస్తారు. ఈ పండుగను సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారు.  వసంత ఋతువులో చైత్ర మాసంలో వచ్చే నవరాత్రులు, శరదృతువులో ఆశ్వయుజ మాసంలో ఘనంగా జరుపుకుంటారు. కొంతమంది ఈ నవరాత్రుల్లో అమ్మవారికి పూజలు, దీక్షలు చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల వారి కుటుంబానికి, తమకు ఎలాంటి చెడు ప్రభావం పడకుండా ఉంటుందని నమ్ముతారు. ఇంటిలో లేదా ఆలయంలో కలశ స్థాపన చేసి ఈ తొమ్మిది రోజులు పూజిస్తారు.

అయితే చాలా మంది అమ్మవారి దీక్షలో ఉన్నప్పుడు కొన్ని కలలను కంటారు. అందులో దుర్గాదేవి ఉగ్రరూపం కలలో కనిపించడం విశేషం. మీరు కూడా ఇలా అమ్మవారి ఉగ్రరూపాన్ని కలలో చూశారా..? అయితే మీరు ఈ విషయాన్ని తప్పకుండా తెలుసుకోవాల్సి ఉంటుంది. దీని అర్థం ఏంటి.? దుర్గాదేవి మీకు ఎలాంటి వరం ఇస్తుంది? అనేది తెలుసుకుందాం. 

కలలు మన మనస్సులోని భావాలను, ఆలోచనలను ప్రతిబింబిస్తాయి. కొన్ని కలలు మనల్ని భయపెట్టగా, మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కలలో దేవతలు కనిపించడం అనేది చాలా మందికి అనుభవమయ్యే విషయమని జ్యోతిష్య శాస్త్రా నిపుణులు చెబుతున్నారు. అందులో ముఖ్యంగా నవరాత్రుల్లో అమ్మవారి ఉగ్రరూపం ప్రత్యేకమైనది. దుర్గాదేవి ఉగ్రరూపం కలలో కనిపించడం అనేది సాధారణంగా భయంకరమైన అనుభవంగా అనిపించవచ్చు. కానీ, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కలకు అనేక అర్థాలున్నాయి. 

దుర్గాదేవి అంటే శక్తి, విజయం. అమ్మవారు అద్భుతంగా అలంకరించి శాంతి రూపంలో ఉండే మీ జీవితంలో అన్ని శుభాలు కలుగుతాయని ఆర్థం.  అలాగే ఎలాంటి సమస్యలు ఉన్న త్వరలోనే తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్రా నిపుణులు చెబుతున్నారు. 

ఎరుపు రంగు చీరాలో కలలో కనిపిస్తే: 

నవరాత్రులలో అమ్మవారు ఎరుపు రంగు చీరను ధరించి కలలో కనిపిస్తే జీవితంలో ఎంతో ఆనందంగా, శక్తి, ఉత్సాహం కలుగుతుంది. అలాగే వృతి, వ్యక్తిగత జీవితంలో ఎన్నో అనుకూల లాభాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే వివాహం, ఉద్యోగంలో ప్రమోషన్ వంటి శుభ కార్యాలు జరగవచ్చు.  

కలలో అమ్మవారు సింహం మీద కనిపిస్తే: 

దుర్గాదేవి అమ్మవారి వాహనం సింహం. ఈ అవతారం శక్తి, విజయం, ఆధిపత్యంకు చిహ్నం. మీరు కానీ అమ్మవారిని సింహంపై దర్శనం ఇస్తే దీనికి అర్థం ఎలాంటి కష్టాలు ఉన్న అమ్మవారు మీ వెంట ఉండి సమస్యలను తొలగిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాగే ఏ పని అయినా విజయవంతంగా పూర్తి చేస్తారని కూడా అర్థం.  జీవితంలో శాంతి, సంతోషం నెలకొంటుంది.

ఇది కూడా చదవండి: Lucky Zodiac Sign: 12 ఏళ్ల తర్వాత మిథునరాశిలోకి గురుగ్రహం.. 3 రాశులవారికి ధనయోగం.. డబ్బే, డబ్బు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News