Surya Gochar: అక్టోబర్ 18 నుంచి ఈ రాశులవారికి సమస్యలు ప్రారంభం..మీ రాశి కూడా ఉందా?

Sun Transit 2023 in Libra: సూర్యగ్రహం రాశి సంచారం చేయడం వల్ల  అక్టోబర్ 18 నుంచి కొన్ని రాశులవారికి తీవ్ర సమస్యలు వస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా రావచ్చు. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 17, 2023, 11:55 AM IST
 Surya Gochar: అక్టోబర్ 18 నుంచి ఈ రాశులవారికి సమస్యలు ప్రారంభం..మీ రాశి కూడా ఉందా?

 

Sun Transit 2023 in Libra: సూర్యగ్రహం రాశి సంచారం చేసిప్పుడు ఒక నెల పాటు ఉంటుంది. ఆ తర్వాత మరో రాశిలోకి సంచారం చేస్తుంది. గ్రహాల రాజు అయిన సూర్యుడు కన్యారాశిని వదిలి అక్టోబర్ 18 మధ్యాహ్నం 01:18 గంటలకు తుల రాశిలోకి సంచారం చేయబోతోంది. అయితే ఈ సంచార ప్రభావం మొత్తం 12 రాశులవారిపై పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారం కారణంగా కొన్ని రాశులవారికి తీవ్ర సమస్యలు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారిపై ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

మేష రాశి:
సూర్యగ్రహం సంచారం కారణంగా అక్టోబర్ 18 నుంచి మేష రాశివారికి అనేక రకాల సమస్యలు రావచ్చు. ఈ సమయంలో కుటుంబంతో కలసి అనేక ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి తీవ్ర ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వ్యాపారాలు చేసేవారు పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 

సింహ రాశి:
అక్టోబర్ 18 నుంచి సింహరాశి వారికి ఆందోళన, భయం, ఇతర సమస్యలు ప్రారంభమవుతాయి. దీంతో పాటు ఉద్యోగాలు మారే వారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా కెరీర్‌లో కొత్త సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి సమస్యలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 

కన్యా రాశి:
కన్యా రాశి వారికి సూర్యుని సంచారం కారణంగా మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. ఈ రాశివారికి సీనియర్ల నుంచి తీవ్ర విమర్శలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రాజెక్ట్‌ల్‌ ఆగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ధన ప్రవాహం కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి. తగ్గవచ్చు.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

మకర రాశి:
సూర్య గ్రహం సంచారం కారణంగా మకర రాశివారికి అనేక రకాల సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వీరికి పని భారం పెరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. వృత్తిపరంగా అనేక రకాల సమస్యలు వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో అనే సమస్యలు రావచ్చు. శత్రువుల పట్ల తప్పకుండా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఖర్చులు కూడా పెరుగుతాయి.

ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

Trending News