Shubh yog Benefits: ఈరోజు(జనవరి 21) చంద్రుడు, శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నారు. పైగా రేపు పౌషమాస శుక్ల పక్ష ఏకాదశి తిథి కావడంతో ఇవాళ ద్విపుష్కర యోగం, శుక్ల యోగం, బ్రహ్మ యోగం, రోహిణి నక్షత్రాల శుభ కలయిక జరగబోతుంది. దీని కారణంగా ఓ అద్భుతమైన యోగం రూపుదిద్దుకుంటుంది. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, ఈ రోజు ఏర్పడే శుభ యోగం కారణంగా మూడు రాశులవారు అదృష్ట వంతులు కాబోతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
సింహరాశి
ఈరోజు నుంచి సింహరాశి వారికి అంతా మంచే జరుగుతుంది. మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు కెరీర్ కు సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభపడతారు.సూర్యదేవుని అనుగ్రహంతో మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. సూర్య బీజ్ మంత్రం పఠించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.
మేషరాశి
ఈరోజు మేషరాశి వారికి కలిసి వస్తుంది. వీరు పూర్తిగా రిలాక్స్‌డ్ మూడ్‌లో ఉంటారు. కుటుంబంతో సరదాగా గడుపుతారు. వ్యాపారస్తులు లభాపడతారు. మీ బిజినెస్ వృద్ధి చెందుతుంది. మీకు సంతానానికి సంబంధించిన శుభవార్త వింటారు. అంతేకాకుండా మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మర్రి చెట్టుకు పాలు పోయడం మీ సమస్యలను తొలగిపోతాయి.
Also Read: Ramlalla Idol Colour: అయోధ్య రామాలయంలో ప్రతిష్ఠించే రాముడి విగ్రహం నలుపు రంగులో ఎందుకుంది
వృశ్చిక రాశి
నేటి నుండి వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి రానుంది. మీకు ఫ్యామిలీ అండ్ ప్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ సంపద పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు. వ్యాపారం విస్తరిస్తుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుంది. మీ బిజినెస్ కలిసి వస్తుంది. మీ కోరికలను నెరవేర్చుకోవడానికి మర్రి ఆకులపై రాసి పారే నీటిలో వేయండి.
Also Read: Famous Ram temples: అయోధ్యతో పాటు దేశంలో ప్రసిద్ధికెక్కిన రామాలయాలు ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook