First Lunar Eclipse 2023: తొలి చంద్ర గ్రహణం ఇవాళ రాత్రి ఎన్ని గంటలకు, ఏం ఉపాయాలు పాటించాలి

First Lunar Eclipse 2023: హిందూ మతంలో గ్రహణాలకు విశేష ప్రాధాన్యత , మహత్యమున్నాయి. గ్రహణాలు ఖగోళ ప్రక్రియలో భాగమైనా జ్యోతిష్యపరంగా అశుభంగా భావిస్తారు. ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ప్రభావం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 5, 2023, 06:49 AM IST
First Lunar Eclipse 2023: తొలి చంద్ర గ్రహణం ఇవాళ రాత్రి ఎన్ని గంటలకు, ఏం ఉపాయాలు పాటించాలి

First Lunar Eclipse 2023: ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ఇవాళ ఏర్పడనుంది. బుద్ధ పౌర్ణిమ రోజున ఏర్పడుతున్నందున ఇది అత్యంత అరుదైందిగా భావిస్తారు. 130 ఏళ్ల తరువాత ఏర్పడుతున్న చంద్ర గ్రహణం ఇది. అందుకే ఈ చంద్ర గ్రహణం ప్రభావం కూడా అలానే ఉండనుంది. 

ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం ఇవాళ రాత్రి ఏర్పడనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటల 44 నిమిషాలకు ప్రారంభమై..మే 6వ తేదీ తెల్లవారుజామున 1 గంట 1 నిమిషం వరకూ ఉంటుంది. ఈ గ్రహణం ప్రభావం అత్యధికంగా రాత్రి 10 గంటల 52 నిమిషాలకు ఉంటుంది. ఈ సమయంలో చంద్రుడు దాదాపుగా అదృశ్యమౌతాడు. బుద్ధ పౌర్ణిమ రోజున ఏర్పడనున్న చంద్ర గ్రహణం కావడంతో 4 రాశుల జాతకాలకు తీవ్రమైన కష్టాలు ఎదురుకానున్నాయి. చాలా అప్రమత్తంగా ఉండాలి. గ్రహణం దుష్ప్రభావం నుంచి బయటపడేందుకు కొన్ని ఉపాయాలున్నాయి. ఇవి పాటిస్తే చాలా వరకూ గ్రహణ సమస్యల్నించి విముక్తి పొందవచ్చు.

చంద్ర గ్రహణం ఇండియాలో కన్పిస్తుందా లేదా

జ్యోతిష్య పండితులు చెప్పిన వివరాల ప్రకారం ఈ ఏడాది తొలి చంద్ర గ్రహణం వాస్తవానికి పాక్షిక చంద్ర గ్రహణం. ఖగోళ శాస్త్రజ్ఞుల ప్రకారం ఈ చంద్ర గ్రహణం ఇండియాలో కన్పించదు. అయితే ఈ చంద్ర గ్రహణం నీడ ప్రభావం దేశంపై ఉంటుంది. దీనినే పాక్షిక చంద్ర గ్రహణమంటారు.

మే 5 న ఏర్పడనున్న ఈ చంద్ర గ్రహణం ప్రభావం మేషం, వృషభం, కర్కాటకం, సింహ రాశులపై తీవ్రంగా ఉంటుంది. ఈ నాలుగు రాశులపై చంద్ర గ్రహణం ప్రభావంతో ప్రతికూల ప్రభావం కన్పిస్తుంది. గ్రహణం దుష్ప్రభావాల్నించి కాపాడుకునేందుకు శివుని దర్శించుకోవాలి. శివపూజ చేయాలి. శివ దర్శనానంతరం శివుడిని పాలతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వల్ల చంద్ర గ్రహణం దుష్ప్రభావం నుంచి 4 రాశులు తప్పించుకోవచ్చు. ఎందుకంటే గ్రహణాన్ని అశుభంగా భావిస్తారు. గ్రహణ సమయంలో ఏ విధమైన శుభ కార్యాలు తలపెట్టరు. గ్రహణం సమయంలో భోజనం కూడా చేయరు. ముఖ్యంగా గర్బిణీ స్త్రీలు చాలా దూరంగా ఉండాలంటారు.

Also read: Lunar Eclipse 2023: ఇవాళే తొలి చంద్ర గ్రహణం, ఆ 4 రాశులకు తస్మాత్ జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News