Full Moon 2024: సింహరాశిలో పౌర్ణమి.. ఈ 2 రాశులవారు పట్టిందల్లా బంగారం..

Magh Purnima 2024: ఈ సారి పౌర్ణమి సింహరాశిలో ఏర్పడబోతుంది. ఈ రోజున రెండు రాశులవారు ప్రత్యేక ప్రయోజనాలు పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2024, 07:58 PM IST
Full Moon 2024: సింహరాశిలో పౌర్ణమి.. ఈ 2 రాశులవారు పట్టిందల్లా బంగారం..

Full Moon in Leo on February 24, 2024: రేపే(ఫిబ్రవరి 24) పౌర్ణమి. ఇది మాఘ మాసంలో వస్తుంది కాబట్టి దీనిని మాఘ పూర్ణిమ అని పిలుస్తారు. మాఘ పూర్ణిమ నాడు కర్కాటక, సింహరాశులవారు ప్రత్యేక ప్రయోజనాలను పొందనున్నారు. ఎందుకంటే మాఘ పూర్ణిమ రోజున రాత్రి 07:25 వరకు చంద్రుడు కర్కాటక రాశిలో ఉండి మాఘ పూర్ణిమ స్నానం నాడు సింహరాశిలోకి వెళతాడు. దీంతో ఈ రెండు రాశులవారు లాభపడతారు. 

కర్కాటకం, సింహ రాశులపై శుభ ప్రభావం
కర్కాటక రాశి
మాఘ పూర్ణిమ కర్కాటక రాశి వారికి చాలా బాగుంటుంది. మీ కుటుంబంలో సంతోషం ఉంటుంది. మీరు ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులు కష్టానికి  తగిన ఫలితాలను పొందుతారు. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీరు ఈ సమయంలో మేనమామ ప్రేమను పొందుతారు. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. వ్యాపారస్తులు లాభపడతారు. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. 
సింహరాశి 
మాఘ పౌర్ణమి పెద్ద మెుత్తంలో డబ్బును ఇస్తుంది. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. మీ ఫ్లాన్స్ అన్నీ సక్సెస్ అవుతాయి. మీ కీర్తి నలుదిక్కులకు వ్యాపిస్తుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. మీకు ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు. మీరు అత్తమామల నుండి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ పెళ్లి పిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. పార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో లాభాలు ఉంటాయి. 

Also Read: Maghapurnima 2024: రేపు మాఘ పౌర్ణమి.. ఈ రోజు రాత్రి చంద్రుని వెలుగులో ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుల వర్షమే..

Also Read: Guru Gochar 2024: రాశి మారనున్న బృహస్పతి.. ఈ 3 రాశులకు లక్కే లక్కు.. డబ్బే డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News