Good Luck Gifts: వీటిని బహుమతిగా పొందితే.. జీవితంలో అదృష్టమే ఇగ! పొరపాటున కూడా వీటిని ఇవ్వకూడదు

lucky gifts if you receive these 5 things. బహుమతులు అదృష్టానికి లేదా దురదృష్టానికి కూడా కారణమవుతాయని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 6, 2022, 11:09 AM IST
  • వీటిని బహుమతిగా పొందితే
  • జీవితంలో అదృష్టమే ఇగ
  • వీటిని మాత్రం ఎప్పుడూ ఇవ్వకూడదు
Good Luck Gifts: వీటిని బహుమతిగా పొందితే.. జీవితంలో అదృష్టమే ఇగ! పొరపాటున కూడా వీటిని ఇవ్వకూడదు

If you receive these lucky gifts Make You Rich: ఈ ప్రపంచంలో బహుమతులు ఇవ్వడం, తీసుకోవడం సహజం. పెళ్లిళ్లు, పుట్టిన రోజు, పెళ్లి వార్షికోత్సవం, లవర్స్ డే, మదర్స్ డే, ఫాదర్స్ డే, నూతన సంవత్సరం ఇలా అనేక సందర్భాలలో రకాల బహుమానాలను కుటుంబ సబ్యులు, సన్నిహితులు, బంధువులు లేదా సహచరులకు ఇస్తుంటాము. ఈ బహుమతులు ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా ప్రత్యేక సందర్భాలను గుర్తుండిపోయేలా చేస్తాయి. అయితే ఈ బహుమతులు అదృష్టానికి లేదా దురదృష్టానికి కూడా కారణమవుతాయని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. 

ఇవ్వకూడనివి:
బహుమతులకు సంబంధించి వాస్తు శాస్త్రంలో కొన్ని ప్రత్యేక చిట్కాలు ఉన్నాయి. బహుమతులు వీటిని మాత్రం ఎప్పుడూ ఇవ్వకూడదు. ముఖ్యంగా పదునైన వస్తువులు, షూ మరియు చెప్పులు ఇవ్వవద్దు. ఇలాంటివి బహుమతులు ఇవ్వడం వల్ల ఇద్దరి మధ్య బంధం చెడిపోతుంది. అంతేకాకుండా ఆ వ్యక్తితో వాగ్వాదం లేదా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. 

లోహపు  ఏనుగు
బంగారం, వెండి, ఇత్తడి, అష్ట లోహంతో కూడిన ఏనుగును కానుకగా పొందడం చాలా శ్రేయస్కరం. ఏనుగు లక్ష్మీ దేవికి సంబంధించినది. ఏనుగులు ఉన్న ఇంట్లో లక్ష్మి బొమ్మను ఉంచడం చాలా మంచిది. బహుమతిగా లోహపు ఏనుగు పొందితే.. ఆదాయం పెరగడానికి లేదా డబ్బు సంపాదించడానికి సంకేతం.

పియోనియా పువ్వులు
ఫెంగ్ షుయ్‌లో పియోనియా పువ్వులు చాలా పవిత్రమైనవి. ఈ పువ్వులు కానుకగా పొందితే.. అది మీ అదృష్టానికి సంకేతం. అంతేకాదు ఈ పువ్వుల చిత్రాన్ని బహుమతిగా పొందడం లేదా అలాంటి చిత్రాన్ని ఇంట్లో ఉంచడం వల్ల డబ్బు మన వద్దకు వస్తుంది.

లాఫింగ్ బుద్ధ
ఫెంగ్ షుయ్‌లో లాఫింగ్ బుద్ధ చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. లాఫింగ్ బుద్ధ చాలా షాపు, ఇళ్లలో కనిపిస్తుంటుంది. చేతిలో డబ్బు కట్ట, పెద్ద బొడ్డుతో నవ్వుతున్న లాఫింగ్ బుద్ధ మీకు బహుమతిగా అందితే.. మీరు సంతోషంగా ఉంటారు. ఇది మీ జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు అందేలా చేస్తుంది.

క్రాసులా లేదా వెదురు మొక్క
మొక్కలను బహుమతిగా ఇవ్వడం పర్యావరణానికి మంచిది. కొన్ని మొక్కలు చాలా పవిత్రమైనవిగా కూడా పరిగణించబడతాయి. వెదురు లేదా క్రాసులా మొక్కను బహుమతిగా పొందడం వల్ల ఇంట్లో డబ్బు ప్రవాహం పెరుగుతుంది. అలాగే ఇంటింటికి ప్రగతిని అందిస్తుంది.

విండ్‌ చైమ్‌లు
విండ్‌ చైమ్‌లను బహుమతిగా పొందడం కూడా చాలా శుభప్రదం. ఇది 8 కర్రలు కలిగి ఉండి, లోహం లేదా చెక్కతో ఉంటే.. అది చాలా శుభప్రదం. ఇది మీ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది.

Also Read: AP SSC Results 2022: నేడే పదో తరగతి ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ ఈ వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి!  

Also Read: Nigeria Church Attack: నైజీరియాలో చర్చిపై ఉగ్ర దాడి.. 50 మంది మృతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News