Grah Gochar in February 2024: మరో వారం రోజుల్లో ఫిబ్రవరి నెల మెుదలుకానుంది. వచ్చే నెలలో నాలుగు గ్రహాల గమనంలో పెను మార్పు రాబోతుంది. బుధుడు, అంగారకుడు, శని మరియు శుక్ర గ్రహాలు ఫిబ్రవరిలో సంచరించబోతున్నాయి. నెల ప్రారంభంలో బుధుడు మకరరాశిలో, ఫిబ్రవరి 11న కుంభరాశిలో శని అస్తమించడం, ఫిబ్రవరి 12న శుక్రుడు మకరరాశిలో ఉండడంతోపాటు అదే రోజు సూర్యుడు కూడా కుంభరాశిలో సంచరిస్తాడు. ఫిబ్రవరి 20న కుంభరాశిలో బుధుడు సంచరించడం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం 5 రాశులవారికి మేలు చేయనుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
మేషరాశి
ఫిబ్రవరిలో గ్రహాల సంచారం మేషరాశి వారికి కలిసి రానుంది. అంతేకాకుండా ఈ రాశి యెుక్క పదవ ఇంట్లో బుధాదిత్య మరియు ఆదిత్య మంగళ యోగం రూపొందుతోంది. దీంతో పాలిటిక్స్ లో ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. ప్రజల్లో మీకు ఆదరణ పెరుగుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.
వృషభరాశి
వృషభ రాశి వారికి ఫిబ్రవరి నెల శుభప్రదంగా ఉండబోతోంది. మీరు ఆర్థికంగా బలపడతారు. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. మీరు ఫ్యామిలీ అండ్ ప్రెండ్స్ తో మంచి సమయం గడుపుతారు.
మకరరాశి
సూర్యుడు, బుధుడు, కుజుడు సంచారం మకర రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీకు ఎప్పటి నుంచో ఆగిపోయిన ప్రమోషన్ మీకు లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి మీకు కలిసి వస్తుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. జాబ్ చేసేవారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
Also Read: Astrology - February 2024: ఫిబ్రవరిలో కీలక గ్రహాల మార్పు.. ఈ 3 రాశుల వారికీ పట్టిందల్లా బంగారమే..
కర్కాటక రాశి
ఫిబ్రవరి నెలలో గ్రహాల స్థితి కారణంగా కర్కాటక రాశి వారికి మంచి జరుగుతుంది. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు లాభాలను ఇస్తాయి. జాబ్ సాధించాలనే మీ కోరిక నెరవేరుతోంది. ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు ప్రయోజనం పొందుతారు.
కన్యా రాశి
వచ్చే నెలలో ఈ రాశివారు శుభవార్త వింటారు. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. మీ లవ్ సక్సెస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారులు లాభపడతారు. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
Also read: Shani Dev: ఏలినాటి శని తొలగిపోవాలంటే ఈ చిన్నపరిహారం చేయండి.. శనిభగవాణుడు ప్రసన్నమైపోతాడట..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook