Guru-Chandra Yuti: శ్రీరామనవమి తర్వాత 'గజకేసరి రాజయోగం'.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే..

Gajakesari rajyog: మేషరాశిలో బృహస్పతి మరియు చంద్రుడి కలయిక వల్ల  అరుదైన గజకేసరి రాజయోగం ఏర్పడనుంది. దీని వల్ల మూడు రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. ఇందులో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2023, 04:47 PM IST
Guru-Chandra Yuti: శ్రీరామనవమి తర్వాత 'గజకేసరి రాజయోగం'.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారమే..

Guru Chandra Yuti Gajakesariyog: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, మొత్తం తొమ్మిది గ్రహాలు కాలానుగుణంగా తమ రాశిని మార్చుకుంటాయి. అంతేకాకుండా ఇవి శుభ మరియు అశుభయోగాలను ఏర్పరుస్తాయి. ఏప్రిల్ 22న బృహస్పతి మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశించనుంది. ఈ రాశిలో బృహస్పతి, చంద్రుడు కలయిక వల్ల అరుదైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల మూడు రాశుల వారికి అపారమైన ధనం, వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం. 

గజకేసరి రాజయోగం ఈ రాశులకు శుభప్రదం

మేషం : మార్చి 22 తర్వాత మేష రాశికి బంగారు రోజులు ప్రారంభం కానున్నాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెళ్లికాని వారికి వివాహం  కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు జాబ్ వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ దక్కుతుంది. 
మిథునం: మిథునరాశి వారికి గజకేసరి రాజయోగం అనుకూలంగా ఉంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీరు పాత పెట్టుబడుల నుండి లాభపడతారు. స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది మంచి సమయం. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది. 
ధనుస్సు: ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం శుభప్రదం. గజకేసరి రాజయోగం ద్వారా ధనుస్సు రాశి వారికి మంచి రోజులు మెుదలవుతాయి. ఎందుకంటే మీ రాశి నుండి 5వ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతుంది. వ్యాపారులకు మంచి లాభాలు పొందుతారు. లవ్ సక్సెస్ అవుతుంది. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. వ్యాపారులు పెద్ద ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఆదాయం పెరుగుతుంది.

(నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించలేదు)

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News