Guru Pushya Amrit Yog 2023: గురు పుష్య యోగం కారణంగా ఈ రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు!

Guru Pushya Amrit Yog 2023: అత్యంత ముఖ్యమైన గురు పుష్య యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా కూడా చాలా లాభాలు కలుగుతాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 29, 2023, 11:26 AM IST
Guru Pushya Amrit Yog 2023: గురు పుష్య యోగం కారణంగా ఈ రాశులవారు ఊహించని లాభాలు పొందుతారు!

Guru Pushya Amrit Yog 2023: గ్రహాల స్థానాలు మారడం కారణంగా అనేక సుభ యోగాలు ఏర్పడతాయి. ఈ యోగాలు వ్యక్తుల జీవితాలపై ప్రభావం పడుతుంది. దీని కారణంగా చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. వ్యక్తి జన్మ స్థానంలో నిర్దిష్ట స్థానంలో ఈ శుభ యోగాలు ఏర్పాడితే ఊహించని లాభాలు పొందుతారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అయితే జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభమైన యోగం.. గురు పుష్య యోగం ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారి జీవితాలపై చాలా ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

గురు పుష్య యోగం కారణంగా కొన్ని రాశులవారికి  శుభకరమైన రోజులు ప్రారంభమవుతాయి. ఈ శుభ యోగం జూలై 30 న ఏర్పడబోతోంది..ఈ క్రమంలో 27 నక్షత్రాలలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పుష్య నక్షత్రం ప్రతిష్టాత్మకమైన స్థానాన్ని కలిగి ఉంది. దీంతో ప్రత్యేక యోగ ప్రభావం పెరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. 

గురు పుష్య యోగం అంటే ఏమిటి?:
గురు పుష్య యోగం జ్యోతిషశాస్త్రంలో చాలా పవిత్రమైనదిగా పేర్కొన్నారు. దీని ప్రభావం పడినచ రాశులవారు అదృష్టాన్ని పొందడమే కాకుండా చాలా రకాల లాభాలు పొందుతారు. శుభ గ్రహమైన బృహస్పతి (గురుడు) కర్కాటకం (పుష్య నక్షత్రం)లో సంచరించినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది.

Also Read: Godavari floods: భద్రాచలం వద్ద ఉప్పొంగిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ.

మేష రాశి:

మేష రాశి వారికి భౌతిక సుఖాలు పెరుగుతాయి. అంతేకాకుండా ఖర్చులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆత్మవిశ్వాసం లేకపోవడం వల్ల తీవ్ర ఒత్తిడి సమస్యలకు గురవుతారు. అంతేకాకుండా విద్యా విషయాలలో విద్యార్థులు కష్టపడి చదవడం వల్ల సులభంగా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఈ క్రమంలో తండ్రుల ఆస్తులు కూడా పెరుగుతాయి. 

వృషభ రాశి:
 శుక్ర గ్రహం పాలించే వృషభ రాశిలో జన్మించిన వారికి గురు-పుష్య యోగం చాలా రకాల ప్రయోజనాలను కలిగించబోతోంది. ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి ఈ క్రమంలో శుభవార్తలు పొందుతారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్నవారికి ప్రమోషన్స్‌ లభించే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వైవాహిక జీవితంలో కూడా చాలా ఆనందం కలుగుతుంది.

మిథున రాశి:
గురు-పుష్య యోగం మిథున రాశి వారికి కూడా ఊహించని లాభాలను కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ రాశివారు ఊహించని లాభాలతో పాటు అదృష్టవంతులవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్, ఇంక్రిమెంట్స్‌ కూడా పొందుతారు. అంతేకాకుండా వృత్తి జీవితం ఈ క్రమంలో చాలా అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Godavari floods: భద్రాచలం వద్ద ఉప్పొంగిన గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News