Rajyog: 12 ఏళ్ల తర్వాత ఏర్పడబోతున్న మాళవ్య, హన్స్ రాజయోగాలు.. వీరికి కొత్త జాబ్, ఉద్యోగంలో ప్రమోషన్..

Rajyog: ఈనెలలో మాలవ్య, హన్స్ అనే రాజయోగం ఏర్పడుతున్నాయి. దీని వల్ల 3 రాశుల వారు డబ్బు మరియు పురోభివృద్ధి పొందుతారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2023, 12:39 PM IST
Rajyog: 12 ఏళ్ల తర్వాత ఏర్పడబోతున్న మాళవ్య, హన్స్ రాజయోగాలు.. వీరికి కొత్త జాబ్, ఉద్యోగంలో ప్రమోషన్..

Hans And Malavya Rajyog: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఐశ్వర్యాన్ని ఇచ్చే  శుక్రుడు, ఆనందాన్ని ఇచ్చే బృహస్పతి మీనరాశిలో సంచరిస్తున్నారు. 12 ఏళ్ల తర్వాత వీరిద్దరి కలయిక మీనరాశిలో ఏర్పడింది. ఈ రెండు గ్రహాల సంయోగం కారణంగా మాళవ్య మరియు హన్స్ రాజయోగాలు ఏర్పడుతున్నాయి. దీంతో మూడు రాశులవారు డబ్బు మరియు పురోభివృద్ధి సాధిస్తారు. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

కర్కాటక రాశిచక్రం
హన్స్ మరియు మాలవ్య రాజయోగం మీకు శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే మీ అదృష్ట స్థానంలో గురు మరియు శుక్రులు ప్రయాణిస్తున్నారు. అందుకే ఈ సమయంలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ ఆర్థిక  పరిస్థితి బలపడుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. 
ధనుస్సు రాశిచక్రం
మాళవ్య రాజయోగం ఏర్పడడం వల్ల ధనుస్సు రాశి వారు ధన, వస్తు భోగాలు పొందుతారు. ఎందుకంటే మీ రాశి నుండి నాల్గవ ఇంట్లో ఈ యోగం ఏర్పడుతోంది. దీంతో మీరు ఏ పని చేపట్టినా అది సకాలంలో పూర్తిచేశారు. హన్స్ రాజయోగం కారణంగా మీరు పాలిటిక్స్ లో మంచి పదవి పొందుతారు. వ్యాపారులు పెద్ద డీల్ కుదుర్చుకునే అవకాశం ఉంది. మీరు వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగులు ఇంక్రిమెంట్ లేదా పదోన్నతి పొందే అవకాశం ఉంది. 
మీన రాశిచక్రం
హన్స్ మరియు మాళవ్య రాజయోగం ఏర్పడటం మీన రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీకు మీ ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. విదేశీ వ్యాపారం చేసేవారు మంచి లాభాలను గడిస్తారు. మీరు ఏదైనా భూమి లేదా ఆస్తిని కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. మీ ఆదాయం ఊహించని దాని కంటే ఎక్కువగా పెరుగుతుంది. ఆఫీసులో సహచరుల సపోర్టు లభిస్తుంది. 

Also Read: Mangal Gochar 2023: మరో వారంలో మిథునంలోకి కుజుడు.. దశ తిరగనున్న రాశులివే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News