Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 06, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి సొంతింటి కల సాకారం

Today Horoscope In Telugu 06 May 2021: ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : May 6, 2021, 08:07 AM IST
Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 06, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి సొంతింటి కల సాకారం

Horoscope Today 06 May 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 06వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈ రోజు మేష రాశి వారికి పనిచేసే చోట అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వాటిని చూసి కొంత ఆందోళన నెలకొంటుంది. మీరు నైపుణ్యం పట్ల ఆసక్తి ప్రదర్శించి పనులు పూర్తి చేయాల్సి ఉంటుంది. కేవలం మీ మీద ఎక్కువ దృష్టి పెట్టాలి. నేడు ఈ రాశివారు ప్రయాణాలకు దూరంగా ఉండాలి. చేపట్టిన పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు సానుకూల ఫలితాలు వస్తాయి.

Also Read: Health Tips: రాత్రివేళ ఈ ఆహార పదార్థాలు, Fruits తినకూడదు, అందుకు కారణాలు ఇవే

వృషభ రాశి
ఈ రోజు మీరు చంద్రుని ప్రభావంతో మానసిక ప్రశాంతత పొందుతారు. ఇది పనిలో మరియు ఇంట్లో మీ ఉత్పాదకతను, పనిలో వేగాన్ని పెంచుతుంది. గత కొంతకాలం నుంచి వాయిదా వేస్తున్న పనులు పూర్తి చేయడానికి ఇది మంచి రోజు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఈ రోజు విద్యార్థులు తమ కెరీర్ గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులను మానుకోవాలి.

మిథున రాశి
మిథున రాశి వారు నేడు భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. చేసే పనిలో ఓ ప్రాజెక్ట్ మీకు పేరు, గుర్తింపు తీసుకురానుంది. మీ పనిని అందరూ ఇష్టపడతారు. గత కొంతకాలం నుంచి మీరు మాట్లాడని ఓ స్నేహితుడు మిమ్మల్ని కలుసుకోవడం మీకు సంతోషాన్నిస్తుంది. చేతికి రావాల్సిన డబ్బు ఈ రోజు మీ చేతికి వస్తుంది. కానీ అనుకోకుండా నేడు మీరు అధికంగా ఖర్చు చేయనున్నారు.

కర్కాటక రాశి 
కర్కాటక రాశి వారు ఉద్యోగ పరంగా శుభవార్త వింటారు. ఏదేమైనా దంపతులు తగాదా పడటం వలన ఇంట్లో విషయాలు మీపై ఒత్తిడిని పెంచుతాయి. కొందరు తమ ప్రేమను వెతుకుతూ ఇంటి నుంచి బయలుదేరతారు. విద్యార్థులు తమ కెరీర్, ఉన్నత చదువుల గురించి తల్లిదండ్రులతో చర్చిస్తారు. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos

సింహ రాశి
నేడు ఈ రాశివారికి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే ఇది వాతావరణ ప్రభావం కారణంగా అని తెలుసుకుంటారు. కనుక ఎండలో ప్రయాణాలకు దూరంగా ఉండాలి. నేడు మీరు మార్పు కోసం ప్లాన్ చేయవచ్చు, కానీ ఈ నిర్ణయాన్ని ప్రస్తుతానికి వాయిదా వేయాలని సన్నిహితులు సలహా ఇస్తారు. ఈరోజు కొత్త వ్యాపారం సైతం ప్రారంభించవద్దని కూడా మీకు సూచిస్తారు. ఉద్యోగులకు, వ్యాపారులకు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి.   

కన్య రాశి
ఈ రోజు మీరు ప్రతి విషయంలోనూ సహనాన్ని కలిగి ఉంటారు. ఇది మీ ఇంటి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది. మీరు పని పూర్తి చేయడానికి ఇతర ఉద్యోగులపై కొంచెం ఒత్తిడి చేయాల్సి ఉంటుంది. పిల్లల విద్యపై ఇంట్లో చర్చ జరుగుతుంది. గతంలో చేసిన పెట్టుబడులకు నేడు ఫలితాలు పొందనున్నారు. వ్యాపారులకు లాభాలు గోచరిస్తున్నాయి.

తులా రాశి
తులా రాశి వారు కొన్ని విషయాలలో డబ్బు ఖర్చు చేయాలని భావిస్తారు. అయితే అవసరమైన వాటికి మాత్రమే నగదు వెచ్చించడం మంచి నిర్ణయం. ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి రోజు. భవిష్యత్తుతో మీరు ఏమి చేయాలనుకుంటున్నారో నిర్ణయించడానికి కొంత సమయం ఆలోచిస్తారు. విద్యార్థులకు చదువుపై ఆలోచన పెరిగి ఆందోళనకు గురవుతారు. ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. 

Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ రోజు అన్ని శుభాలే జరుగుతాయి. మీ ఆరోగ్యం చాలా మెరుగవుతుంది. కార్యాలయంలో మీ పని సజావుగా పూర్తవుతుంది. ఇంట్లోని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఆస్తిలో పెట్టుబడులు పెట్టాలని కొందరు మీకు సలహా ఇస్తారు. తుది నిర్ణయం మీదేనని మరచిపోకూడదు.

ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ రోజు కొంచెం అసంతృప్తిగా అనిపించవచ్చు. నేడు మీరు పని నుంచి కాస్త విరామం తీసుకోవాలని భావిస్తారు. ఇంట్లోని సమస్యలు, ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు సమయాన్ని కేటాయిస్తారు. మీ పిల్లలపై గతంలో కన్నా అధికంగా దృష్టిసారించాలి. అదే సమయంలో నేడు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మీకు నేడు నూతన గృహ యోగం గోచరిస్తుంది. ఉద్యోగులు, వ్యాపారులు ఏ ఆటంకాలు లేకుండా పనులు చేసుకుంటారు.

మకర రాశి
ఈరోజు పని సంబంధిత ఒత్తిడి దూరం కానుంది. దీంతో మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. సింగిల్స్ శృంగారపరమైన విషయాల గురించి ఆలోచిస్తారు. దంపతులు కూర్చుని మాట్లాడుకుని తమ మధ్య సమస్యలను పరిష్కరించుకుంటారు. వ్యాపారులు నేడు కొత్త పెట్టుబడులతో లాభాలు ఆర్జించనున్నారు. నేడు మీరు అధికంగా ఖర్చు చేయనున్నారు. ఈ విషయంపై కుటుంబసభ్యులతో విభేదాలు తలెత్తుతాయి.

కుంభ రాశి
పనిలో మీరు చేసే ప్రాజెక్టుల కారణంగా ఈ రోజు ప్రమోషన్ పొందుతారు. మీ ఇంటిని రీడిజైన్ చేయాలని భావిస్తారు. కనుక, ఇంటీరియర్ డిజైన్ మరియు సృజనాత్మక వస్తువులు డెకరేట్ చేయడం కోసం కొంత డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది. కొన్ని అనూహ్య సంఘటనలు జరగడంతో ఆశ్చర్యానికి లోనవుతారు. వ్యాపారులకు సానుకూల ఫలితాలు వస్తాయి.

మీన రాశి
మీరు ఈరోజు పాజిటివ్‌ ఆలోచనలు చేస్తారు. మీ ఆలోచనల్ని ఇతరులతో షేర్ చేసుకునే అవకాశం ఉంది. పనిచేసే చోట సహోద్యోగులు మీతో బాగా కలిసిపోతారు కనుక పనిని మీరు ఆస్వాదిస్తారు. మీ అనారోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. ఏదైనా ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టాలని కొందరు మీకు సలహా ఇవ్వనున్నారు. తొందరపాటు నిర్ణయాలు చేటు చేస్తాయని గుర్తుంచుకోండి. 
 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News