Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 13, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ధనలాభం

Today Horoscope In Telugu 13 April 2021: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 13వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు. రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2021, 07:27 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 13, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి ధనలాభం

Horoscope Today 13 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 13వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈ రోజు సమయపాలన కీలకంగా మారనుంది. మీతో కొన్ని వనరులు మాత్రమే ఉన్నాయని మీరు భావిస్తారు. కానీ ఇది మీ రోజును సరిగ్గా ప్లాన్ చేయనందున మీకు ఆ అభిప్రాయం కలగనుంది. భవిష్యత్తులో మీకు కావలసిన దానిపై దృష్టిసారిస్తారు. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు.

Also Read: Ugadi 2021 Wishes: మీ సన్నిహితులకు శ్రీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఇలా చెప్పండి

వృషభ రాశి
ఈ రాశి వారు నేడు కొంత మార్పు కోరుకుంటారు. మీరు చాలా కాలం పాటు పని చేయడం ద్వారా విశ్రాంతి కోరుకుంటున్నారు. మీ వ్యక్తిగత జీవితం గురించి యోచించేందుకు కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం శ్రేయస్కరం. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి చూపుతారు. ఆలయాలు సందర్శిస్తారు. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మిథున రాశి
రెండు నిర్ణయాలలో ఏది మీకు అధిక ప్రయోజనం చేకూరుస్తుందో తెలుసుకోలేక సతమతమవుతున్నారు. అయితే మానసిక ప్రశాంతతను కోల్పోతే పనులకు ఆటంకం తలెత్తుతుంది. ప్రతిదానికీ లాభాలు మరియు నష్టాలను తెలుసుకుని ముందడుగు వేయాలి. నేడు మీకు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది. ఉద్యోగులకు నూతన అవకాశాలు తలుపు తట్టనున్నాయి.

కర్కాటక రాశి 
ఈరోజు భావోద్వేగాలకు అధికంగా లోనవుతారు. అయితే మానసిక సంఘర్షణను నియంత్రించుకుంటే సమస్యలు తప్పుతాయి. మీ పనిపై దృష్టి సారించడానికి సమయాన్ని కేటాయించండి. ఈ రోజు చాలా చిన్న విషయాలు కూడా మిమ్మల్ని బాధించగలవు. కనుక కేవలం మీ పనులతో తీరిక లేకుండా ఉండేలా చూసుకుంటూ, ఇతరుల విషయాలకు దూరంగా ఉంటే ఏ సమస్యా ఉండదు. ఉద్యోగులకు అంతా శుభాలు కలుగుతాయి.

Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

సింహ రాశి
మీ సన్నిహితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబంలో కొన్ని పరిస్థితుల కారణంగా ఒత్తిడి నెలకొంటుంది. మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దవద్దు. మీరు చేసే పనికి ఎప్పటిలాగే చాలా డిమాండ్ ఉంటుంది. వ్యాపారులు కొంత మార్పు కోరుకుంటారు. కీలక సమాచారాన్ని ఇతరులకు అందజేస్తారు.

కన్య రాశి
బ్రహ్మచారులు ఈ రోజు ప్రేమ విషయంలో ఆశ్చర్యకర సంఘటన ఎదుర్కొంటారు. వివాహితులు మీ జీవిత భాగస్వామికి తమ ప్రేమను మరోసారి చూపించాల్సిన సమయం వచ్చింది. ఆఫీసులో తక్కువ సమయం గడపండి. విద్యార్ధులు కొత్త అభిరుచిని కనుగొనటానికి యత్నిస్తారు. ఖర్చులు పెరగడంతో రుణ యత్నాలు మొదలుపెడతారు. ఉద్యోగులకు పని బారం తగ్గనుంది. 

తులా రాశి
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. తద్వారా మీకు మానసిక ఉల్లాసం కలుగుతుంది. అవసరమైతే ఉదయం వేళ శారీరకశ్రమ, వ్యాయామం లాంటివి చేయడం శ్రేయస్కరం. మీ వ్యక్తిగత జీవితం గురించి ఆలోచనలు మీ పనికి ఆటంకం కలిగించవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు, వ్యాపారులకు కోరుకున్న వృద్ధి గోచరిస్తుంది. నూతన వ్యక్తుల నుంచి శుభవార్తలు అందుకుంటారు.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు నేడు ఒకే సమయంలో పలు రకాల పనులు చేయాల్సి వస్తుంది. ఈ రోజు మీకు కార్యాలయంలో పలు బాధ్యతలు అప్పగించనున్నారు. మీ సంస్థాగత నైపుణ్యాలు ఈ పనులను పూర్తి చేయడంతో మీకు సహాయపడతాయి. మీపై నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ కోల్పోవద్దు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగులు, వ్యాపారులకు అవాంతరాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది.

Also Read: Kumbh Mela 2021 Photos: ఘనంగా ప్రారంభమైన హరిద్వార్ కుంభమేళా, ఫొటో గ్యాలరీ

ధనుస్సు రాశి
ఈ రోజు మీ ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి సారించాలి. ఈ రోజు ఇంటి నుండి పనిలో కాస్త సాయం చేయండి. కుటుంబం మీరు తమతో కలిసిమెలిసి ఉండాలని, వారికి సమయం కేటాయించాలని ఎక్కువగా కోరుకుంటుంది. ప్రేమ విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కోబోతున్నారు. పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరగడంతో దైవదర్శనాలు చేయాలని భావిస్తారు.

మకర రాశి
మీరు భావోద్వేగాలను బయటకు కనిపించకుండా జాగ్రత్త పడతారు. కానీ నేడే మీ భావోద్వేగాలను బయటకు చూపించాల్సిన సమయం వస్తుంది. మీ మనసులో ఏముంది, మీ సమస్యలను ఎవరితోనైనా మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగులకు సమస్య పరిష్కారం అవుతుంది. శ్రమకు తగ్గ ఫలితం అందుకుంటారు. కొన్ని శుభవార్తలు, ఆహ్వానాలు అందుకుంటారు.

కుంభ రాశి
చాలా రోజులుగా మీ జీవిత భాగస్వామితో గడపాలని ఎదురుచూసిన సమయం వచ్చింది. మీ ప్రేమను వ్యక్తపరచాలనుకుంటే ముందుకు సాగండి. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. వ్యాపారులకు పరిస్థితి అనుకూలంగా మారుతుంది. ఉద్యోగులు శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందుతారు. 

మీన రాశి
మీ రోజును మీ పనులు పరుగు పరుగున ప్రారంభిస్తారు. ఇది మిమ్మల్ని ఆరోగ్యంగా, చురుకుగా ఉంచుతుంది. మీ పనులను అప్పగించడానికి ఒకరిని అన్వేషిస్తారు. నేడు మీకు వస్తులాభం గోచరిస్తుంది. కొన్ని ఆహ్వానాలు అందడంతో ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నేడు మీకు అంతా శుభాలు కలుగుతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది.

Also Read: ఈ 7 పదార్థాలు, వస్తువులు శివుడికి సమర్పించకూడదని తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

More Stories

Trending News