Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 13, 2021 Rasi Phalalu, ఓ రాశివారు ప్రయాణాలు వాయిదా

Horoscope Today 13 May 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మే 13వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
మీ మాటలు ఈరోజు చాలా ముఖ్యమైనవి. ఆచితూచి మాట్లాడాలి. మీకు కావలసినదాన్ని పొందడానికి ప్రతి ఒక్కరినీ సులభంగా ఒప్పించగలుగుతారు. ఆర్థిక సమస్యల కారణంగా రుణ యత్నాలు మొదలుపెడతారు. మీ సామర్థ్యాన్ని తప్పు మార్గంలో ఉపయోగించవద్దు. ఉద్యోగులు, వ్యాపారులకు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి.

Also Read: Garuda Vahana Seva: తిరుమలలో వేడుకగా శ్రీవారి గరుడ వాహన సేవ Photos

వృషభ రాశి
సొంతంగా ప్రేరణ పొందడం అలవాటు చేసుకుంటారు. కొన్ని రోజులు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీ చూసిన ప్రతిదాన్ని పొందడానికి అలవాటు పడ్డారు. అయితే ప్రతి విషయంలో అది అంత తేలిక కాదని తెలుసుకోండి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. నేడు మీకు ధనలాభం గోచరిస్తుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఉద్యోగులకు సానుకూల ఫలితాలు రానున్నాయి.

మిథున రాశి
ఈరోజు మీరు
సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అంతా మేలు జరుగుతుంది. మీరు సూటిగా ఆలోచిస్తున్నారు మరియు చాలా స్పష్టమైన మనస్సుతో ఉన్నారు. కీలక నిర్ణయాలు తీసుకునేందుకు నేడు తగిన సమయం. మీ సన్నిహితులు, బంధువులకు సహాయ సహకారాలు అందిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం రాకపోవడంతో ప్రయాణాలు చేయాలని భావిస్తారు. ఉద్యోగులకు పని భారం అధికం కానుంది. వ్యాపారులకు సాధారణ ఫలితాలు.

కర్కాటక రాశి 
ఈ రోజు మీరు మరింత స్వతంత్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఇతరుల సహాయం లేకుండా మీరే అన్ని వ్యవహరాలు చక్కదిద్దుతారు. ఆధ్యాత్మిక చింతన పెరగడంతో ఆలయాలు సందర్శిస్తారు. కొందరు మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. మీ ఆదాయం పెరుగుతుంది.

సింహ రాశి
చిరునవ్వుతో ఈ రోజు పనులను ప్రారంభించండి. మీ మనసులో చాలా ఆలోచనలున్నాయి, కానీ వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొందరి వ్యవహారం మీకు ఇబ్బందిగా ఉంటుంది. ఈ రోజు ఇతరులపై ఎక్కువగా ఒత్తిడి చేయవద్దు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొన్ని శుభవార్తలు చెవిన పడతాయి. ఉద్యోగులకు నూతన అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారులు ఆచితూచి వ్యవహరించాలి. 

Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

కన్య రాశి
ఈ రోజు ఏ విషయంలోనూ మీరు వెనక్కి తగ్గవద్దు. సరైన నిర్ణయం తీసుకుని దైర్యంగా ముందడుగు వేయాలి. మీ చుట్టూ ఉన్నవారు కొన్ని విషయాలు తెలుసుకోవాలని యత్నిస్తారు. నేడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల అభిప్రాయాలు తెలుసుకోవడం ఉత్తమం. ప్రయాణాల కారణంగా ఆకస్మిక ఆర్థిక సమస్యలు వస్తాయి. ఉద్యోగులు, వ్యాపారులకు ఆశించిన ఫలితాలు అందుతాయి. 

తులా రాశి
నేడు మీరు ప్రయాణాలు చేయనున్నారు. కొంతకాలం మీరు చూడని వ్యక్తులను కలుసుకోవాలని భావిస్తారు. ఆలోచించడం మానేసి, పనులలో ముందడుగు వేయడం శ్రేయస్కరం. స్థల మార్పిడి ద్వారా మీ ఒత్తిడి దూరమవుతుంది. మీ లక్ష్యాలపై ఎక్కువ దృష్టిసారిస్తారు. కార్యక్రమాలు మధ్యలోనే నిలిచిపోతాయి. ఉద్యోగుల బాధ్యతలు మరింత పెరుగుతాయి. వ్యాపారులకు నేడు సాధారణంగా ఉంది.

వృశ్చిక రాశి
మీరు చిన్నవారి సలహా తీసుకోవాలని భావిస్తారు. నమ్మితేనే వారి వద్ద మాట్లాడి, అభిప్రాయాలు తీసుకోవాలి. నూతనంగా పరిచయమైన వ్యక్తి నుంచి సాయం అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఉద్యోగులకు పని భారం తగ్గుతుంది. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. కుటుంబసభ్యులు, సన్నిహితులతో సరదాగా సమయాన్ని గడుపుతారు.

ధనుస్సు రాశి
ఈ రాశి వారు నేడు ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు. కెరీర్ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు తెలిసిన వాటికి కట్టుబడి ఉండండి మరియు ఇది మీకు మంచి రోజు అవుతుంది. ఊహించని వ్యక్తి నుంచి మద్దతు లభిస్తుంది. కొత్త విషయాలను నేడు పరిశీలించవద్దు. నేడు కొన్ని విలువైనవి కొనుగోలు చేయాలని భావిస్తారు. వ్యాపారులకు లాభసాటిగా ఉండనుంది.

Also Read: Health Tips: రాత్రివేళ ఈ ఆహార పదార్థాలు, Fruits తినకూడదు, అందుకు కారణాలు ఇవే

మకర రాశి
మీ మాటతీరు ఈరోజు చాలా ప్రభావం చూపుతుంది. ప్రజలు సాధారణంగా మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడతారు. మీరు ముక్కుసూటిగా వ్యవహరిస్తారు. దానివల్ల మీకు నేడు అంతా మేలు జరుగుతుంది. చుట్టూ ఉన్నవారు మీ అసాధారణ దృక్పథాన్ని అర్థం చేసుకుంటారు. ఉద్యోగులు మరింత శ్రమించక తప్పదు.

కుంభ రాశి
ఈ రోజు మీ శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీ నిజమైన స్నేహితులు మీకు ఏ నష్టం జరగకుండా జాగ్రత్త పడతారు. నేడు మీరు ఎక్కువ ఒత్తిడికి గురికావద్దు. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు కాస్త చికాకు తెప్పిస్తాయి. వ్యాపారులు అధికంగా శ్రమించాల్సి ఉంటుంది.

మీన రాశి
మీరు ఓ సమస్య నుండి బయటపడినట్లు మీకు అనిపిస్తుంది. మీకు తెలియని సమాచారం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. ఇతరుల సహాయం లేకున్నా సొంతంగా మీరే విషయాలను నిర్వహించగలరని అందరికీ నమ్మకం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు తీరతాయి. కొన్ని శుభవార్తలు చెవిన పడతాయి. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగులు సానుకూల ఫలితాలు అందుకుంటారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

English Title: 
Horoscope Today 13 May 2021: Today Rasi Phalalu in Telugu From Aries To Pisces
News Source: 
Home Title: 

Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 13, 2021, ఓ రాశివారు ప్రయాణాలు వాయిదా

Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 13, 2021 Rasi Phalalu, ఓ రాశివారు ప్రయాణాలు వాయిదా
Caption: 
Today Horoscope In Telugu 13 May 2021
Yes
Is Blog?: 
No
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు మే 13, 2021, ఓ రాశివారు ప్రయాణాలు వాయిదా
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Thursday, May 13, 2021 - 07:36
Created By: 
Shankar Dukanam
Updated By: 
Shankar Dukanam
Published By: 
Shankar Dukanam
Request Count: 
73
Is Breaking News: 
No