Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 23, 2021 Rasi Phalalu, ఓ రాశి వారికి ఆకస్మిక ధననష్టం

Today Horoscope In Telugu 23 February 2021: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 23న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2021, 07:57 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 23, 2021 Rasi Phalalu, ఓ రాశి వారికి ఆకస్మిక ధననష్టం

Horoscope Today 23 February 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 23న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
కొత్త ప్రదేశాలకు వెళ్లాలని భావిస్తారు. ప్రయాణాలు అనివార్యం అవుతాయి. భయాందోళన చెందవద్దు. ఉద్యోగస్తులకు మంచి జరుగుతుంది. ఈ రోజు కొన్ని విషయాల గురించి తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. రుణాల కోసం బంధుమిత్రులను సంప్రదిస్తారు. 

Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది

వృషభ రాశి
కొంతకాలం నుంచి దూరంగా ఉంటున్న వ్యక్తితో చర్చలు జరుపుతారు. దీని వల్ల మీకు కొందరిపై స్పష్టత వస్తుంది. ఈరోజు మీరు కాస్త నిరాశకు లోనవుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తే ఏ సమస్య మీ దరిచేరదు. ఇతరులకు అపకారం చేయాలన్న ఆలోచనలకు దూరంగా ఉంటే ఇద్దరికీ శ్రేయస్కరం. 

మిథున రాశి
నిరాశ చెందకుండా మీ పనులలో ముందుకు సాగడం ఉత్తమం. అనుకోకుండా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. బంధుమిత్రులతో విభేదాలు గొడవలకు దారి తీసే అవకాశం ఉంది. ఈ రోజు ధ్యానం చేయడానికి కొంత సమయం కేటాయించండి, తద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. . 

కర్కాటక రాశి
మీరు ఈరోజు చాలా సరదాగా ఉంటారు. ఇది ఇతరులకు మిమ్మల్ని దగ్గరి చేస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. అదే సమయంలో మీరు చేయాల్సిన పనులపై దృష్టి సారించాలి. వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయనున్నారు. కర్కాటక రాశి వారికి నేడు ఆకస్మిక ధనలాభం. కుటుంబంతో సమయాన్ని గడుపుతారు.

సింహ రాశి
ఆర్థిక సమస్యలు చికాకు తెప్పిస్తాయి. డబ్బు సంబంధిత విషయాలను, కుటుంబ విషయాలతో పోల్చి చూడరాదు. మీకు డబ్బు అవసరమైతే, బంధువుల నుంచి కాకుండా పరిచయస్తుల నుంచి రుణాలు తీసుకోవడానికి యత్నించడం ఉత్తమం. ఎందుకంటే డబ్బు వల్ల సమస్యలు పెరగవచ్చు. కానీ మానసికంగా ప్రశాంతంగా ఉండటం నేర్చుకోవాలి. దీర్ఘకాలిక సమస్యలపై విజయం సాధిస్తారు.

కన్య రాశి
ఒక వ్యక్తి గురించి ఆలోచనలు మిమ్మల్ని కొద్దిగా గందరగోళానికి గురిచేస్తాయి. ఏం చేయాలో తోచకపోవడంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతారు. సమాజంలో గౌరవమర్యాదలు పొందుతారు. మీ ఆలోచనలతో కార్యజయం. సహోద్యోగులకు సలహాలు ఇస్తారు. కొందరు వ్యక్తులు మీకు ఆప్తులుగా నటించే అవకాశం ఉంది. అలాంటి వారికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. 

తులా రాశి
ఈరోజు తులా రాశి వారు ఓపికగా వ్యవహరిస్తారు. తద్వారా మీరు కోరుకున్న విషయాలు నెరవేరనున్నాయి. నేడు మీకు ఆకస్మిక ధనలాభం సూచిస్తుంది. కొందరు స్నేహితులను కలుసుకుని సంతోషంగా సమయాన్ని గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

వృశ్చిక రాశి
కనిపించే ప్రతిది నిజమని విశ్వసించవద్దు. కొందరు మీతో సన్నిహితంగా ఉంటూ మీ విషయాలు సేకరిస్తుంటారు. ఆ వ్యక్తి ఎవరో కనిపెట్టేందుకు మీరు కాస్త సమయాన్ని వెచ్చిస్తారు. దూర ప్రయాణాలు సైతం చేయాల్సి వస్తుంది. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఉద్యోగులు, వ్యాపారులకు రుణాలు అవసరం అవుతాయి. 

ధనస్సు రాశి
కొన్ని సమస్యలలో చిక్కుకుంటారు. మీకు పరిష్కారం దొరకకపోతే అందుకు కారకులు ఎవరో తెలుసుకునే ప్రయత్నం మొదలుపెడతారు. మిమ్మల్ని ప్రేరేపించిన వ్యక్తి గురించి ఆలోచించండి. దైవదర్శనం చేస్తారు. కుటుంబంతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు.

Also Read: Sandes App: సత్తా చాటుతున్న సందేశ్, WhatsAppలో లేని 5 ఫీచర్లు తీసుకొచ్చిన స్వదేశీ యాప్

మకర రాశి
అవసరం అయిన సందర్భంలో అప్పు అడగడానికి సిగ్గుపడకండి. మీరు చేసేది మంచి పని అయితే కచ్చితంగా అందుకు మీకు సహాయం అవసరం. ఆకస్మిక ధనలాభం సూచిస్తుంది. శుభవార్తలు సైతం అందుకుంటారు. బంధుమిత్రులు, కుటుంబంతో కలిసి శుభకార్యాలలో పాల్గొనే సూచనలు గోచరిస్తున్నాయి. నమ్మకస్తులైన వారిని మాత్రం డబ్బు లేదా ఇతర సహాయం అడగటం శ్రేయస్కరం.

కుంభ రాశి
భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే ఎక్కడైనా నష్టం జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయి. ఉద్యోగం చేసేవారికి పని ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ధననష్టం కలగనుంది. ఆచితూచి అడుగులు వేయాలి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు.

మీన రాశి
ఒంటరిని అయ్యానని దిగులు చెందవద్దు. మీ లక్ష్యం మంచి మార్గంలో ఉంటే అంతా మేలు జరుగుతుంది. కుటుంబంలో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థిక విషయాలు కీలక మార్పులు చోటుచేసుకుంటాయి. అన్ని పరిస్థితులకు మీరు మానసికంగా సిద్ధంగా ఉండాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News