Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 24, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి నూతన అవకాశాలు

Today Rasi Phalalu In Telugu 24 February 2021: మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 24న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 24, 2021, 07:54 AM IST
Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 24, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి నూతన అవకాశాలు

Horoscope Today 24 February 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఫిబ్రవరి 24న డాక్టర్ సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈ రోజు మీరు చేయవలసిన పనుల జాబితాలో ఉన్నవాటిని పక్కన పెడతారు. ఎందుకంటే అంతకంటే ముఖ్యమైన పని మీ ఇంటి గుమ్మంలో ఎదురుచూస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుట్టేందుకు ధనవ్యయం. ఆర్థిక సమస్యలు. ఉద్యోగులు, వ్యాపారులకు అంతగా కలిసిరాదు. కొత్త ప్రాజెక్టులను జాగ్రత్తగా పరిశీలించండి. మొదలుపెట్టాక వెనక్కి తగ్గలేరు. 

Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది

వృషభ రాశి
మీ మనసులో ఎన్నో ఆలోచనలు మెదలుతాయి. వాటిని ఎలా అమలు చేయబోతున్నారో గుర్తించడం మీ పని. అయితే నేడు మీ శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సరిగ్గా ప్లాన్ చేస్తే దాన్ని సులభంగా పనులు పూర్తి చేసుకోవచ్చు. ఉద్యోగులకు తగిన గుర్తింపు, ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. 

మిథున రాశి
ఈ రోజు పనిలో మీరు అధిక శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాల్సి వస్తుంది. మీరు ఉన్న స్థితిలో ఉండటానికి యత్నిస్తున్నవారు మిమ్మల్ని ఎదగనీయకుండా అడ్డుకునే యత్నాలు చేస్తారు. తీవ్రమైన ఒత్తిడి, పని భారాన్ని మోయాల్సి వస్తుంది. అయితే మీ పని ద్వారా నిరూపించుకుంటారు. అనారోగ్య సమస్యల బారిన అవకాశాలున్నాయి. పని నిమిత్తం కొందరు ప్రయాణం సైతం చేయాల్సి ఉంటుంది. 

కర్కాటక రాశి
మీ పనిలో సమస్యలు తలెత్తినప్పుడు, మీరు వాటిని విస్మరించి పారిపోవలసిన అవసరం లేదు. మీ నైపుణ్యాలు మిమ్మల్ని రక్షిస్తాయి. కాబట్టి మీకు ఇచ్చిన సమస్యలకు పరిష్కారం మీరే కనుగొనగలరని విశ్వసించండి. సన్నిహితుల నుంచి కీలక వార్తలు అందుకుంటారు. ఉద్యోగులు, వ్యాపారాలకు కాస్త ఊరట లభిస్తుంది. మీ సామర్థ్యాన్ని ప్రదర్శించడంతో గౌరవాన్ని పొందుతారు.

సింహ రాశి
పనిచేసే చోట మీకు చికాకుకు కలుగుతుంది. అయితే కాస్త ఓపికగా వ్యవహరించాలి. మీ డెస్క్‌కు వెళ్లేముందు కొన్ని వస్తువులు తీసుకెళ్లి అక్కడ ఉంచడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. దైవదర్శనాలు చేసే అవకాశం ఉంది. కొందరి నుంచి నిజంగా ప్రేరణను పొంది మీ పనిని ఆనందిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయట పడేందుకు రుణాలు సైతం తీసుకోవాలని యోచిస్తారు.

కన్య రాశి
కొందరు కొత్తవారితో పరిచయం ఏర్పడుతుంది. దాని వల్ల మీ పనిపై ప్రభావం చూపుతుంది. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. అయితే ఆలోచించి వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేసేందుకు శాయశక్తులా శ్రమిస్తారు. అందుకు తగ్గ ప్రతిఫలం పొందుతారు. 

తులా రాశి
కొంతకాలం కింద నుంచి ఉన్న మనస్ఫర్థలతో వివాదాలు ఏర్పడుతాయి. మీరు చేపట్టిన ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగులకు అంతా మంచి జరుగుతుంది. మీరు నమ్మిన దానిపై ఎంతవరకైనా వెళతారు. మీకు ఈరోజు ఆకస్మికంగా ధనలాభం చేకూరనుంది. అయితే ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగు వేయాలి. 

Also Read: EPFO: 4 విధాలుగా మీ ఖాతాల్లోని PF Balanceను సులువుగా చెక్ చేసుకోవచ్చు

వృశ్చిక రాశి
ఈ రోజు మీరు ప్రతి విషయాన్ని సరదాగా తీసుకుంటారు. మీ ప్రేమ ఫలించేందుకు ఇది తగిన సమయం. మీరు ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. చేపట్టే పనిని పూర్తి చేసేందుకు అవాంతరాలు ఎదుర్కొంటారు. ప్రతి విషయానికి ఒత్తిడికి గురికాకుండా ఉండాలి. కుటుంబంలోగానీ, సన్నిహితుల మధ్య వివాదాలు తలెత్తుతాయి. 

ధనస్సు రాశి
అపరిచితులని కలవడం మీకు చాలా సరదాగా ఉంటుంది. కానీ ప్రతిసారి అన్ని విషయాల్ని సరదాగా తీసుకోకూడదు. వ్యాపారులకు, ఉద్యోగులకు నేడు అంతగా కలిసిరాదు. పనిలో తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ప్రయోజనం మాత్రం కనిపించదు. రాత్రివేళ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మీలో ఎవరికి కనిపించని కొత్త కోణాన్ని కొందరు బయటపెట్టేందుకు యత్నిస్తారు. మీ పనుల్లో జాప్యం కావడంతో ధనవ్యయం పెరుగుతుంది. 

మకర రాశి
మీ పనిలో ఆనందాన్ని వెతుక్కోవడం మంచి విషయమే కానీ దానివల్ల నష్టాలే అధికంగా ఎదుర్కోనున్నారు. కొన్ని సందర్భాలలో ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. మీతో కలవడానికి ప్రయత్నిస్తున్న ఇతరులను కాస్త గమనించాలి. ఆకస్మిక ధనలాభం మీకోసం ఎదురుచూస్తుంది. వ్యాపారులకు కలిసొస్తుంది. కొన్ని విషయాలు మీ ఆనందనాన్ని రెట్టింపు చేస్తాయి.

Also Read: 7th Pay Commission Latest News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు Supreme Court శుభవార్త 

కుంభ రాశి
మీకు దగ్గరగా ఉన్న వ్యక్తితో వివాదాలు తలెత్తవచ్చు. అకారణంగా మీతో గొడవకు దిగే అవకాశాలు ఉన్నాయి. మీరు చేసే ప్రతి పనిని వ్యతిరేకిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ఉద్యోగులు సకాలంలో తమ పనిని పూర్తి చేస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.

మీన రాశి
మీరు ప్రేమలో విఫలమైనప్పుడు, పెద్దల సలహాలు తీసుకుంటారు. కంటికి కనిపించిన విషయాన్ని కూడా కొన్నిసార్లు మీరు స్పష్టంగా చూడలేరు. ఉద్యోగులు, వ్యాపారులకు అంతగా కలిసిరాదు. శ్రమ పెరిగినా పనులలో జాప్యం జరుగుతుంది. దైవచింతన పెరుగుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News