Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 28, 2021 Rasi Phalalu, ఆ రాశివారికి జాబ్ ఆఫర్

Today Horoscope In Telugu 28 April 2021: ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. ఏప్రిల్ 28వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 28, 2021, 08:10 AM IST
Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు ఏప్రిల్ 28, 2021 Rasi Phalalu, ఆ రాశివారికి జాబ్ ఆఫర్

Horoscope Today 28 April 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి ఏప్రిల్ 28వ తేదీన సందీప్ కొచ్చర్ నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
మీకు ఈ రోజు చంద్రుని ఆశ్వీర్వాదాలున్నాయి. మరియు వాయిదా వేసిన ఏవైనా ప్రాజెక్టులు మీ సహోద్యోగుల సహాయంతో తిరిగి ప్రారంభిస్తారు. ఇంట్లో మీరు మీ తల్లిదండ్రులతో కాస్త సమయాన్ని గడుపుతారు. మీ మనస్సును శాంతపరచడానికి సంగీతం వినండి, ఇంకా అవసరమైతే ధ్యానం లాంటివి చేయాలి. ఉద్యోగులు, వ్యాపారులకు సత్ఫలితాలు గోచరిస్తున్నాయి.

Also Read: Dreams: కలలో ఈ జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి

వృషభ రాశి
అధిక పని చేస్తున్న కారణంగా మీరు మానసికంగా అలసిపోతారు. డబ్బు విషయంలో మీ జీవిత భాగస్వామితో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. గతంలో చేసిన పెట్టుబడుల ద్వారా వచ్చే లాభాలు ఈ రోజు మీకు ప్రశాంతతను చేకూరుస్తాయి. ఈ రోజు మీరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మరియు ప్రయాణాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఉద్యోగులకు పనిలో సమస్యలు తొలగుతాయి.

మిథున రాశి
పనికి సంబంధించిన ప్రాజెక్టుల కోసం చేస్తున్న ప్రయాణం ఈ రోజు మీకు అనుమానాలు కలిగిస్తుంది. మీ తోబుట్టువులను కలుసుకునే ఓ వేడుక, సందర్భం మిమ్మల్ని ఒకరికొకర్ని దగ్గర చేస్తుంది. ఒంటరి యువతీయువకులు డేటింగ్ లాంటి విషయాలకు దూరంగా ఉండండి. చేపట్టిన పనులలో అవాంతరాలు తలెత్తుతాయి. వ్యాపారులకు ఆశించిన ఫలితాల కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది.

కర్కాటక రాశి 
కర్కాటక రాశి వారు తమ సమయాన్ని పనిలో సృజనాత్మకమైన లాంటి వాటికి కేటాయిస్తారు. నూతన ప్రాజెక్టు ఒప్పందాలు కార్యాలయంలో మిమ్మల్ని కొత్త వ్యక్తులతో సంభాషించేలా చేస్తాయి. కొందరు ప్రభావవంతమైన వ్యక్తులు మీకు సహాయం చేస్తారు. విద్యార్థులకు తమ అధ్యయనాలలో కీలక అడుగు పడుతుంది. ఉద్యోగులు, వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

సింహ రాశి
అలసట కారణంగా ఈ రోజు కొద్దిగా మందకొడిగా ఉంటుంది. నేడు మీరు ఆఫీసు పనులు, ప్రాజెక్టులపై అంతగా ఆసక్తి కనబరచరు. కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇస్తారు. వ్యాపారులు నూతన పెట్టుబడులకు శ్రీకారం చుడతారు. మీరు స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాలనుకుంటే, ఈ రోజు మీకు బాగుంది. ఉద్యోగులకు పనులలో అవాంతరాలు తొలగుతాయి.

Also Read: Marriage Luck: ఈ రాశులలో జన్మించిన అమ్మాయిలకు పెళ్లి తరువాత సిరిసంపదలు, సుఖశాంతులు!

కన్య రాశి
మీ చేతిలో చాలా బాధ్యతలు ఉన్నందున కన్య రాశి వారు ఈ రోజు తొందరపాటుగా నిర్ణయాలు తీసుకుంటారు. డబ్బుకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఈ రోజు పరిష్కారం అవుతాయి. అనారోగ్య సమస్య మిమ్మల్ని బాధిస్తుంది. ముఖ్యంగా చిన్నారులను ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా చూసుకోండి. ఆర్థిక సమస్యలతో సతమతమవుతారు.

తులా రాశి
ఈ రోజు మీరు నిర్భయంగా మరియు ఎలాంటి అనుమానాలు లేకుండా ముందుకు సాగుతారు. ఉద్యోగులను వారి ఉన్నతాధికారులు గమనిస్తారు. శ్రమకు తగిన ఫలితంగా ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. మీ ఇంటిని రీడిజైన్ చేయాలనుకుంటున్నారు. పిల్లలు చదువు విషయానికి వస్తే వారు మీ మాట వినకుండా విసిగిస్తారు. నేడు మీకు వాహనయోగం గోచరిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేసే అడుగు వేస్తారు. 

వృశ్చిక రాశి
మీరు ఈ రోజు కుటుంబసభ్యుల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. మీ పని ఒత్తిడితో కూడుకున్నది, అదే సమయంలో మీరు కచ్చితంగా ఆఫీసుకు వెళ్లాల్సి రావడం మిమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తుంది. సహోద్యోగులు మీ అభిప్రాయాలను అర్థం చేసుకోకపోవచ్చు. పిల్లలు ఈ రోజు చాలా సంతోషంగా ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్య సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారులు చిక్కుల్లో పడతారు.

ధనుస్సు రాశి
ఈ రోజు చాలా తక్కువ ప్రయత్నంతో సానుకూల ఫలితాలను పొందుతారు. అనూహ్యంగా ఓ వ్యక్తి కోసం మీరు వెతుకులాట ప్రారంభిస్తారు. ఉద్యోగార్ధులు వారి చదువు, అర్హతలకు తగిన ఉద్యోగాన్ని పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు పనులు త్వరగా పూర్తి కావడంతో ఆదాయం పెరుగుతుంది. 

Also Read: Rainbow In Dreams: మీ కలలో ఇంద్రధనస్సును చూశారా, దాని అర్థం ఏంటంటే

మకర రాశి
పని ఒత్తిడి అధికం కావడంతో సెలవు తీసుకోవాలని భావిస్తారు. మీరు ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. వివాహిత జంటలు కొత్త ఇల్లు అన్వేషణ ఫలిస్తుంది. సృజనాత్మక రంగంలో ఉన్న వారికి నేడు ఆశించిన ఫలితాలు గోచరిండం లేదు. గతంలో ప్రేమించిన వ్యక్తి మీకు తారసపడటం వల్ల మీరు గందరగోళానికి లోనవుతారు. చాలా రోజుల తరువాత స్నేహితుల్ని కలుసుకుంటారు. వ్యాపారులకు అంతా లాభసాటిగా ఉంటుంది.
 
కుంభ రాశి
కొంతకాలం నుంచి మీరు చాలా పరధ్యానంలో ఉన్నారు. కానీ పరిస్థితుల్లో మార్పు రావడంతో పనులు, కెరీర్‌పై ఫోకస్ చేయాల్సి వస్తుంది. ఈ రోజు ఆఫీసులో సెలవు తీసుకుని కుటుంబంతో విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఖర్చులు అధికం కావడంతో రుణ యత్నాలు మొదలుపెడతారు. నేడు మీకు ఏం చేసినా ఫలితాలు అంతంత మాత్రంగానే అందుకుంటారు.

మీన రాశి
ఈ రోజు వ్యాపారంలో కొన్ని మార్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబసభ్యుల మధ్య తగాదాలతో మీరు సమయం గడిచిపోతుంది. పని కారణంగా ఇంటి సమస్యలను పరిష్కరించే సమయం మీకు తక్కువగా ఉండవచ్చు. నగదు సంబంధించిన విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చేపట్టిన పనులలో జాప్యం తలెత్తుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News