Today Horoscope: నేటి రాశి ఫలాలు మార్చి 7, 2021 Rasi Phalalu, వారికి ఇది మంచిరోజు

Today Rasi Phalalu in Telugu From Aries To Pisces | మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 7న జోతిష్య పండితుడు దేవస్య మిశ్రా నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 7, 2021, 08:47 AM IST
Today Horoscope: నేటి రాశి ఫలాలు మార్చి 7, 2021 Rasi Phalalu, వారికి ఇది మంచిరోజు

Horoscope Today 7 March 2021: పన్నెండు రాశిచక్రాలు ప్రతి దాని ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటాయి. ఆకస్మిక ధనలాభం, వాహనయోగం, కుటుంబంలో ఎలా ఉండనుందననే విషయాలు ఈరోజు మీ సంబంధిత రాశిచక్ర చిహ్నంలోని నక్షత్రాలు మరియు గ్రహాలు మీ రోజును ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకోండి. మేషం, వృషభం, మిథునం మొదలుకుని మీన రాశివారికి మార్చి 7న జోతిష్య పండితుడు దేవస్య మిశ్రా నేటి రాశి ఫలాలు అందిస్తున్నారు.

మేష రాశి
ఈ రోజు మీకు మీ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను మెరుగుపరచడానికి తగినంత సమయం ఉంటుంది. ఈ రోజు దంపతులు తమ పిల్లల చదువు కోసం చాలా డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మీకు ఇష్టమైన వ్యక్తులతో మాటలు లేకపోవడం అనేది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తుంది. ప్రపంచంలోని ప్రతి ప్రేమనే మార్గం అని ఈ రోజు మీరు భావిస్తారు. కుటుంబంలో కొందరు చాలా దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ ప్రయాణం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని తెలుసుకుంటారు. మీ జీవిత భాగస్వామిని ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అని మీరు భావిస్తారు.

Also Read: Srisailam Brahmotsavalu: మహా శివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైలం క్షేత్రం 

వృషభ రాశి
మిమ్మల్ని చుట్టుముట్టే మరియు మీ పురోగతిని అడ్డుకునే సమస్యల నుండి బయటపడటానికి ఇది సరైన సమయం. ఈ రోజు మీ ఖర్చులు పెరుగుతాయి. ఆలయాలు, పవిత్ర ప్రదేశాలు సందర్శిస్తారు. ఓ సాధువును కలుసుకుని మీ మానసిక ప్రశాంతత ఎందుకు కరువైందో చెప్పి, పరిష్కార మార్గాన్ని పొందుతారు. అదే సమయంలో మీకు చాలా అవకాశాలు ఉంటాయి. జీవితాన్ని ఆస్వాదించడానికి మీరు మీ స్నేహితులకు కూడా సమయం ఇవ్వాల్సి ఉంటుంది. మీరు సమాజం నుండి దూరంగా ఉండకూడదు, అందరికి దగ్గరై కలుపుకుని వెళ్తేనే ప్రయోజనం పొందగలరు.

మిథున రాశి
వ్యాపారా చేయాలనుకునేవారు పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి రోజు. కానీ మీ సన్నిహితులు, నమ్మకస్తులైన వారితో చర్చించి వారి సలహాతో మాత్రమే పెట్టుబడి పెట్టాలి. మీ కుటుంబం కోసం ఎంతో కృషి చేస్తారు. మీరు చేసే విషయాలలో ఇతరులకు నమ్మకం కలగదు. కానీ అసలు విషయం ఆలస్యంగా తెలుసుకుంటారు. శృంగార పరమైన జీవితానికి అడ్డంకులు తొలగుతాయి.మీరు ఏ పోటీలో అడుగుపెట్టినా, మీ స్వభావం గెలవడానికి సహాయపడుతుంది. వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి చేసుకున్న వారు తమ జీవిత భాగస్వామికి సమయాన్ని కేటాయిస్తారు.

కర్కాటక రాశి
ఒక స్నేహితుడు మీ సామర్థ్యాన్ని మరియు ఆలోచనల్ని పరీక్షించవచ్చు. మీ విలువలను తగ్గించుకోకుండా ప్రతి నిర్ణయాన్ని సరైన పద్ధతిలో తీసుకుని ముందుకు సాగుతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి, భవిష్యత్తు కోసం ఏం చేయాలో యోచిస్తారు. ఇలా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలతో మంచి ఫలితాలు అందుకుంటారు. ఈరోజు మీ కుటుంబానికి ఒక శుభవార్త అందుతుంది. మీ ప్రియురాలికి మీరు తగినంత సమయం ఇవ్వకపోతే అతడు లేక ఆమె మీపై అలక వహిస్తారు. ఆఫీసు నుండి ఇంటికి తిరిగి వెళ్లేటప్పుడు వాహనం జాగ్రత్తగా నడపకపోతే ప్రమాదం గోచరిస్తుంది.

Also Read: Astrology: కుంభరాశిలోకి శుక్రుడు ప్రవేశం, 12 రాశుల వారిపై దీని ప్రభావం ఇలా ఉండనుంది 

సింహ రాశి
స్టేడియం లాంటి బయట ప్రదేశాలలో ఆడే ఆటలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. ధ్యానం మరియు యోగా మీకు మానసిక ప్రశాంతత, ప్రయోజనం చేకూరుస్తాయి. నైపుణ్యం, అనుభవం ఉన్న వ్యక్తి సలహా లేకుండా నిర్ణయాలు తీసుకుంటే ఆర్థిక నష్టాలు సంభవిస్తాయి. పిల్లల అనారోగ్యం సమస్యలను కలిగిస్తుంది. తమ ప్రియమైనవారితో సమయం కేటాయిస్తూ ప్రశాంతంగా గడుపుతారు. వారి జీవితంలో మరపురాని సందర్భాలలో ఒకటి. ఈ రోజు కొందరు బంధువులు మీ ఇంటికి వస్తారు. వారితో మీ విలువైన సమయాన్ని గడుపుతారు.

కన్య రాశి
యోగా ధ్యానంతో ఈరోజు ప్రారంభించవచ్చు. ఇలా చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటారు. అయితే మీ ఆస్తులు, మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో పరిశీలించాల్సిన సమయం ఇది. మీరు ఆలోచించే విధంగా ఈ రోజు కుటుంబం పరిస్థితి ఉండదు. కుటుంబంలో విభేదాలు, చికాకులు తప్పవు. అటువంటి పరిస్థితిలో మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి.

తులా రాశి
ఒత్తిడి కారణంగా అనారోగ్యం రెట్టింపు అవుతుంది. స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి. ఈ రోజు కూడా ఎవరికైనా రుణాలు ఇవ్వడం మర్చిపోవద్దు. కచ్చితమైన వివరాలు, పత్రాలతో డబ్బు ఎప్పుడు తిరిగి ఇస్తారో వ్రాతపూర్వకంగా తీసుకుంటారు. మీ కుటుంబ సభ్యుల మాట వినకపోవడం వల్ల అనవసరమైన చర్చ జరిగి కలహాలకు దారితీయవచ్చు. కొన్ని విషయాలలో విమర్శలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. మీ వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉండనుంది. మీరు గతంలో చేసిన పనిని చాలా అసంపూర్తిగా వదిలేశారు. అయితే నేడు మిగతా పనిని పూర్తి చేయాల్సి వస్తుంది.

వృశ్చిక రాశి
ఈ రోజు మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా విశ్రాంతి తీసుకుంటారు. శారీరక శ్రమ కోసం యోగా, ధ్యానం లాంటివి చేయాల్సి ఉంటుంది. ఈరోజు చాలా సంతోషంగా ప్రారంభించినా చివరలో ఏదో ఒక విషయం మిమ్మల్ని బాధపెడుతుంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు మీ కుటుంబం యొక్క అభిప్రాయాన్ని తీసుకోండి. మీ సొంత నిర్ణయం కొన్ని సమస్యలకు దారితీస్తుంది. అనుకోని పరిస్థితులలో ముఖంపై చిరునవ్వు అబద్ధం.  మీరు ప్రత్యేకమైన వారిని కోల్పోతున్నందున గుండె కొట్టుకోవడానికి ఇష్టపడదు. ఈ రోజు మీరు మీ ఖాళీ సమయాన్ని మీ తల్లి సేవలో గడపాలని కోరుకుంటారు, కాని ఈ సందర్భంగా కొంత పని రావడం వల్ల అది సాధ్యం కాదు. 

ధనుస్సు రాశి
తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఇది మీ పిల్లల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. ఇప్పటివరకు అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తున్నవారు దాని ప్రాముఖ్యత ఏంటన్నది అర్థమవుతుంది. నేడు వారికి డబ్బు అవసరం పడటంతో దాని విలువ తెలుసుకుంటారు. మీ పరిస్థితులను మరియు అవసరాలను అర్థం చేసుకున్న స్నేహితులతో మాత్రమే బయటకు వెళ్లండి. మీ వ్యక్తిత్వం ఎప్పటికీ మీకు మేలు చేస్తుంది.

మకర రాశి
మీ అలసటను తొలగించడానికి మరియు మీ శక్తి సామర్థ్యాలను పెంచడానికి మీకు పూర్తి విశ్రాంతి అవసరం. తగిన విశ్రాంతి లేకపోతే ఒత్తిడికి గురవుతారు. తద్వారా మానసిక ప్రశాంతత కరువవుతుంది. కొందరు వ్యక్తులు ఏదైనా పథకంలో డబ్బు పెట్టడానికి వారితో తోటివారు సిద్ధంగా ఉంటారు. అయితే అన్ని పర్యాయాలు ఇది మీకు ప్రయోజనాన్ని కలిగించకపోవచ్చు. మీ అతిథులతో మర్యాదగా ప్రవర్తించాలి. ఓ మాట అన్నారంటే అది మీ కుటుంబాన్ని అసంతృప్తికి గురిచేయడమే కాక,  దూరాన్ని కూడా పెంచుతుంది. ఉద్యోగులు అనుకున్న ఫలితాలు వస్తాయి.

కుంభ రాశి
మీ వ్యక్తిత్వం ఈ రోజు సుగంధంలాగ వ్యాపిస్తుంది. మరియు అందరినీ మీవైపు ఆకర్షిస్తుంది. తమ దగ్గరి బంధువులు లేదా సన్నిహితులు, మిత్రులతో కలిసి వ్యాపారం చేస్తున్న వారు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేనిపక్షంలో నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వివాదాస్పద అంశాలపై చర్చించకుండా ఉండాలి. ఇది మీకు మరియు మీ ఇష్టమైన వారికి మధ్య వివాదాలను సృష్టిస్తుంది. ఈ రోజు మీరు కొందరు వ్యక్తులతో అనవసర విషయాలు చర్చిస్తూ  సమయాన్ని వృథా చేసే అవకాశం ఉంది.

మీన రాశి
మీరు చాలా ధైర్యంగా ఉండటమే మీకు బలాన్ని చేకూరుస్తుంది. నాణ్యత మీ మానసిక సామర్థ్యాలను పెంచుతుంది. ఎలాంటి పరిస్థితినైనా అదుపులోకి తీసుకురావడానికి వేగాన్ని పాటించాలి. ఈ రోజు మీకు లాభదాయకం కాదు. కనుక ఆర్థిక అవసరాలపై నిఘా ఉంచి ఖర్చులు చేయాలి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మీకు ఆందోళన కలిగిస్తుంది. పుట్టినరోజును మరచిపోవడం వంటి చిన్న విషయానికి జీవిత భాగస్వామితో గొడవ జరుగుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

More Stories

Trending News