Horoscope Today August 17th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశికి చెందిన వ్యాపారస్తుల పంట పండినట్లే...

Horoscope Today August 14th 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతీ రోజూ సుమూహర్తం, దుర్మూహర్తం, అమృత గడియలు, రాహు కాలం.. ఇలా ఉంటాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 17, 2022, 06:33 AM IST
  • ఇవాళ బుధవారం.. శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన రోజు
  • ఇవాళ శ్రీకృష్ణుడిని పూజిస్తే మంచి ఫలితాలు పొందుతారు
  • ఈ బుధవారం ఏయే రాశుల జాతక ఫలం ఎలా ఉందంటే
Horoscope Today August 17th : నేటి రాశి ఫలాలు.. ఈ రాశికి చెందిన వ్యాపారస్తుల పంట పండినట్లే...

Horoscope Today August 14th 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతీ రోజూ సుమూహర్తం, దుర్మూహర్తం, అమృత గడియలు, రాహు కాలం.. ఇలా ఉంటాయి. గ్రహాల స్థితి గతులను బట్టి ఇవి నిర్ణయమవుతాయి. వ్యక్తుల జాతకంలో గ్రహాల గమనం వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. మరి ఈ బుధవారం ఏ రాశుల వారి జీవితం ఎలా ఉండనుందో ఇప్పుడు తెలుసుకుందాం..

మేష రాశి (Aries)

వ్యాపార కార్యకలాపాలకు సంబంధించి హడావుడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఆర్థికపరమైన ఒప్పందాలపై సంతకాలు చేసేముందు నిపుణుల సలహా కోరండి. ప్రభుత్వ రంగంలో ఉన్న ఉద్యోగులు మంచి ఫలితాలు పొందుతారు. జాబ్ లొకేషన్‌లో మార్పు మీ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అవొచ్చు. ఒక పెద్ద కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ రావొచ్చు. వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు.

వృషభ రాశి (Taurus)

ఆర్థిక స్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టినవారికి ఇవాళ భారీ మొత్తం లభించే అవకాశం ఉంది. ఆర్థికపరమైన పెట్టుబడులే అన్నివిధాలా కలిసొస్తాయని గ్రహిస్తారు. వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్లాన్స్ చేస్తారు. ఎవరి వద్ద ఇవాళ అప్పు కోసం చేయి చాచవద్దు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది.

మిథున రాశి (GEMINI)

కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఏర్పడుతుంది. మీ ప్రతీ పనిని ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అనుకూల సమయం. తోబుట్టువులంతా ఇవాళ ఒక్కచోట చేరి సరదాగా గడిపే అవకాశం ఉంది. ఇంటికి సంబంధించిన పనులు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామికి ఇంటి పనులతోనే సరిపోతుంది. అందరి ఆరోగ్యం బాగుంటుంది.

కర్కాటక రాశి (Cancer) 

ప్రేమలో ఉన్నవారికి ఇవాళ కొత్త అనుభవం ఎదురవుతుంది. తమ ప్రేయసి లేదా ప్రియుడితో సన్నిహితంగా గడుపుతారు. అవివాహితులైన సింగిల్స్‌కి మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామి మీపై కోపంగా ఉంటారు. ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటే సమస్య ఇట్టే పరిష్కారమవుతుంది. 

సింహ రాశి (LEO)

ఇంట్లో పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. తద్వారా మానసిక ఆందోళన నుంచి బయటపడుతారు. ఆత్మవిశ్వాసం కొద్దిగా లోపిస్తుంది. అది మీ పనిని ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యపరంగా ప్రోటీన్ రిచ్ ఫుడ్ మంచిది. ప్రతీరోజూ యోగా లేదా ధ్యానం వంటివి చేస్తే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. ఇవాళ వ్యాపారస్తులకు, ఉద్యోగులకు అనుకూల సమయం నడవనుంది.

కన్య రాశి (Virgo)

విద్యారంగంలో ఉన్నవారు బాగా రాణిస్తారు. ఆర్థిక పరిస్థితి మామూలుగానే ఉన్నప్పటికీ ఇతరులకు సాయం చేసేందుకు వెనుకాడరు. మీ వ్యక్తిత్వం కారణంగా సొసైటీలో మీ పట్ల మరింత గౌరవం, మర్యాద ఏర్పడుతాయి. ఉద్యోగంలోనైనా, వ్యాపారంలోనైనా మీ కృషికి తగిన గుర్తింపు దక్కుతుంది. మీ ప్లాన్స్ సక్సెస్ అవుతాయి. కుటుంబంతో కలిసి ఆలయాల సందర్శనకు వెళ్లే అవకాశం ఉంది.

తులా రాశి (Libra)

విదేశీ సంబంధిత పనులు చేసేవారు కొంత మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కోక తప్పదు. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారు ఓపిక కోల్పోవద్దు. మంచి జాబ్ కొట్టేంతవరకు ప్రయత్నాలు ఆపవద్దు. మీ ప్లాన్స్ అనుకున్నట్లుగా ముందుకు సాగకపోవచ్చు. కొన్ని పనులు మరుసటిరోజుకు లేదా కొన్నాళ్ల పాటు వాయిదా పడుతాయి. రిలేషన్‌షిప్‌లో అనవసర వాదనలతో గ్యాప్ పెరిగే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి (Scorpio)

ఇవాళ వ్యాపారస్తుల పంట పండినట్లే. వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. మునుపటికన్నా ఆర్థిక స్థితి గతులు మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారు బాగా పెర్ఫామ్ చేయగలరు. స్థిరాస్తి పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. కొన్ని ఒప్పందాలు మీకు బాగా కలిసొస్తాయి. వ్యాపార రంగంలో రిస్క్ చేయవద్దు. లేనిపక్షంలో భారీ మూల్యం చెల్లించక తప్పవద్దు.

ధనుస్సు రాశి (Sagittarius)  

అన్ని సంఘటనలను మీ మనసులో పెట్టుకుని చింతించవద్దు. కొన్నింటిని ఎక్కడికక్కడే వదిలేయాలి. మీ జీవిత భాగస్వామితో ప్రతీ విషయం చర్చిస్తారు. ఆమె లేదా అతని సలహాలు అన్నివిధాలా కలిసొస్తాయి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. దీంతో జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారు.

మకర రాశి (Capricorn) 

ఆరోగ్యపరంగా ఇంట్లో అందరూ క్షేమంగా ఉంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు నయమవుతాయి. గర్భిణిలు వీలైనంత సేపు రెస్ట్ తీసుకోవాలి. ఒకవేళ ప్రయాణాలు చేయాల్సి వస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనిలో విజయం కోసం తరచూ దైవాన్ని ప్రార్థించడం అలవాటు చేసుకుంటారు.విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులకు ఇవాళ మిశ్రమ ఫలితాలు ఉండొచ్చు.

కుంభ రాశి (Aquarius)

ప్రేమ వ్యవహారాల్లో స్నేహితుల సహాయ సహకారాలు అందుతాయి. విషయాన్ని ఇంట్లో పెద్దలకు చెప్పే ప్రయత్నం చేస్తారు. వారి అంగీకారంతో పెళ్లికి నిర్ణయం తీసుకుంటారు. ఈ క్రమంలో ఆచీ తూచీ వ్యవహరించడం చాలా ముఖ్యం. తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు. మీకు సాయంగా నిలిచే మిత్రులను గౌరవించాలి. వారిని చులకన చేసే చర్యలు మంచివి కాదు.

మీన రాశి (Pisces) 

మీరు మీ జీవిత భాగస్వామి నుంచి ఏమి ఆశిస్తున్నారో.. విపులంగా తనతో చెప్పండి. ఒకరితో ఒకరు మనసు విప్పి మాట్లాడుకోండి. తద్వారా ఇరువురి మధ్య ప్రేమ బంధం మరింత బలపడుతుంది. ప్రేమలో ఉన్నవారు సంతోషంగా గడుపుతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా ప్రయాణించే అవకాశం ఉంది. ఇంటికి అతిథులు రావొచ్చు. అంతా కలిసి సరదాగా గడుపుతారు. 

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read: Godavari Floods: మళ్లీ ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి, భద్రాచలంలో మూడవ ప్రమాద హెచ్చరిక

Also Read: Right Way To Flod National Flag: ఆగస్టు 15 తర్వాత జండాను ఎలా భద్రపర్చాలో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News