Horoscope Today August 8th : నేటి రాశి ఫలాలు.. ప్రేమలో ఉన్న ఈ రాశి వారిని ఇబ్బందులు చుట్టుముడుతాయి..

Horoscope Today August 8th 2022: ఇవాళ శ్రావణ సోమవారం. భక్తి, శ్రద్ధలతో శివుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నేటి రాశి ఫలాల్లో ఉద్యోగ, వ్యాపారస్తులకు శుభకాలం నడుస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Aug 8, 2022, 05:06 PM IST
  • ఇవాళ సోమవారం.. పరమ శివుడికి అంకితం చేయబడిన రోజు
  • జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఉద్యోగ, వ్యాపారస్తులకు ఇవాళ శుభదినం
  • ఈ ఆదివారం ఏ రాశుల జాతక ఫలం ఎలా ఉందంటే..
Horoscope Today August 8th : నేటి రాశి ఫలాలు.. ప్రేమలో ఉన్న ఈ రాశి వారిని ఇబ్బందులు చుట్టుముడుతాయి..

Horoscope Today August 8th 2022: ఇవాళ శ్రావణ సోమవారం. భక్తి, శ్రద్ధలతో శివుడిని ఆరాధిస్తే మంచి ఫలితాలు పొందుతారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నేటి రాశి ఫలాల్లో ఉద్యోగ, వ్యాపారస్తులకు శుభకాలం నడుస్తోంది. ఇవాళ ఏయే రాశుల వారి జాతక ఫలం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి (Aries)

ఉద్యోగంలో మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు తగిన అవకాశం చిక్కుతుంది. రొటీన్‌కు భిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తారు. పని భారం ఎక్కువగా ఉండటం మానసిక అలసటకు కారణమవుతుంది. హోల్ సేల్ వ్యాపారులకు ఇవాళ లాభదాయకంగా ఉంటుంది. మునుపటికన్నా ఆర్థిక స్థితి మరింత మెరుగవుతుంది. పెట్టుబడులకు ఫలవంతమైన రోజు. కుటుంబ సభ్యుల మద్దతు పొందుతారు. కొన్ని వివాదాల్లో పెద్దల సూచన మేరకు రాజీకొస్తారు. ప్రేమలో ఉన్నవారిని ఇబ్బందులు చుట్టుముడుతాయి.

వృషభ రాశి (Taurus)

ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ విషయంలో సమాచారం అందే అవకాశం ఉంది. చేపట్టే ప్రతీ పనిలో నిపుణుల సలహా తీసుకుంటే మంచిది. ఇంటలెక్చువల్ వర్క్స్‌తో ఆదాయం పెరుగుతుంది. తెలియని వ్యక్తులతో దురుసుగా ప్రవర్తించడం మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టుతుంది. షాపింగ్‌కి ఇవాళ అనుకూలమైన రోజు. తల్లిదండ్రులు, పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. జీవిత భాగస్వామితో సరదా గడిపేందుకు ఎక్కడికైనా వెళ్లే అవకాశం ఉంది.

మిథున రాశి (GEMINI)

వ్యాపారపరంగా వృద్ధి ఉంటుంది. ఎగుమతులు దిగుమతుల వ్యాపారంలో ఉన్నవారు త్వరగా ఎదిగేందుకు అవసరమైన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి గుడ్ న్యూస్ అందవచ్చు. వ్యాపారస్తుల ఆర్థికంగా బలమైన స్థితిలో ఉంటారు. మీ మాటకు కుటుంబంలో విలువ పెరుగుతుంది. సాయంత్రం పిల్లలతో సరదాగా గడుపుతారు. ప్రేమ జీవితం బాగుంటుంది.

కర్కాటక రాశి (Cancer) 

ఇవాళ మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. పని విషయంలో బ్యాలెన్స్ కుదురుతుంది. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. పని ప్రదేశంలో చిన్న చిన్న వివాదాలను పట్టించుకోవద్దు. ఆర్థికపరమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మధ్యాహ్నం తర్వాత డబ్బు మీ చేతిలోకి వస్తుంది. షేర్ మార్కెట్, స్థిరాస్తి, మ్యూచువల్, లేదా ఇన్సూరెన్స్‌లలో పెట్టుబడి పెట్టడం మంచి ఆప్షన్. మీ తోబుట్టువులు, వారి ఫ్యామిలీతో కలిసి మీ ఇంటికి రావొచ్చు. అంతా కలిసి సంతోషంగా గడుపుతారు.

సింహ రాశి (LEO)

పని విషయంలో చాలా కష్టపడుతారు. అందుకు తగిన ఫలితాలు పొందుతారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఇవాళ అనుకూల దినం. ఉద్యోగ, వ్యాపారస్తుల ఆర్థిక స్థితి బాగుంటుంది. పని విషయంలో అత్యుత్సాహం పనికిరాదు. పైగా ఇబ్బందుల్లో పడుతారు. తల్లిదండ్రుల్లో తల్లి నుంచి ఎక్కువ మద్దతు పొందుతారు. పాత ప్రేమికులు మళ్లీ కలిసే అవకాశం ఉంది. 

కన్య రాశి (Virgo)

ప్రభుత్వ ఉద్యోగంలో అధికారుల స్థాయిలో ఉన్నవారికి ఇది అనుకూల సమయం. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యువత సక్సెస్ అవుతారు. పెద్ద కంపెనీలో జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది. సేవింగ్స్‌పై ఎక్కువ దృష్టి పెడుతారు. స్థిరాస్తులపై పెట్టుబడులకు ఆసక్తి చూపుతారు. కుటుంబానికి సంబంధించిన ఒక విషయంపై తీవ్రంగా చర్చిస్తారు. చిన్న చిన్న విషయాలకు కూడా ఎవరినీ ఫీడ్ బ్యాక్స్ కోరవద్దు.

తులా రాశి (Libra)

చిరు వ్యాపారులకు ఇవాళ శుభదినం. మంచి లాభాలు పొందుతారు. కొత్త ప్లాన్ అమలుచేయడం కలిసొస్తుంది. ఉద్యోగస్తులు షార్ట్ టెంపర్ తగ్గించుకోవాలి. మీ కోపమే మీకు శత్రువుగా మారే ప్రమాదం ఉంది. ఫారిన్ వర్క్‌లో ఉన్నవారికి శుభకాలం. ఉద్యోగస్తుల ఫైనాన్షియల్ కండిషన్ బాగుంటుంది. ప్రియుడు లేదా ప్రియురాలితో కలిసి గుడికి వెళ్లే అవకాశం ఉంది. అవివాహితులకు ఇవాళ అనుకూలంగా ఉంటుంది.

వృశ్చిక రాశి (Scorpio)

పనితో తీరిక లేకుండా గడుపుతారు. బిజినెస్ కాంట్రాక్ట్స్‌లో ఉన్నవారికి శుభకాలం. అదృష్టం వారిని వరిస్తుంది. మీ ఆదాయానికి తోడు కుటుంబ సభ్యుల ఆదాయం కూడా తోడవుతుంది. బిజినెస్‌లో కోరుకున్న విధంగా మంచి ఫలితాలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు లేదా  చర్చలతో కొంత టెన్షన్ వాతావరణంనెలకొంటుంది. ఇలాంటి సమయంలో మీ మాటలను అదుపులో ఉంచుకోవాలి. ఆరోగ్యపరంగా ఇవాళ బాగుంటుంది. అనారోగ్య సమస్యలు నయమవుతాయి.

ధనుస్సు రాశి (Sagittarius)  

ప్రభుత్వ రంగంలో అధికారుల హోదాలో పనిచేస్తున్నవారికి ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ పరంగా తగిన గుర్తింపుతో పాటు సామాజికంగానూ మీకు తగిన గుర్తింపు రావొచ్చు. మీకు రాకుండా ఇతరుల వద్ద ఆగిపోయిన డబ్బు ఎట్టకేలకు అందుతుంది. ఫారిన్ బిజినెస్‌లు చేసేవారు మంచి లాభాలు పొందుతారు. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు ఆ బంధం బ్రేక్ అవుతుందేమోనను వీడుతారు.

మకర రాశి (Capricorn) 

ఉద్యోగ వ్యాపారస్తులకు శుభసమయం. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి తాము కోరుకున్న దానికంటే బెటర్ జాబ్ దొరుకుతుంది. వ్యాపార విస్తరణ లేదా మరో రంగంలో కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించడం కలిసొస్తుంది. ఇంట్లో చిన్నవాళ్ల పట్ల ప్రేమతో వ్యవహరించండి. పిల్లలతో గడపడం వల్ల కొంత మానసిక ప్రశాంతత పొందుతారు. మిమ్మల్ని మీరు స్ట్రాంగ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. 

కుంభ రాశి (Aquarius)

పని ప్రదేశంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆఫీసులో చీటికి మాటికి కోప తాపాలు పనికిరావు. అవి మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడి ప్లాన్స్‌ను ప్రస్తుతానికి విరమించుకోండి. వ్యాపారస్తులకు ఇవాళ శుభదినం. మంచి లాభాలు పొందుతారు. కుటుంబ బంధాలు బలపడుతాయి. ప్రేమలో ఉన్నవారికి అన్నివిధాలా అనుకూల సమయం.

మీన రాశి (Pisces) 

ఉద్యోగ, వ్యాపారస్తులకు కలిసొస్తుంది. వ్యాపారస్తులు కొత్త వెంచర్స్ ద్వారా లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. ఆర్థికి స్థితి గతులు చాలా మెరుగవుతాయి. స్థిరాస్తి వివాదాలు కొన్ని ఇబ్బందిపెట్టవచ్చు. కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా సమస్యలు పరిష్కరించుకోగలరు. సంతోషాన్ని, మానసిక ప్రశాంతతను కోల్పోయి బాధపడుతారు. జీవితభాగస్వామితో గొడవ జరగవచ్చు. 

(గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ ఊహలు, అంచనాలపై ఆధారపడి ఉండొచ్చు. జీ మీడియా దీనిని ధృవీకరించలేదు.)

Also Read: Komati Reddy Rajagopal Reddy: పోచారంను కలవనున్న రాజగోపాల్‌రెడ్డి..రాజీనామా లేఖ సమర్పణ..!

Also Read: Samsung Smart TV: బెస్ట్ బ్రాండ్, బెస్ట్ ఫీచర్స్.. 32 అంగుళాల శాంసంగ్ స్మార్ట్ టీవీ సగం కన్నా తక్కువ ధరకే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News