Horoscope Today Feb 23 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అధిక ధన వ్యయం తప్పదు!

February 23 2022 Horoscope: మకర, కుంభ రాశి వారికి అధిక ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. ఈ రెండు రాశుల వారు ఈ రోజు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 23, 2022, 08:42 AM IST
  • Feb 23 2022 రాశి ఫలాలు
  • ఆ రెండు రాశుల వారికి అధిక ధన వ్యయం తప్పదు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే?
Horoscope Today Feb 23 2022: ఈరోజు రాశి ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అధిక ధన వ్యయం తప్పదు!

Horoscope Today February 23 2022: మేషం ( Aries): శుభ సమయం నడుస్తోంది. కుటుంబ నిర్ణయాలు ఫలిస్తాయి. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలు చేస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. ప్రయాణాలు చేస్తారు. శివారాధన మేలు చేస్తుంది.

వృషభం (Taurus): పనులకు ఆటంకాలు ఎదురుకాకూండా చూసుకోవాలి. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మనో బలంతో ముందుకు వెళ్లాలి. శివారాధన మంచిది.

మిథునం (Gemini): అవసరానికి తగిన సాయం అందుతుంది. అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కీలక నిర్ణయాలలో పెద్దల సూచనలు అవసరం. ఇష్టదైవారాధన ఉత్తమం.

కర్కాటకం (Cancer): భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. అవసరానికి తగినట్టు ముందుకుసాగడం మేలు. అనవసర ఒత్తిడి దరిచేయనీయవద్దు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. శివారాధన మేలు చేస్తుంది.

సింహం (Leo): విద్యా వ్యాపార రంగాల్లో సంతృప్తికరమైన ఫలితాలు అందుతాయి. ఉద్యోగంలో అనుకూలత ఉంది. కుటుంబ సభ్యులతో గడుపుతారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. మహాలక్ష్మి సందర్శనం శుభప్రదం.

కన్య (Virgo): మీ బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీమీ రంగాల్లో కుటుం బసభ్యుల సలహాలతో విజయం సాధిస్తారు. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు చేయకపోవడం మంచింది. సాయిబాబా సచ్ఛరిత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది.

తుల (Libra): శ్రమకు తగిన ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. శత్రువులపై పై చేయి సాధిస్తారు. దత్తాత్రేయుడిని ఆరాధన మంచిది.

వృశ్చికం (Scorpio): మనో ధైర్యంతో చేసే పనులు ఫలితాలను ఇస్తాయి. అధికారుల నుంచి అనుకూల నిర్ణయం వెలుబడుతుంది. కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి. ఉమామహేశ్వర స్తోత్రం శుభం కలుగుతుంది.

ధనస్సు (Sagittarius): ప్రతి రంగాల వారు శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఈశ్వర సందర్శనం ఉత్తమం.

మకరం (Capricorn): కీలక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. కీలక నిర్ణయాలలో పెద్దల సలహాలు తీసుకోవాలి, లేదంటే ఇబ్బందిపడతారు. ఈశ్వర ధ్యానం మంచి చేస్తుంది.

కుంభం  (Aquarius): మధ్యమ ఫలితాలు ఉన్నాయి. అధిక ధన వ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. అందరిని నమ్మకూడదు. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సూర్య నమస్కారం మంచిది.

మీనం (Pisces): ప్రతిఒక్కరి వారివారి రంగాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్య పనులను మొదలుపెట్టడానికి మంచి సమయం. విందువినోదాల్లో పాల్గొంటారు. లక్ష్మీదేవి సందర్శనం శుభదాయకం.

Also Read:  Ukraine Crisis: ఉక్రెయిన్ లో కమ్ముకున్న యుద్ధమేఘాలు.. స్వదేశానికి చేరుకున్న 242 భారతీయులు!

Also Read: IPL Australia Players: ఈ ఏడాది ఐపీఎల్ లో ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు దూరం?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x