Horoscope Today June 17th : నేటి రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారు ఇవాళ గుడ్ న్యూస్ వింటారు...

Horoscope Today June 17th 2022: ఈరోజు శుక్రవారం. ఇవాళ లక్ష్మీ దేవిని కొలిచే రోజు. రాశిచక్రంలో మేషం నుంచి మీనం వరకు మొత్తం 12 రాశుల జాతక ఫలాలు ఇవాళ ఎలా ఉన్నాయో జ్యోతిష్కుడు శ్రీనాథ్ ప్రపన్నాచార్య ద్వారా తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 17, 2022, 06:22 AM IST
  • నేటి రాశి ఫలాల ప్రకారం ఇవాళ పలు రాశుల వారికి మిశ్రమ ఫలితాలు
  • కొన్ని రాశుల వారికి ఇవాళ ప్రత్యేకమైన రోజు
  • ఇవాళ్టి రాశి ఫలాల్లో రాశిచక్రంలోని 12 రాశుల వారి జాతకం ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today June 17th : నేటి రాశి ఫలాలు.. ఈ 3 రాశుల వారు ఇవాళ గుడ్ న్యూస్ వింటారు...

Horoscope Today June 17th 2022: మేష, మిథున తదితర రాశుల వారికి ఇవాళ సాధారణ రోజు అవుతుంది. కొన్ని రాశుల వారికి ఇవాళ ప్రత్యేకమైన రోజు. ముఖ్యంగా 3 రాశుల వారు శుభవార్తలు అందుకుంటారు. నేటి రాశి ఫలాల్లో రాశిచక్రంలోని 12 రాశుల వారి జాతకం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం...  
 

మేషరాశి (Aries)

ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. ఆహారంపై శ్రద్ధ వహించండి, లేకుంటే ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆఫీస్‌లో అదనపు బాధ్యతలు రావడం వల్ల ఇబ్బంది కలుగుతుంది. లవ్‌మేట్ నుంచి ఖరీదైన బహుమతులు పొందుతారు.

వృషభ రాశి (Taurus)

మీ మాటలు, ప్రవర్తన తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇవాళ విద్యాపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. ఇవాళ చేపట్టే ప్రతీ పనిలో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈరోజు పూర్తిగా అనుకూలం. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. లవ్‌మేట్‌తో ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేస్తారు.

మిథున రాశి (GEMINI)

ఈ రోజు మీకు సాధారణ రోజు అవుతుంది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో అనుకున్న విధంగా లాభాలు వస్తాయి. స్నేహితులతో టూర్‌కి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. విద్యార్థులు కెరీర్‌పై దృష్టి పెట్టాలి. జాగ్రత్తగా ఉండండి, మీ కోపాన్ని నియంత్రించుకోండి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావొచ్చు.

కర్కాటక రాశి (Cancer) 

కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. ఏ పని పూర్తయినా మనసు ఆనందంగా ఉంటుంది. ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. విద్యార్థులకు ఈరోజు అనుకూలమైన రోజు. ప్రేమను వ్యక్తపరిచేందుకు అనుకూలమైన రోజు.

సింహ రాశి (LEO)

సామాజిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చూపుతారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈరోజు పెట్టిన పెట్టుబడులు లాభిస్తాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు అందడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది. ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ రోజు శుభదినం. జీవిత భాగస్వామి నుంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్ పొందుతారు. ప్రేమ సంబంధాలు బలంగా ఉంటాయి.

కన్య రాశి (Virgo)

మతపరమైన పనులపై ఆసక్తి చూపుతారు. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈరోజు శుభదినం. తల్లిదండ్రుల నుంచి ఆర్థిక సహకారం ఉంటుంది. ఈ రాశిచక్రానికి చెందిన వ్యాపారవేత్తలు అనుకోని బహుమతులు అందుకుంటారు. ఆహారం పట్ల శ్రద్ధ వహించండి. ఆరోగ్య సమస్యలు ఉండవచ్చు. సాయంత్రం స్నేహితులతో పార్టీకి వెళ్ళవచ్చు. మీ ప్రేమను వ్యక్తపరిచేందుకు ఈరోజు మంచి రోజు.

తులా రాశి (Libra)

కుటుంబంలో కొన్ని శుభవార్తలు అందుకోవడం వల్ల ఉత్సాహకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ఆకస్మిక ధనలాభాల వల్ల ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. స్నేహితుల మద్దతు పొందుతారు. ఎవరికైనా ప్రపోజ్ చేయడానికి ఈరోజు మంచి రోజు. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులు ప్రయాణం చేయవలసి రావచ్చు.

వృశ్చిక రాశి (Scorpio)

పని ప్రదేశంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. మానసికంగా కలవరపడవచ్చు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. వ్యాపారులు ఆర్థిక లావాదేవీల నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి.

ధనుస్సు రాశి (Sagittarius)  

ఈరోజు కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబమంతా కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో మంచి లాభం ఉంటుంది. ప్రయాణ యోగం ఉన్నది. దుబారా మానుకోండి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి, లేనిపక్షంలో వివాదాలు రావచ్చు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు.

మకర రాశి (Capricorn) 

ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. చేసే పనిలో అనుకోని అడ్డంకుల వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చు. వ్యాపారస్తులు ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి. ఈ రోజు మీ ప్రియురాలు లేదా ప్రియుడు వివాహ ప్రతిపాదన తీసుకురావొచ్చు.

కుంభ రాశి (Aquarius)

ఈ రోజు మీకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈరోజు కొన్ని శుభవార్తలను అందుకుంటారు. కోర్టు వ్యవహారాల్లో విజయం ఉంటుంది. వ్యాపారులు గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందుతారు. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు.

మీన రాశి (Pisces) 

ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు చేసే పనుల్లో కొన్ని ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. గోప్యమైన విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి, లేకుంటే వివాదాలు రావచ్చు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు చేపట్టే పనుల్లో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఈ రాశి విద్యార్థులు కొన్ని ఆనందకరమైన వార్తలను అందుకుంటారు.

Also Read: Agnipath Scheme Age Limit Extended: అగ్నిపథ్ స్కీమ్‌‌ అభ్యర్థులకు వయో పరిమితి పెంపు

Also Read: Singareni Jobs 2022: నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్.. సింగరేణిలో క్లర్క్ జాబ్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News