Horoscope Today: నేటి రాశిఫలాలు.. ఇవాళ ఈ మూడు రాశులవారు గుడ్ న్యూస్ వింటారు

Horoscope Today: ఈరోజు కొన్ని రాశులవారు శుభవార్తలు వింటే... మరికొన్ని రాశులవారు ఉద్యోగ, వ్యాపారాల్లో అపారమైన ప్రయోజనాలు పొందుతారు. ఈరోజు రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 17, 2022, 08:39 PM IST
Horoscope Today: నేటి రాశిఫలాలు.. ఇవాళ ఈ మూడు రాశులవారు గుడ్ న్యూస్ వింటారు

Horoscope Today: మనం ఏ శుభకార్యం తలపెట్టినా లేదా ఏదైనా పనిని ప్రారంభించినా ఆ రోజు దినఫలాలు ఎలా ఉన్నాయో చూసుకుంటాం. మరి నవంబరు 17న రాశిఫలాలు (Horoscope on 17th November 2022) ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. 

మేష రాశి (Aries)- సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధు, మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. 
వృషభ రాశి (Taurus)- మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరుల సహాయం అందుతుంది. అవసరానికి మీ చేతికి డబ్బు వచ్చే అవకాశం ఉంది. 
మిథున రాశి (Gemini)- శుభవార్త వింటారు. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. 
కర్కాటక రాశి (Cancer)- మీ కెరీర్ లో పురోగతి ఉంటుంది. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బంధు, మిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. 
సింహ రాశి (Leo)- ఈ రోజు ఈ రాశివారికి ఈ సమయం సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ప్రయోజనాలు పొందుతారు. వృత్తిలో పురోగతి సాధిస్తారు. 
కన్య రాశి (Virgo- ఎలాంటి అడ్డంకులు ఎదురైనా మీరు మీ పట్టుదలతో అనుకున్న పనిని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. 

తుల రాశి (libra)- మీ కెరీర్ కు సంబంధించిన శుభవార్త వింటారు. వ్యాపారంలో భారీగా లాభాలు ఉంటాయి. అవసరానికి సాయం అందుతుంది. 
వృశ్చిక రాశి (Scorpio)-  ఇతరులతో స్నేహం ఏర్పడుతుంది. ఈ సమయంలో మీరు ఖర్చులు పెరగకుండా చూసుకోండి. మీ తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. 
ధనుస్సు రాశి (Sagittarius)- ఈరోజు మీరు డేరింగ్ డెసిషన్ తీసుకుంటారు. మంచి ఫలితాలు పొందుతారు. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. 
మకర రాశి (Capricorn)- ఈరోజు ఈ రాశివారికి శుభకాలం నడుస్తోంది. మెుదలుపెట్టిన పనులు సులభంగా పూర్తిచేస్తారు. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. 
కుంభరాశి (Aquarius)- మీరు అనుకున్న పనిని ఎట్టకేలకు పూర్తిచేస్తారు. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.  ఫ్యామిలీ సపోర్టు లభిస్తుంది. 
మీన రాశి (Pisces)- మీరు ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు బాగుంటుంది. 

Also Read: Saturn Transit 2022: 30 ఏళ్ల తరువాత కుంభరాశిలో శనిగ్రహం, ఆ రాశులకు రేపట్నించి అంతా నరకమే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3P3R74U 

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News