Money Plant Vastu: శుక్రవారం మనీప్లాంట్ కు ఈ ఒక్క వస్తువు పెడితే మీకు డబ్బే డబ్బు..!

Money Plant Vastu: కొందరికి ఎంత కష్టపడినా డబ్బు నిలవదు. అందరూ కష్టపడేది ఆనందంగా కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. కానీ, కుండలి దోషమో? వాస్తు దోషమో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడతారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 26, 2024, 11:26 AM IST
Money Plant Vastu: శుక్రవారం మనీప్లాంట్ కు ఈ ఒక్క వస్తువు పెడితే మీకు డబ్బే డబ్బు..!

Money Plant Vastu: కొందరికి ఎంత కష్టపడినా డబ్బు నిలవదు. అందరూ కష్టపడేది ఆనందంగా కుటుంబ సభ్యులతో గడపాలని కోరుకుంటారు. కానీ, కుండలి దోషమో? వాస్తు దోషమో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడతారు. దానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటారు. ఈరోజు మనం ఇలాంటి ఓ వాస్తు టిప్ తెలుసుకుందాం. దీంతో ధనసమస్యలు తీరతాయి. 

సాధారణంగా మన అందరి ఇళ్లలో పూలు, తులసి చెట్టు పెట్టుకుంటాం. ఇవి ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. అయితే, మనీ ప్లాంట్ కూడా అందరి ఇళ్లలో చూసే ఉంటాం. ఇది కూడా ఇంటి వాస్తు దోష నివారణకు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. అయితే, శుక్రవారం రోజు ఈ మనీ ప్లాంట్ వాస్తు రెమిడీని ప్రయత్నిస్తే మీకు ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఇల్లు కూడా సుఖశాంతులతో వెల్లివిరుస్తుంది.అదేంటో తెలుసుకుందాం.

Also read: Today Rashifal (2024 january 26): ఈరోజు స్నేహితులతో కాలక్షేపం చేస్తారు..ఈ రాశివారు జాగ్రత్త పడకపోతే నష్టాలు తప్పవు..
మనీ ప్లాంట్ ఇంట్లో పెట్టుకుంటే దాన్ని సరైన దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి. సాధారణంగా ఆగ్నేయదిశలో పెట్టుకోవాలి లేదా ఉత్తర దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెట్టుకోవాలి. దీనివల్ల ఆ ఇంట్లో ప్రతికూల శక్తి తొలగిపోతుందని నమ్ముతారు.

వాస్తు శాస్త్రం ప్రకారం ఏదైనా శుక్రవారంరోజు మనీప్లాంట్ మొక్కలో ఈ రెమిడీ ప్రయత్నించండి. మనీ ప్లాంట్ మొక్కను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. మనీప్లాంట్ పచ్చగా, గుబురుగా పెరగడానికి కూడా చర్యలు తీసుకోవాలి. అయితే, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించిన తర్వాత మనీ ప్లాంట్ మొక్కలో పాలు పోయాలి. ఇలా చేస్తే మీకు ధనప్రాప్తి కలిగి మీ ఇల్లు సుఖశాంతులతో విరాజిల్లుతుంది. మనీప్లాంట్ తీగ కూడా పైకి  పాకేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాస్తు ప్రకారం మనీప్లాంట్ నేలపై తాకకూడదు. ఇది ఇంటికి నెగిటివ్ ఎనర్జీని తీసుకువస్తుంది.

Also read: S' అక్షరంతో పేరు మొదలయ్యేవారి వ్యక్తిత్వం ఎలాంటిది? వీళ్లు ఈ విషయంలో చాలా వీక్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News