August Born Personality: జ్యోతిష్యం మన భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రాచీనమైనది, ప్రజాదరణ పొందిన శాస్త్రం. ఇందులో ఒక వ్యక్తి జాతకాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి అతని/ఆమె పుట్టిన తేదీ, సమయం, స్థలం, రాశి చక్రంలోని గ్రహాల స్థానాలను తెలియజేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే వ్యక్తి పుట్టిన నెల బట్టి వారి గుణగణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
ఆగస్టు నెలలో జన్మించిన వారి రాశి సింహం, కన్యగా ఉంటుంది. ఈ రెండు రాశులు ఎంతో ప్రత్యేకమైనవి. ఈనెలలో జన్మించివారికి అద్భుతమైన తెలివితేటలు, మాటలతో ఇతరలను ఆకట్టుకోవడం, ఎంతటి కష్టమైన పనినైనా సులువుగా పరిష్కరించడం వంటి లక్షణాలు వీరిలో పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా ఈ లక్షణాలు ఉన్న వ్యక్తులు చాలా మంచి స్నేహితులు, సహోద్యోగులు లేదా కుటుంబ సభ్యులుగా ఉంటారు. ఈ నెలలో పుట్టినవారు ఎంతో నమ్మకంగా ఉంటారు. ఇతరులకు కీడు చేయాలని ఆలచన ఉండదు. కానీ వారికి ముక్కు మీద కోపం ఉంటుంది. దీని కారణంగా శ్రతువులు ఎక్కువగా ఉంటారు.
జ్యోతిష శాస్త్ర నిపుణుల ప్రకారం ఇతర నెలల వారికి కంటే ఆగస్టు నెలలో జన్మించినవారు ఎంతో అదృషవంతులు, ధైర్యవంతులగా పిలువబడుతారు. వీరు చదుపుల్లో ఎంతో చురుకుగా ఉంటారు. ఆగస్టు నెలలో పుట్టిన వారికి అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. అన్ని రంగాల్లో ఆల్ రౌండర్‌గా వ్యవహరిస్తారు. వారిలో మంచి సృజనాత్మకత ఉంటుంది. ఈనెలలో పుట్టినవారు ఇతరులు బాధపడుతుంటే చూడలేరు. సహాయం చేసేందుకు ఎల్లప్పుడు ముందుంటారు. ఆధ్యాత్మికత కూడా అతిగా ఉంటుంది. దైవం పట్ల ఎంతో గౌరవంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఈ నెలలో జన్మించిన వారు ఇతరుల ప్రశంసలను అందుకుంటారు. కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది.
అయితే ఈ నెలలో పుట్టినవారు ఎవరిని సులువుగా నమ్మరు. అలాగే ద్రోహం చేయడం వంటి పనులు చేయరు. అంతేకాకుండా వీరి సమస్యలను ఇతరులతో పంచుకోవడానికి అసలు ఇష్టపడరు. వారే స్వయంగా సమస్యలను పరిష్కరిస్తారు. నమ్మకంగా ఉన్నవారితో మాత్రమే వీరు తమకు సంబంధించిన విషయాలను పెంచుకుంటారు. నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ నెలలో జన్మించినవారు ప్రేమ విషయాల్లో ఇబ్బంది పడుతుంటారు. జీవితభాగస్వామిని ఎక్కువగా గౌరవిస్తారు. కొంతమొండితనం ఉంటుందికానీ నచ్చిన వారి కోసం ఓర్పుతో సహిస్తారు. కళలు, సంగీతం వంటి రంగాలలో ప్రతిభ కనబరుస్తారు. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఎల్లప్పుడూ ఆసక్తి చూపుతారు. అయితే తరచుగా ఒత్తిడికి గురవుతారు కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇవి సాధారణ లక్షణాలు మాత్రమే. ప్రతి వ్యక్తి వేరు వేరుగా ఉంటారు. ఈ లక్షణాలు అందరికీ వర్తించకపోవచ్చు. ఆగస్టు జాతకుల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే, జ్యోతిషశాస్త్రం, సంఖ్యాశాస్త్రం గురించి అధ్యయనం చేయవచ్చు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి