Ponguleti: కొద్దినెలల్లోనే తెలంగాణలో సీఎం మార్పు ఉంటుందన్న తెలంగాణ బీజేపీ లెజిస్లేటివ్ నేత యేలేటి మహేశ్వర్ రెడ్డి కామెంట్స్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ప్రతి పక్షంలో ఉన్నవారు ఏదైనా మాట్లాడతారని వారి మాటలు పట్టించుకునే పని లేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డే మొత్తం ఐదేళ్లు దాకా ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తేల్చి చెప్పారు పొంగులేటి. ఆ తర్వాత మళ్లీ సీఎంపై అధిష్ఠానం చూసుకుంటుందని చెప్పారు. ప్రతిపక్షాల ఆరోపణలు టీ కప్పులో తుఫాన్ లాంటివి కొట్టిపారేశారు పొంగులేటి. కానీ నిప్పు లేనిదే పొగరాదు. కొన్ని విషయాల్లో రేవంత్ రెడ్డి సర్కారు.. కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా దామగుండం సహా పలు కేంద్ర ప్రాజెక్టులకు ఆయన ఓకే చెప్పడంతో కాంగ్రెస్ అధిష్ఠానం అతనిపై గుర్రుగా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. డిసెంబర్ లేదా సంక్రాంతి తర్వాత పంచాయతీ ఎన్నికలు ఉండే అవకాశాలున్నాయన్నారు. ఈ నెల 5 నుంచి ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే చేపడుతోందన్నారు. దీనివల్ల ఎవరు తెలంగాణలో ఏ పథకానికి ఎవరు అర్హులు అనే విషయం స్పష్టం అవుతుందన్నారు.
అయితే గత ప్రభుత్వ హయాంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే చేసారు. అప్పట్లో కేసీఆర్ ఎంతో హడావుడిగా చేసిన ఈ కుటుంబ సర్వేపై ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. కేవలం తెలంగాణలో ఏయే కులాల వారు ఎంత మంది ఉన్నారనే విషయాన్ని తెలుసుకోవడంతో పాటు ఎక్కడ ఏ కులానికి ఎన్ని ఓట్లు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికే అప్పటి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రస్తుతం రేవంత్ సర్కారు కూడా తమ రాజకీయ లబ్ది కోసమే ప్రజలకు లబ్ది చూకూర్చని ఈ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టబోతునట్టు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి