Devguru Brihaspati Favorite Zodiac In Telugu: జ్యోతిష్య శాస్త్రంలో జ్ఞానం, తెలివితేటలు, సమాజంలో గౌరవానికి సూచికగా దేవగురు బృహస్పతిని సూచిస్తారు. అందుకే ఈ గ్రహం సంచారం చేసిన ప్రతి సారి అన్ని రాశులవారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. అయితే ఈ గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని సార్లు ప్రత్యేకమైన యోగాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. దీని కారణంగా కొన్ని రాశులవారికి ప్రతికూల, సానుకూల ప్రభావం పడుతుంది. కొన్ని సమయాల్లో గజకేసరి యోగం, హంస యోగం మొదలైన శుభ యోగాలు ఏర్పడతాయి. ముఖ్యంగా బృహస్పతి సంచారం చేయడం వల్ల ఈ కింది రాశులవారికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ 2 రాశులవారికి ఎల్లప్పుడు బృహస్పతి అనుగ్రహం లభిస్తుంది. అయితే ఏయే రాశులవారికి ఈ గ్రహం శుభప్రభావాన్ని చూపుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ధనుస్సు రాశి:
బృహస్పతి గ్రహ సంచారం కారణంగా ధనుస్సు రాశివారికి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి జీవితంలో వస్తున్న సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. దీంతో పాటు ఎలాంటి పనులు చేసిన విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా గౌరవం పొందుతారు. బృహస్పతి అనుగ్రహం వల్ల వీరికి విశ్వాసం పెరుగుతుంది. దీని కారణంగా కొన్ని కఠినమైన పనులు కూడా సులభంగా చేస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు విదేశాల్లో ఉద్యోగాల కోసం వెళ్లేవారికి అనుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే వ్యాపారాలు చేస్తున్నవారు కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. అంతేకాకుండా కొత్త విషయాలు కూడా తెలుసుకుంటారు.
మీన రాశి:
మీన రాశివారికి కూడా బృహస్పతి అనుగ్రహం ఎల్లప్పుడు లభిస్తుంది. దీని కారణంగా ఎలాంటి పనులైనా ఆసక్తితో చేస్తారు. దీంతో పాటు విజయాలు సాధించడంలో కూడా ముందుంటారు. స్థానికంగా వ్యాపారాలు చేస్తున్నవారికి బోలెడు లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా చదువుకునే విద్యార్థులకు అనుకోని ర్యాంకులు కూడా లభిస్తాయి. అలాగే ఆటంకాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఆరోగ్యం పరంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి. దీంతో పాటు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి కూడా చూపుతారు. దీంతో పాటు స్నేహితుల సపోర్ట్‌తో ఎలాంటి పనులైనా చేయగలుగుతారు. దీంతో పాటు ఆర్థికంగా కూడా చాలా వరకు పురోగతి పొందుతారు.
బృహస్పతి అనుగ్రహం ఉంటే ఏ రాశులవారైనా జీవితంలో ఆనందం పొందుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే ఆర్థికంగా కూడా మెరుగుపడతారు. దీంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. ముఖ్యంగా తరచుగా భాగస్వామ్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారమవుతాయి.
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.