Guru Gochar 2023: త్వరలో మేషరాశిలో గురు గోచారం.. ఇక ఈరాశుల జేబులో పైసా కూడా మిగలదు..

Guru Chandaal Yog 2023:  ఏప్రిల్ 22న బృహస్పతి మీన రాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశించబోతున్నారు. ఇప్పటికే రాహువు కూర్చున్నాడు. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశులవారు ఆర్థికంగా నష్టపోనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 9, 2023, 09:11 AM IST
Guru Gochar 2023: త్వరలో మేషరాశిలో గురు గోచారం.. ఇక ఈరాశుల జేబులో పైసా కూడా మిగలదు..

Jupiter Gochar In Aries 2022: ప్రతి ఫ్లానెట్ ఒకానొక టైం తర్వాత తన స్థానాన్ని ఛేంజ్ చేస్తుంది. ఈ గ్రహాల రాశి మార్పు ప్రజలందరిపై శుభ మరియు అశుభ ప్రభావాలను చూపుుతంది. ఈ ఏడాది కొన్ని ముఖ్యమైన గ్రహాల గమనంలో మార్పు రానుంది. వీటిలో బృహస్పతి కూడా ఉంది. ఏప్రిల్ 22న గురు గ్రహం మీనరాశిని వదిలి మేషరాశిలోకి ఎంటర్ అవ్వనుంది. ఇప్పటికే మేషరాశిలో రాహువు కూర్చుని ఉన్నాడు. గురు మరియు రాహు కలయిక వల్ల అరుదైన గురు చండాల యోగం ఏర్పడింది. ఈ యోగం యెుక్క ప్రతికూల ప్రభావం ఏ రాశివారిపై పడుతుందో తెలుసుకుందాం. 

ఈ రాశులవారు జాగ్రత్త
కర్కాటక రాశి
బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించడం మరియు రాహువుతో కలయిక కర్కాటక రాశివారి జీవితంలో అనేక సమస్యలను సృష్టిస్తుంది. ఈ సమయంలో మీరు శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. ఆఫీసులో మీ పరిస్థితి అంతగా ఉండదు. గురు చండాల యోగం మీ కష్టాలను పెంచుతుంది. ఈ టైంలో మాటలను అదుపులో ఉంచుకోండి. 
మిధునరాశి 
గురు, రాహువుల కలయికతో గురు చండాల యోగం ఏర్పడుతుంది. దీంతో మిథున రాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సమయంలో పెట్టుబడులకు దూరంగా ఉండండి. షేర్ మార్కెట్‌లో, లాటరీలో పెట్టుబడి పెట్టే ముందు ఒకసారి ఆలోచించండి. డబ్బుకు లోటు రావచ్చు. మానసిక ఒత్తిడికి గురవుతారు. 
మేషరాశి
మేషరాశిలో బృహస్పతి సంచారం మరియు మేషరాశిలో రాహువు ఉండటం వల్ల ఈ రాశి వారికి సమస్యలు పెరుగుతాయి. ఈరాశివారికి ధన నష్టం ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎదుర్కోంటారు. పని ప్రదేశాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టడం మానుకోండి. 

Also Read: Venus transit 2023: ఫిబ్రవరి 15న మీనరాశిలోకి లవ్ గురు.. ఈ రాశుల వారిపై డబ్బు వర్షం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News