Jupiter Retrograde 2023: మరో రెండు రోజుల తర్వాత ఈ 3 రాశుల దశ తిరగనుంది.. ఇందులో మీరున్నారా?

Guru Vakri 2023: ఆస్ట్రాలజీలో బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. మరో రెండు రోజుల్లో గురుడు తన గమనాన్ని మార్చనున్నాడు. బృహస్పతి తిరోగమనం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 2, 2023, 05:57 PM IST
Jupiter Retrograde 2023: మరో రెండు రోజుల తర్వాత ఈ 3 రాశుల దశ తిరగనుంది.. ఇందులో మీరున్నారా?

Jupiter Retrograde 2023: సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం బృహస్పతి. సాధారణంగా గ్రహాల తిరోగమనం చెడు ఫలితాలను ఇస్తుంది. మరో రెండు రోజుల తర్వాత అంటే సెప్టెంబరు 04న గురుడు రివర్స్ లో కదలనున్నాడు. బృహస్పతిని అదృష్టం, ఆనందం మరియు సంపదకు కారకుడిగా భావిస్తారు. బృహస్పతి తిరోగమనం కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభకరంగానూ ఉంటుంది. ఇదే రాశిలో గురుడు 118 రోజుల పాటు ఉండనున్నాడు. బృహస్పతి రాశి మార్పు ఏయే రాశులవారికి లాభాలను ఇస్తుందో తెలుసుకుందాం. 

బృహస్పతి తిరోగమనం ఈ 3 రాశులకు వరం
సింహరాశి
బృహస్పతి తిరోగమనం సింహరాశి వారికి లాభాలను ఇస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. ప్రతి పనిలో అదృష్టం మీ వెంటే ఉంటుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
తులారాశి
గురుడు రివర్స్ కదలిక మీకు అదృష్టాన్నిస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. మీ జీవిత భాగస్వామితో గొడవలు సద్దుమణుగుతాయి. మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది. మీకు పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపారస్తులకు ఈ సమయం బాగుంటుంది. 
మేషరాశి
గురుడు రాశి మార్పు మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అందులో విజయం సాధిస్తారు. మీరు భారీగా డబ్బును ఆదా చేస్తారు. మీకు ప్రతి పనిలో అదృష్టం కలిసి వస్తుంది. మీరు కెరీర్ లో ముందుకు సాగుతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. 

Also Read: Rahu Transit 2023: రాహువు సంచారంతో అక్టోబర్‌ 30 నుంచి ఈ 5 రాశులవారికి ఆకస్మిక లాభాలు, ఆర్థికంగా బోలెడు లాభాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News