Jupiter Transit in Aries June 2023: హిందువులు బృహస్పతిని దేవతలకు గురువుగా భావిస్తారు. ఇతడిని అదృష్టం మరియు సంతానానికి కారకుడిగా భావిస్తారు. ప్రస్తుతం గురుడు మేషరాశిలో సంచరిస్తున్నాడు.12 ఏళ్ల తర్వాత మేషరాశిలో బృహస్పతి గోచారం వల్ల వ్యతిరేక రాజయోగం ఏర్పడింది. ఇది రెండు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. దీని కారణంగా మీకు దేనికీ లోటు ఉండదు. 6, 8 మరియు 12 వ గృహాల అధిపతులు ఇతర గ్రహాలతో కలిసి వచ్చినప్పుడు ఏదైనా రాశిలో విపరీత యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ఏ రాశుల అదృష్టం తెరుచుకుంటుందో తెలుసుకుందాం.
మిథునరాశి
బృహస్పతి సంచారం వల్ల ఏర్పడిన వ్యతిరేక రాజయోగం మిథునరాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. గురుడు ఈ రాశి యెుక్క లగ్న గృహంలో సంచరించనున్నాడు. విపరీత రాజయోగం వల్ల దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల లాభాలను పొందుతారు. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. మీ వివాహం కుదిరే అవకాశం ఉంది.
Also Read: Guru Chandal Rajyog: గురు చండాల యోగం మెుదలు... అక్టోబరు 30 వరకు ఈ 3 రాశులకు నరకం..
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో తొమ్మిదవ ఇంటికి మరియు ఆరవ ఇంటికి గురువును అధిపతిగా భావిస్తారు. బృహస్పతి ఈ రాశిచక్రంలోని పదో ఇంట్లో సంచరించాడు. వ్యతిరేక రాజయోగం మీ వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరిసేలా చేస్తుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు కోరుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. అయితే ఈసమయంలో మీరు అనారోగ్య సమస్యలను ఎదుర్కోనే అవకాశం ఉంది.
Also Read: Vakri Shani 2023: ఇవాళే శని తిరోగమనం.. ఈ రాశుల జీవితం అల్లకల్లలోం.. మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook