Jupiter Transit 2023: మరో రెండ్రోజుల్లో ఈ రాశి జాతకాల జీవితం బంగారంలో మెరిసిపోనుంది

Jupiter Transit 2023: హిందూమతం ప్రకారం అన్ని గ్రహాలు నిర్ణీత సమయంలో రాశి మారుతుంటాయి. ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు ప్రభావం ఒక్కోలా ఉంటుంది. కొన్ని రాశులకు అనుకూలంగా ఉంటే..మరి కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉండనుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 20, 2023, 07:07 AM IST
Jupiter Transit 2023: మరో రెండ్రోజుల్లో ఈ రాశి జాతకాల జీవితం బంగారంలో మెరిసిపోనుంది

Jupiter Transit 2023: గురు గ్రహం ఏప్రిల్ 22వ తేదీన మేష రాశిలో అస్తావ్యస్థలో ప్రవేశించనున్నాడు. మరో రెండ్రోజుల్లో జరగనున్న ఈ పరిణామంతో ఈ రాశులవారి జాతకం బంగారంలా మెరిసిపోనుంది. గురు గ్రహం కటాక్షంతో అంతులేని ధన సంపద లభిస్తుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఏప్రిల్ 22వ తేదీన మేష రాశిలో గురుగ్రహం మారనున్నాడు. 1 మే, 2024న వృషభరాశిలో 
గురుడు ఉదయించనున్నాడు. గురుడి రాశి పరివర్తనం మాత్రం అత్యంత శుభప్రదంగా ఉండనుంది. ఈ ప్రభావం మొత్తం 12 రాశులపై పడనుంది. గురు గ్రహ గోచారం పాజిటివ్ ప్రభావం ఏయే రాశులపై పడనుందో తెలుసుకుందాం..

వృశ్చిక రాశి జాతకులకు గురు గ్రహం రాశి పరివర్తనం ప్రభావం అనుకూలంగా ఉండనుంది. ప్రత్యర్ధులపై విజయం సాధిస్తారు. కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. పనిచేసేచోట చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడం, ఆదాయపు మార్గాలు కొత్తగా ఏర్పడటం జరుగుతుంది. వ్యాపారులకు సైతం అనువైన సమయం. కొత్త వ్యాపారాలు లాభాల్ని ఆర్జిస్తాయి. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. 

సింహ రాశి జాతకులు గురుగ్రహం రాశి పరివర్తనం ప్రభావంతో అత్యంత అదృష్టవంతులుగా ఉండనున్నారు. ఈ సమయం ఈ రాశివారికి చాలా అనుకూలమైంది. వ్యాపారులకు బాగుంటుంది. కొన్ని నిర్ణయాలు మాత్రం ఆలోచించి తీసుకోవాలి. విద్యార్ధులకు చాలా మంచి సమయం. 

ధనస్సు రాశి జాతకులకు గురుడి రాశి పరివర్తనం వల్ల పదోన్నతులు, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. వ్యాపారంలో కొత్త భాగస్వామి రావచ్చు. పెద్ద పెద్ద క్లయింట్లు వచ్చే అవకాశముంది జాగ్రత్తగా డీల్ చేయాలి. మీకు లభించే పెద్ద పెద్ద ఆర్డర్లు మీ అదృష్టాన్ని మార్చేస్తాయి. కుటుంబసభ్యులతో ఎక్కవ సమయం గడుపుతారు. 

కన్యా రాశి జాతకులకు గురుడి రాశి పరివర్తనం ప్రభావం చదువు, మతం, కన్సల్టెన్సీ రంగాలకు చెందినవారికి బాగుంటుంది. కెరీర్‌లో ఉన్నత స్థానం అలంకరిస్తారు. పెద్దఎత్తున డబ్బులు లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైన ఆర్ధిక ఇబ్బందులు బాధించవు.

మేష రాశి జాతకులకు గురుడి రాశి ప్రవేశం ప్రభావం ఊహించని లాభాన్నిస్తుంది. పెళ్లి కాని యువతీ  యువకులకు ఆ యోగం ఉంది. చదువు, మతం వంటి రంగాల్లో ఉన్నవాళ్లకు ఉన్నత స్థానం లభిస్తుంది. కుటుంబంలో సోదరుల సహకారం లభిస్తుంది.  ఉద్యోగంలో పై అధికారుల మద్దతు ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. 

కర్కాటక రాశి జాతకులకు గురువు రాశి పరివర్తనం ప్రభావం కీలకంగా ఉండనుంది. పెద్దల్ని గౌరవించాల్సి ఉంటుంది. ఆదాయం పెరగకపోయినా పదవీ బాధ్యతలు పెరుగుతాయి. కర్కాటక రాశి జాతకులు భూమి కొనుగోలు వ్యవహారాల్లో పెట్టుబడి పెట్టేందుకు మంచి సమయం.

వృషభ రాశి జాతకులు చేసే పెట్టుబడులు భవిష్యత్తులో అమితమైన లాభాల్ని ఇస్తాయి. ఇళ్లు, వాహనం కొనాలనుకుంటే ఇది మంచి సమయంగా చెబుతారు. ఉన్నత చదువులకై విదేశాలకు వెళ్లే ఆలోచన ఉంటే మంచి నిర్ణయం కాగలదు. 

మిధున రాశి జాతకులకు గురువు రాశి పరివర్తనం ప్రభావం అత్యంత శుభప్రదం కానుంది.కెరీర్ విషయంలో ఉన్నత స్థానం లభిస్తుంది. కొత్త ఉద్యోగావకాశాలు లబిస్తాయి. ఆర్దికంగా మంచి స్థితిలో ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. వివిధ వ్యాధుల్నించి ఉపశమనం పొందుతారు. 

Also read: Solar Eclipse 2023: సూర్య గ్రహణం తరువాత ఈ ఉపాయాలు ఆచరిస్తే డబ్బులకు కొదవుండదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News